EPISODE · Aug 24, 2023 · 12 MIN
కొత్త కెరటం! ఎపిసోడ్ - 2 | Kottha Keratam Episode 2 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'కొత్త కెరటం! ఎపిసోడ్ - 2' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 2' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ: అచ్యుతాపురం గ్రామంలోని ఒక మోతుబరి రైతు రామయ్య, ఆయన భార్య జానకి. వారి కుమారుడు రాజేంద్ర, కోడలు కళ్యాణి. డెలివరీ కోసం అడ్మిట్ అయిన కళ్యాణి పరిస్థితి సీరియస్ అని చెబుతారు డాక్టర్లు. హాస్పిటల్ లో సూరజ్ అనే వ్యక్తి తారసపడతారు రాజేంద్రకి. తాను రామయ్య గారి సహాయంతో చదువుకున్నానని చెబుతాడు అతను. ఇక కొత్త కెరటం! ఎపిసోడ్ - 2 చదవండి చేతులు తుడుచుకుంటూ థియేటర్ లోంచి బయటకి వచ్చిన డాక్టర్ కి ఆందోళనగా తనవైపే చూస్తున్న రాజేంద్ర కనిపించాడు. “నా భార్య ఎలా ఉంది, బిడ్డ క్షేమమేనా, చెప్పండి డాక్టర్” “తల్లి క్షేమమే. ఇంకా స్పృహలోనికి రాలేదు. ప్రసవానికి ముందే చాలా నీరసించి పోయినందువల్ల జనరల్ అనస్థీషియా ఇవ్వాల్సి వచ్చింది” “మరి బిడ్డ?” “ఆడబిడ్డ. బ్రతికించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వెరీ సారీ” అన్నాడు. “అయ్యో!” పుట్టిన బిడ్డ మరణించిందని విని దుఃఖిస్తూ కుర్చీలో కూలబడ్డాడు రాజేంద్ర. “ధైర్యంగా ఉండండి” ఓదార్పుగా రాజేంద్ర భుజం తట్టి, ప్రక్కనే సూరజ్ ని చూసి “ఓ హలో! మీరేమిటీ ఇక్కడ.. ” ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కరచాలనం చేసారు డాక్టర్. “హలో డాక్టర్ బాగున్నారా? చిన్న పనిమీద వచ్చాను. ఈలోగా వీరు కనిపించారు. వీరి కుటుంబమంతా నాకు అత్యంత ఆప్తులు. అదెలా అన్నది ఒక పెద్దకథ. తరువాత ఎప్పుడైనా చెప్తాను అవకాశమొస్తే” అనునయింపుగా రాజేంద్ర వీపు నిమురుతూ బదులిచ్చాడు. “ఓ ష్యూర్! మరిక వస్తానూ మీ ఫ్రెండ్ కి ధైర్యం చెప్పండి” అని డాక్టర్ వెళ్ళిపోయారు. “నువ్వే ఇలా అధైర్యపడితే చెల్లెమ్మనీ అమ్మానాన్నలనీ ఎవరు సముదాయిస్తారు, సంబాళించుకో” చనువుగా, సంభోదనని మీరునుంచి నువ్వులోకి మార్చి, ప్రక్కనే కూర్చుని భుజంపై చేయి వేసాడు సూరజ్. “నీకు తెలీదు. పుట్టబోయే బిడ్డ గురించి శుభవార్త వినాలని అమ్మానాన్నా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు బిడ్డ మృతిచెందిందని తెలిస్తే తట్టుకోలేరు” విలపించసాగాడు. “నేను అర్థం చేసుకోగలను. కానీ కొంతలో కొంత అదృష్టం చెల్లెమ్మ క్షేమంగా ఉంది. అందుకు సంతోషిద్దాము” “నిజమే కనీసం కళ్యాణైనా నాకు దక్కినందుకు ఆనందంగానే ఉంది. కానీ.. ” “బిడ్డ చనిపోవడం బాధాకరమే అయినా మున్ముందు మీకు మళ్ళీ బిడ్డలు పుట్టొచ్చునుగా. ఎందుకంత నిరాశ?” “కళ్యాణికి ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు” “అయ్యో అలాగా!” బాధగా అని సాలోచనగా రాజేంద్ర వైపు చూసి దేని గురించో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా దీర్ఘశ్వాశ తీసుకుని “రాజేంద్ర! నాతో రా ఒకసారి” భుజాలు పట్టుకుని లేవదీస్తూ అన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/_SV9Qx2xDy0
Embed this episode
NOW PLAYING
కొత్త కెరటం! ఎపిసోడ్ - 2 | Kottha Keratam Episode 2 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.