కొత్త కెరటం! ఎపిసోడ్ - 3 | Kottha Keratam Episode 3 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 29, 2023 · 12 MIN

కొత్త కెరటం! ఎపిసోడ్ - 3 | Kottha Keratam Episode 3 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Kotha Keratam Episode 3' - New Telugu Web Series Written By Dinavahi 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 3' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ: అచ్యుతాపురం గ్రామంలోని ఒక మోతుబరి రైతు రామయ్య, ఆయన భార్య జానకి. వారి కుమారుడు రాజేంద్ర, కోడలు కళ్యాణి. డెలివరీ కోసం అడ్మిట్ అయిన కళ్యాణి పరిస్థితి సీరియస్ అని చెబుతారు డాక్టర్లు. హాస్పిటల్ లో సూరజ్ అనే వ్యక్తి తారసపడతాడు రాజేంద్రకి. తాను రామయ్య గారి సహాయంతో చదువుకున్నానని చెబుతాడు అతను. రాజేంద్ర భార్య క్షేమంగానే ఉందనీ, పుట్టిన బిడ్డ మరణించిందనీ చెబుతాడు డాక్టర్. తనకు కొడుకు పుట్టి రెండు రోజులే అయిందనీ, డెలివరీ కాగానే తన భార్య చనిపోయిందనీ చెబుతాడు సూరజ్. తాను అమెరికా వెళ్ళిపోతున్నట్లు చెబుతాడు. తన కొడుకును పెంచుకొమ్మని రాజేంద్రతో చెబుతాడు సూరజ్. కొత్త కెరటం! ఎపిసోడ్ - 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి. కొత్త కెరటం! ఎపిసోడ్ - 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక కొత్త కెరటం! ఎపిసోడ్ - 3 చదవండి. అంతలోనే అటుగా వచ్చిన వ్యక్తులను చూసి “మీలో రాజేంద్ర ఎవరు?” అని అడిగింది. “నేనే” అనగానే రామయ్యగారు అనే వ్యక్తి ఫోన్ చేయమన్నారని చెప్పి వెళ్ళిపోయింది నర్స్. “అయ్యో అసలు ఆ విషయమే మర్చిపోయాను సుమా! నాన్నెంత కంగారుపడుతుంటారో? ఇప్పుడే చేస్తాను” “ఆగాగు మనం అనుకున్నట్లు అంతా సర్దుబాటు చేసాక శుభవార్త చెప్దువుగాని. ముందుగా డాక్టర్ ని కలుద్దాము పద” వారిస్తూ అటుగా అడుగులు వేసాడు సూరజ్. “ఓ! సరే సరే” ఫోన్ జేబులో పెట్టుకుని, అవసరమైతే పిలవమని కళ్యాణి అటెండర్ కి చెప్పి, సూరజ్ ని అనుసరించాడు. డాక్టర్ ఛాంబర్ కు వెళ్ళి “మే ఐ కమిన్” తలుపు తట్టాడు సూరజ్. “కమిన్” లోనికి వచ్చిన వ్యక్తులను చూసి “ఓ మీరా రండి కూర్చోండి” కుర్చీలు చూపిస్తూ సైగ చేసాడు. “థాంక్యూ” “మీ స్నేహితుడిని వెంటబెట్టుకుని వచ్చారేమిటీ విశేషం?” రాజేంద్ర వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగాడు. “మీతో అత్యవసరమైన పనుండి వచ్చాము” “చెప్పండి” తనకీ రాజేంద్ర పరివారానికీ ఉన్న పరిచయం, వాళ్ళు చేసిన సహాయం క్లుప్తంగా చెప్పి “మీకు తెలుసు కదా నా భార్య మగబిడ్డని ప్రసవించి చనిపోయిందనీ, రాజేంద్ర భార్యకి పుట్టిన ఆడబిడ్డ చనిపోయిందని” “అవునూ. అయితే?” డాక్టర్ భృకుటి ముడివడింది. “కళ్ళైనా తెరవకముందే తల్లిని కోల్పోయిన నా బిడ్డకి తల్లినీ, బిడ్డని పోగొట్టుకున్న విషయమే తెలియని అపస్మారక స్థితిలో ఉన్న ఆ తల్లికి బిడ్డనీ ఇవ్వమని మిమ్మల్ని అర్థించడానికి వచ్చాను” “అంటే?” “నా బిడ్డని ఇతని భార్యకి ఇచ్చి ఆతడి చనిపోయిన బిడ్డని నేను తీసుకునేలా. అందుకు మీరు తోడ్పడాలని అర్థిస్తున్నాను” “అదెలా? అది మా ఆస్పత్రి నియమాలకి విరుద్ధం” డాక్టర్ స్వరంలో తీవ్రత. “నాకు తెలుసు డాక్టర్ అడగకూడనిది అడుగుతున్నానని. కానీ ఈ విషయంలో మానవతా ధృక్పథంతో ఆలోచించి నా బిడ్డకి తల్లి ప్రేమని ప్రసాదించమని, మనవల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వృద్ధ దంపతులు, రాజేంద్ర తల్లిదండ్రుల మనసులలో ఆనందం నింపమని వేడుకుంటున్నాను” “...............” “ఇది మీ ఆస్పత్రి. మీరు తలుచుకుంటే తప్పక ఈ సహాయం చేయగలరు ప్లీజ్” ప్రాధేయపడ్డాడు సూరజ్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Q9fGbvI0q94

Episode metadata supplied by the publisher feed · Published Aug 29, 2023

Embed this episode

NOW PLAYING

కొత్త కెరటం! ఎపిసోడ్ - 3 | Kottha Keratam Episode 3 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com

0:00 12:05

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 12 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 29, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!