EPISODE · Sep 4, 2023 · 13 MIN
కొత్త కెరటం! ఎపిసోడ్ - 4 | Kottha Keratam Episode 4 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Kotha Keratam Episode 4' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 4' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ‘వంశాంకురం కోసం అత్తమామలు ఎంతగానో పరితపించినా, నా ప్రాణాలే ముఖ్యమనుకున్నారంటే వారెంతటి ఉత్తములో తెలుస్తోంది. నేనే వారిని సరిగ్గా అర్థం చేసుకోలేక పోయాను’ కళ్యాణి మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది. ‘ఇకపై ఏ విషయంలోనూ అత్తమామలకు ఎదురాడను, నా ప్రవర్తన ద్వారా వారి మనసులని నొప్పించను. నాకు కష్టమైనా వారి ఇష్టప్రకారమే చేస్తాను’ ఆ క్షణానే ధృఢంగా నిశ్చయించుకుని అప్రయత్నంగా ఇరువురికీ చేతులెత్తి నమస్కరించింది కళ్యాణి. వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కళ్యాణికీ బాబుకీ గుమ్మంలోనే ఎర్ర నీళ్ళతో దిష్టి తీసింది జానకి. మనవడి రాక రామయ్య దంపతుల జీవితంలో క్రొత్త ఉత్సాహాన్ని నింపింది. బాబు పుట్టిన ఇరవై ఒకటో రోజున ఉయ్యాలలో వేసారు. ఆ మర్నాడు సాయంత్రం “అబ్బాయ్ నేనూ అమ్మా కాలనీలో ఉన్న గుడికి వెళ్ళొస్తాము” “సరే నాన్నా. జాగ్రత్త. త్వరగా వచ్చేయండి” తల్లీదండ్రీ అటు వెళ్ళగానే, పిల్లవాడికి పాలు త్రాగిస్తున్న కళ్యాణి వద్దకు వెళ్ళాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/MwgsgbPH0uY
Embed this episode
NOW PLAYING
కొత్త కెరటం! ఎపిసోడ్ - 4 | Kottha Keratam Episode 4 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.