EPISODE · Sep 15, 2023 · 11 MIN
కొత్త కెరటం! ఎపిసోడ్ - 6 | Kottha Keratam Episode 6 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Kotha Keratam Episode 6' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 6' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ రాజేంద్ర చేస్తున్న ఉద్యోగం మారి, పదోన్నతిపై ఒక బహుళ జాతీయ కంపెనీలో చేరాడు. కళ్యాణి కూడా తాను చేస్తున్న కంపెనీలోనే ఉన్నత పదవి అధిరోహించింది. ఆఫీసుకి దగ్గరగా ఉన్న, సుమారు మూడువందల ఫ్లాట్స్, రో హౌసెస్, విల్లాలున్న, ఆనందనిలయం కాలనీలోని ఒక మూడు బెడ్ రూముల విల్లా కొనుక్కున్నారు రాజేంద్ర దంపతులు. కొడుకు గృహప్రవేశానికని హైదరాబాదు వచ్చారు రామయ్య. కాలనీలోనే పేరొందిన సి. బి. ఎస్. ఇ. స్కూలు ఉండడంతో, ఎలిమెంటరీ స్కూలు దాటి హైస్కూలు చదువులకి వచ్చిన భార్గవని అందులో చేర్పించారు. క్రొత్త స్కూలూ, క్రొత్త వాతావరణం, క్రొత్త ఫ్రెండ్స్ కీ అలవాటు పడడానికి ప్రయత్నం చేస్తున్నాడు భార్గవ. ఆరవ తరగతి అర్థ సంవత్సర పరీక్షలు ముగిశాయి. ఒకరోజు స్కూలునుంచి వచ్చీ రాగానే, తాతగారు నవ్వుతూ పలకరించినా బదులివ్వక ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడు భార్గవ. ‘ఎందుకలా ఉన్నాడో! స్కూలులో ఏదైనా జరిగుంటుందా?’ కలవరపడ్డారు రామయ్య. ఏం చేయాలో పాలుపోక ‘అబ్బాయీ కోడలూ ఇంకా ఆఫీసునుంచి రాలేదు. భార్గవకి తోడు ఇంట్లో నేనున్నానే ధైర్యమో లేక ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోందో తెలియదు కానీ ఈమధ్య ఇద్దరూ కొంచం ఆలస్యంగా వస్తున్నారు’ స్వగతంగా అనుకున్నారు. కొంతసేపయ్యాక మనవడి గదిలోకి తొంగిచూసారు ఏం చేస్తున్నాడా అని! ఏడ్చిఏడ్చి నిద్రపోయాడేమో భార్గవ బుగ్గలపై కన్నీటి చారికలు చూసి కలత మనస్కులయ్యారు. సుమారు ఓ గంట తరువాత బయటకి వచ్చి, సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న తాతగారి ప్రక్కన కూర్చున్నాడు భార్గవ, ముఖం వ్రేలాడేసుకుని. మనవడికి వేడి వేడి బోర్నవిటా కలిపిచ్చారు రామయ్య. గటగటా త్రాగేసి గ్లాసు ప్రక్కన పెట్టి “థ్యాంక్స్ తాతయ్యా” అన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/SLRTzZQs9_w
Embed this episode
NOW PLAYING
కొత్త కెరటం! ఎపిసోడ్ - 6 | Kottha Keratam Episode 6 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.