EPISODE · Sep 30, 2023 · 13 MIN
కొత్త కెరటం! ఎపిసోడ్ - 9 | Kottha Keratam Episode 9 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Kotha Keratam Episode 9' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 9' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “నాటకం వేసేది అబ్బాయిలైతే నటులు అనీ అమ్మాయిలైతే నటీమణులు అనీ అంటారు” “మరి నేను వేస్తే?” “బాలనటుడు” “ఓ భలే భలే భార్గవ బాలనటుడు” చప్పట్లు కొట్టి నాటకం చూడటంలో నిమగ్నమైపోయాడు. నాటకం పూర్తై వెళ్ళేటప్పుడు ఉన్నట్లుండి “తాతయ్యా నేనూ పెద్దయ్యాక నాటకం వేస్తాను” అన్నాడు. “అలాగేలే పద” పిల్లలకి ఏదైనా క్రొత్తగా అనిపిస్తే చాలు తామూ అదే చేస్తామంటూ ఉత్సాహపడతారనుకుని నవ్వుకున్నారు. అందరూ కలిసి రంగులరాట్నం తిరిగారు. మధ్యాహ్న సమయానికి ఇంటినుంచి తెచ్చుకున్న భోజనం చేసి మళ్ళీ జాతరలో విశేషాలన్నీ చూస్తూ తిరిగినంతసేపు తిరిగి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. మొదటిసారి చూసాడేమో భార్గవకి జాతర ఎంతో నచ్చింది. ఎప్పుడెప్పుడు హైదరాబాదు వెళతానా ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్ కి విశేషాలన్నీ ఏకరువు పెడతానా అనుకుంటూ గడిపాడు తక్కిన రోజులన్నీ! &&& తండ్రి షష్టి పూర్తి ఘనంగా జరిపించి, జాతర చూసుకుని, పది రోజుల తర్వాత, రాజేంద్ర కుటుంబం హైదరాబాదు తిరిగి వచ్చారు. ఆ తర్వాత కొన్ని నెలలు పొలం పనులలో బిజీగా గడిచాయి రామయ్యకి. మధ్యలో మనవడిని చూడాలని మనసులాగినా పని ఒత్తిడివలన కదలలేకపోయారు. అప్పటికే పది సార్లు “తాతయ్యా గమ్మున వచ్చేయండి నాకేం తోచడం లేదు” అంటూ మనవడి ఫోన్లు. “నీ ఆత్రం బంగారం కానూ! మొన్ననేగా కలుసుకున్నాము. ఇంతలోనే బెంగా! ఇక్కడి పనులు పూర్తి కావద్దూ” ఏదో మనవడిని బులిపించడానికి అన్నారే కానీ ఆయన ధ్యాసంతా మనవడి మీదనే. ఇలా పనులయ్యాయో లేదో, అలా హైదరాబాదు ప్రయాణమయ్యారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Ynp7DTW55do
Embed this episode
NOW PLAYING
కొత్త కెరటం! ఎపిసోడ్ - 9 | Kottha Keratam Episode 9 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.