EPISODE · Feb 1, 2023 · 6 MIN
క్రమవర్తనం | Kramavarthanam | TeluguArticle | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) క్రమవర్తనం సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) తల్లిదండ్రులు గురువులు పిల్లలకు చక్కటి ఆదర్శాలను నేర్పుతారు. ఎదిగే కొద్దీ కొందరు పిల్లలు ఆ నీతి వాక్యాలను గాలికి వదిలేస్తారు. వారి దృష్టిలో కాలగమనంలో ఆశయాలు ఆచరణకు అందనవిగా మారిపోతాయి. కొందరి విషయంలో ఆశయాలు వారి క్రమవర్తన... తత్వ రీత్యా వారికి అనుకూలం. అవుతాయి. ప్రతి మనిషికి ఆశలు వుంటాయి. ఆశయాలూ వుంటాయి. తమ లక్ష్యాన్ని ఎలాగైనా సాధించాలను కుంటారు కొందరు. అంటే వారి చర్యల వలన ఇతరులకు కలిగే బాధలు వారికి లెక్కలేదు. వారి లక్ష్యసాధనే వారికి ముఖ్యం. యిది నేటి సభ్యసమాజంలో సిద్ధాంతంగా నమ్మి ఆచరించే విధానం. వీరు వారి జీవిత విధానాన్ని ఇలాగే సాగించి సాగించి... ఒక నాడు మట్టిలో కలిసిపోతారు. జనం, పోయిన వారిని గురించి వారికి బాధలేదు. ఆనందమేమో!... బహు కొద్దిమంది నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ... ఎన్నో కష్టాలను, కన్నీటినీ అనుభవిస్తూ... 'అంతా నీ నిర్ణయం' అని పై వాణ్ణి తలచుకొంటూ... బరువు బ్రతుకులను లాగి లాగి, కడకు కళ్ళు మూస్తారు. అన్ని వర్గాల వారిలోను... యీ రెండు తెగల వ్యక్తులు కొందరున్నారు. 'చెట్టు కొలది గాలి' అన్నట్లు వర్తిస్తున్నారు. ప్రతి తల్లిదండ్రులు సంతతి కలిగినప్పటినుంచి వారిని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి భావిలో ప్రయోజకులై తమకు ఆనందాన్ని... గౌరవాన్ని కలిగించి... తమకు వయస్సు మీరిన తర్వాత... అండదండలుగా సాయంగా నిలుస్తారని ఆశిస్తారు. బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి వారు చేసే ప్రతి పనిలో బిడ్డల యోగ క్షేమాలు దాగి ఉంటాయి. వారి మహత్తర ఆశయం తన బిడ్డలు భవిష్యత్తులో అన్ని విధాల బాగుండాలని.,వారు తమకంటే గొప్పవారు కావాలని. కానీ!... ఎందరో బిడ్డలు చదివి... విజ్ఞానాన్ని సంపాదించుకొని... ఉద్యోగాన్ని సాధించి... నచ్చిన సుందరాంగిని అర్ధాంగిగా చేసుకుని... తమ వర్తమానాన్ని కేవలం తమ స్వార్ధ పూరిత లక్ష్యసాధనలో గతాన్ని మరచి ముందుకు సాగుతున్నారు. ఈ విధానంలో నడిచే వారి వలన వారి తల్లిదండ్రులకు అయిన వారికి ఎన్నో కష్టాలు నష్టాలు. వీడి గోడును వారు లెక్కచేయరు. ఇందులో మరో విశేషం!... జీవిత భాగస్వామి సలహాల ఆచరణ... ఆ ఇల్లాలు మంచి మనస్సు కలదై పుట్టింటి వారిని అత్త ఇంటి వారిని ఒకే రీతిగా చూసుకునే మనస్తత్వం కలిగినదైతే... వారి చర్యలలో మార్పు ఏర్పడదు. దీనికి విరుద్ధంగా అగ్నికి ఆజ్యం తోడైనట్లు భాగస్వామి భర్తతో కలిసిపోతే... అయ్యగారు ఆటబొమ్మగా మారి భార్యా విధేయుడనే సార్ధక నామధేయుడై... అయినవారికి దూరమై... కడకు ఒకనాడు ఊహించని చిక్కుల్లో పడిపోతాడు. వీరి వద్ద పెరిగే వీరి సంతతి చిన్న వయస్సు నుండే వికృతంగా తయారవుతారు. తల్లితండ్రులఅక్రమవర్తనం బిడ్డల పాలిట శాపంగా మారిపోతుంది. చేతులు కాలిన పిదప ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం?... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/VKQ2Y0XzmBM
Embed this episode
NOW PLAYING
క్రమవర్తనం | Kramavarthanam | TeluguArticle | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.