EPISODE · Oct 11, 2022 · 8 MIN
కర్తవ్యం - ఎపిసోడ్ 1 | Karthavyam - Episode 1 | Telugu Web Series | Vedurumudi Ramarao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కర్తవ్యం - ఎపిసోడ్ 1 రచన: వెదురుమూడి రామారావు వెదురుమూడి రామారావు గారి మినీ సీరియల్ ప్రారంభం ‘లాయర్ విశ్వనాథం’ గారికి హై కోర్ట్ లోనే కాదు, సుప్రీమ్ కోర్టు లో కూడా మంచి పేరుంది. సుమతి అయన సతీమణి. మంచి జంటగా, అందరికి మంచి చేసే మంచి మనసు గల పెద్దలుగా, వాళ్లు మహా మంచి వాళ్లుగా పేరు తెచ్చు కొన్నారు. ఎవరు ఢిల్లీ వెళ్లినా వాళ్లను కలవకుండా, వారి ఆతిధ్యం తీసుకోకుండా రారు. పిల్లలు ఆస్ట్రేలియా లో సెటిల్ ఐపోయారు. అందుకని ఎవరైనా వాళ్ళ ఇంటికి వస్తే వాళ్లకు పండగ. వచ్చిన వాళ్ళను ఎంతో ఆప్యా యంగా చూసుకొని వాళ్ళు ఉన్నన్నాళ్ళు సరదాగా గడిపేస్తారు. వచ్చిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉండి తీరతారు. సాయంత్రం కోర్ట్ నుంచి హడావిడిగా ఇంటికి వస్తూనే కాఫీ కూడా తాగకుండా "సుమతీ! నీకు.. మనోహర్, సుధా, హైదరాబాద్ లో కలిసాం.. వాళ్ళు గుర్తు వున్నారా? వాళ్ళ పెళ్లి కి కూడా మనం వెళ్ళాం.. మీ రఘు మావయ్య కొడుకు, కోడలు. వాళ్ళు రేపు పొద్దున్నే వస్తున్నారు. కొన్నాళ్ళు మన దగ్గర ఉంచుకొందాం. ఎలాగూ కోర్ట్ కి కూడా సెలవలు వస్తున్నాయి కదా. అందరం కలసి ఎక్కడికైనా సరదాగా వెళ్ళచ్చు కూడా" అంటూ గాలి పీల్చుకొన్నారు. మర్నాడు వాళ్లు వచ్చిన దగ్గర నుంచి ఎంతో ఆప్యాయంగా వాళ్ళకి అన్నీ అమర్చి, సంతోషంగా చూసుకొన్నారు. ఒక రోజు రెస్ట్ ఇచ్చి తరువాత వాళ్ళ కి కావలసిన విధంగా ప్రోగ్రాము వేద్దాము అని నిర్ణయించారు. బ్రేక్ఫాస్ట్, లంచ్ , డిన్నర్ అన్నిటికీ మంచి ‘డిషెస్’ చేసి పెట్టారు. మర్నాడు బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద ఢిల్లీ లో తన సాయం ఏమైనా అవసరం వుందా అని అడిగారు విశ్వనాథం గారు. “లేదు అంకుల్! కొంచం చేంజ్ కోసం, కొన్నాళ్ళు మీతో ఉందాము అని వచ్చాము. అంతకన్నా ఏమీ లేదు” అని ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు మనోహర్. వచ్చిన దగ్గరనుంచి వాళ్లని గమనిస్తూనే వున్నారు దంపతులిద్దరూ. ఏదో ముభావంగా, యెడ మొహం పెడమొహంగా వున్నట్టు సూచనగా అనిపించింది. ప్రయాణం బడలికే అని సర్దుకున్నారు. కానీ ఏదో దాస్తున్నారు అని అర్ధమైంది. శాంత పడ్డానికి కొంచం సమయం వాళ్లకి ఇవ్వాలి అని అర్ధమైంది . మరేం మాట్లాడకుండా వాళ్లని రెస్ట్ తీసుకోమని చెప్పి పంపారు. డిన్నర్ టైంలో, ‘వాతావరణం అనుకూలంగా వుంది. అసలు విషయం ఏమిటో తెలుసుకొందాం’ అని విశ్వనాథం గారు, భార్య కూడబలుక్కొన్నారు. వాళ్ళు కూడా కొంచం స్థిమిత పడినట్టే వున్నారు. మిగతా విషయాల తర్వాత మెల్లగా విశ్వనాథం గారు మంద్రస్వరం తో "విషయం ఏమిటో మాతో చెప్పుకొంటే బాగుంటుంది. మీరిద్దరూ ఎందుకిలా వున్నారు? మేము ఏమైనా చేయగలిగితే చేస్తాము. మాకు చెప్పండి " అని అడిగారు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/MRHURcIxbyA
Embed this episode
NOW PLAYING
కర్తవ్యం - ఎపిసోడ్ 1 | Karthavyam - Episode 1 | Telugu Web Series | Vedurumudi Ramarao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.