EPISODE · Oct 18, 2022 · 11 MIN
కర్తవ్యం - ఎపిసోడ్ 2 | Karthavyam - Episode 2 | Telugu Web Series | Vedurumudi Ramarao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కర్తవ్యం - ఎపిసోడ్ 2 రచన: వెదురుమూడి రామారావు గత ఎపిసోడ్ లో విశ్వనాథం మంచి పేరున్న లాయర్. అయన భార్య సుమతి. అందరికీ మంచి చేసే స్వభావం ఉన్న వారు వాళ్లిద్దరూ. వాళ్ళ ఇంటికి వచ్చిన మనోహర్, సుధ ల మధ్య మనస్పర్థలు ఉండటం గమనిస్తారు. ఎలాగైనా వాళ్ళను కలపాలనుకుంటారు. ఇక కర్తవ్యం రెండవ భాగం చదవండి. పెసరట్టు ఉప్మా, వేడివేడిగా కొబ్బరిచట్నీ తో రెడీగా బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద నోరు ఊరిస్తున్నాయి. చేతిలో న్యూస్ పేపర్ తో విశ్వనాధం గారు "అందరు తొందరగా రండి. చల్లారి పోతుంది మళ్ళీ" అంటూ గబగబా వచ్చి కూర్చొన్నారు. ‘పిల్లలు రాకుండా మీరు ఏంటి తొందర పడుతున్నారు’ అంటూ సుమతి మళ్ళీ మనోహర్, సుధా లని బ్రేక్ఫాస్ట్ కి ప్రేమగా పిలిచారు. మెల్లగా ఉప్మా ని ఆస్వాదిస్తూ విశ్వనాధం గారు ప్రస్తావన తెచ్చారు. పిల్లలిద్దరూ ఇంకా అటు ఇటు చూస్తూనే వున్నారు. భావోద్వేగాల లో ఏమీ మెరుగు కనిపించలేదు.. "ఎలాగా కోర్ట్ కి సెలవలు కదా. సోమ వారంవరకు మనకు టైం వుంది. డివోర్స్ విషయం మళ్ళీ కోర్ట్స్ తీసే వరకు వాయిదా వేద్దాం. మనం కోర్ట్ కి అప్లై చేసినతరువాత కూడా ఎలాగా వాళ్ళిద్దరినీ కొంత కాలం దగ్గరగా గడపమనీ, ఆ తరువాత హియరింగ్ కి రమ్మనీ చెపుతారు. ఈ లోపున మీరు మాకు చిన్న సహాయం చెయ్యాలి. చాలా కాలం నించి నేను, మీ ఆంటీ షాపింగ్ చేద్దాం అనుకొంటున్నాము. సరయిన కంపెనీ లేక బయటికే పోలేదు. మీరు మాకు కావలిసిన సెలెక్షన్స్ చేయాలి. ముందుగా మనం షాపింగ్, తరువాత ఢిల్లీ దర్శన్ చేద్దాం. మద్రాస్ కేఫ్ లో లంచ్ చేద్దాం. సాంబార్ బాగుంటుంది. ప్లీజ్." అన్నారు. మనోహర్ తాను ఇంట్లో వుంటాను సుధ ని తీసుకు వెళ్ళండి అని కొంచం సౌమ్యంగా చెప్పడానికి ప్రయత్నించాడు. సుధ కూడా అలాగే మొహం పెట్టింది. విశ్వనాధం గారు కొంచం నిరాశ తో "అయితే మేము కూడా మానేస్తాం. చాలా రోజుల నించి సాయం లేక మేం వెళ్ళలేదు. మనోహర్- నాకు, సుధ- ఆంటీ కి విడి విడిగా సాయం చేస్తారు, మంచి ఐటమ్స్ కొనుక్కోడానికి సాయపడతారు అని ఆశ పడ్డాం. మాకు కొంత మంచి టైం ఇస్తారని అనుకొన్నాం”. అంటూ టేబుల్ దగ్గరనుంచి లేచి వెళ్ళడానికి తయారు అయ్యారు. ఇరుకులో పడ్డ చిన్న దంపతులు సరే అని ఒప్పుకోక తప్ప లేదు. ముందుగా ‘కన్నాట్ ప్లేస్’, ‘పాలిక బజార్’, లంచ్ తరవాత ‘స్వామినారాయణ్’ ఈ ట్రిప్ లో భాగాలు. కార్ పార్కింగ్ లో పెట్టి, "రండి వెళదాం” అని అందరినీ పిలిచారు విశ్వనాథం. ఆయన చిన్నపిల్లాడికన్నా ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా వున్నారు. మర్యాదగా ఉండదు అని మనోహర్ అయన వెనకనే రెడీ ఐపోయాడు. సుధ మాత్రం సడెన్ గా " నేను కార్ లో కూర్చుంటాను, మీరు వెళ్లి రండి" అని అందరిని ఉద్దేశించి చెప్పి బ్యాక్ సీట్ లో వాలి పోయింది. ఏంచెయ్యాలో అర్ధం కాలేదు సుమతి కి... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/GYqG5T6aT0I
Embed this episode
NOW PLAYING
కర్తవ్యం - ఎపిసోడ్ 2 | Karthavyam - Episode 2 | Telugu Web Series | Vedurumudi Ramarao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.