EPISODE · Oct 25, 2022 · 9 MIN
కర్తవ్యం - ఎపిసోడ్ 3 | Karthavyam - Episode 3 | Telugu Web Series | Vedurumudi Ramarao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కర్తవ్యం - ఎపిసోడ్ 3 రచన: వెదురుమూడి రామారావు వెదురుమూడి రామారావు గారి సంక్షిప్త ధారావాహిక కర్తవ్యం మూడవ భాగం గత ఎపిసోడ్ లో మనోహర్, సుధలతో కలిసి షాపింగ్ కి బయలుదేరుతారు విశ్వనాథం దంపతులు. అక్కడ వారిద్దరినీ కలపడానికి చాల ప్రయత్నాలు చేస్తారు. పిల్లలిద్దరూ కలిసి బోట్ షికార్ చేసేలా ప్లాన్ చేస్తారు. ఇక కర్తవ్యం మూడవ భాగం చదవండి. ఇదేకదా కావలసింది. ఇది మూడవ స్టెప్. ట్రిప్ ముగిసిన తరువాత సంతోషంగా అందరూ మద్రాస్ కేఫ్ వైపు దృష్టి మళ్లించారు. మంచి సౌత్ ఇండియన్ భోజనం ముగించారు. ఇంటికి బయలు దేరే వేళకి అందరు ప్రసన్నంగా వున్నారు. ఇదే సమయం అని విశ్వనాథం గారు మరో ప్రస్తావన తెచ్చారు. "ఇది మంచి సీజన్. మనం కులు, మనాలి, రోతహంగ్ పాస్ కి వెళ్ళితే చాలా ఎంజాయ్ చెయ్యచ్చు. మేం ఇద్దరం ఎప్పటినించో వెళదాం అని ప్రయత్నించాం. కుదర లేదు. మాకు సాయంగా ఎవరైనా ఉంటే బాగుంటుంది అని ఆగి పోయాం. ఎటూ ఇప్పుడు శలవలే కదా . మీరు కూడా ఎప్పుడు చూడ లేదు కదా ఈ ప్రదేశాలు అన్నీ. కోర్ట్ కి ఇంకా టైం వుంది. అంచేత మీరు మాకు సాయంగా వస్తే చాలా బాగుంటుంది. అరెంజ్మేట్స్ అన్నీ నేను చేస్తాను. నిజంగా జన్మలో మరచి పోలేని ట్రిప్ ఇది. వస్తారు కదా. అలోచించి రేపు చెప్పండి.” అన్నారు. ఒక్క సారి ఈ ప్రతిపాదన వచ్చే సరికి వాళ్లకి ఏం చెప్పాలో తెలియ లేదు. ఇద్దరు నిశ్శబ్దంగా కూర్చోండి పోయారు. మనసులో ఆ సాటిలేని ప్రదేశాల మీద ఊహలకి అందని వివరణలు విన్నారు. మంచి ప్రతిపాదనే. కానీ మౌనంగానే వున్నారు ఇద్దరూ. పరిస్థితి తేలిక చెయ్యడానికి విశ్వనాథం గారు "రాత్రి అంతా బాగా ఆలోచించి రేపు మీ నిర్ణయం చెప్పండి. ఇన్నాళ్లూ మాకు తోడు లేక ఇద్దరమే వెళ్ళ లేక మానేస్తున్నాం. మీరిద్దరూ మాకు సాయం అని అడిగాను” అని, అక్కడ వదిలేశారు. వాళ్లకి తెలుసు నిర్ణయం ఏంటో. వాళ్ళను కలపడానికి మరొక ప్రయత్నం ఇది. చిన్న దంపతులు ఇద్దరు రాత్రంతా ఆ విషయం మీద మాట్లాడుకుని వెళ్ళడానికే నిర్ణయించుకున్నారు. చాలా కాలం తరువాత వాళ్ళు మాట్లాడుకున్న సందర్భం ఇదే. ఇద్దరు రాజీ పడి ‘కులు మనాలి’ ట్రిప్ కి వెళ్ళడానికి సిద్ధమైయ్యారు. కారు ఢిల్లీ సిటీ లిమిట్స్ దాటి హర్యానా లోంచి దూసుకు పోతోంది. ఆ రెండు జంటలు చాలా ఉత్సాహంగా వున్నారు. కొంత దూరం తర్వాత డ్రైవింగ్ సీట్స్ మార్చుకోవాలి అని నిర్ణయించుకొన్నారు. మొత్తం సుమారు 650 కిలోమీటర్స్ దూరం. దాదాపు 14 నించి 15 గంటలు ప్రయాణం. దారిలో చాలా ప్రసిద్ధి గాంచిన స్థలాలు వున్నాయి.ఎక్కడ పడితే అక్కడ టిఫన్ కి కాఫీ కి బోల్డన్ని డాబాలు. మొత్తము మీద ప్రయాణం చాలా ఆసక్తికరంగానే వుంది. ‘పానిపట్టు’ దగ్గర ఒక రెస్టౌరెంట్ లో మంచి పరోటాలు పెరుగు తో బ్రేక్ఫాస్ట్ కానిచ్చి కొంచం రెస్ట్ తీసుకొన్నారు. అక్కడి చారిత్రాత్మికమైన విషయాలు మళ్ళా మననం చేసుకొని ముందుకు బయలుదేరారు. విశ్వనాథo దంపతులు వెనక సీట్లో కి మారి కొంచం విశ్రాంతిగా స్థిరపడ్డారు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/WUudJreSBxI
Embed this episode
NOW PLAYING
కర్తవ్యం - ఎపిసోడ్ 3 | Karthavyam - Episode 3 | Telugu Web Series | Vedurumudi Ramarao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.