EPISODE · Nov 1, 2022 · 8 MIN
కర్తవ్యం - ఎపిసోడ్ 4 | Karthavyam - Episode 4 | Telugu Web Series | Vedurumudi Ramarao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కర్తవ్యం - ఎపిసోడ్ 4 రచన: వెదురుమూడి రామారావు వెదురుమూడి రామారావు గారి సంక్షిప్త ధారావాహిక కర్తవ్యం నాలుగవ భాగం గత ఎపిసోడ్ లో మనోహర్, సుధలు దగ్గర కావడం చూసి సంతోషిస్తారు విశ్వనాథం దంపతులు. కులు, మనాలి, రోతహంగ్ పాస్ కి వెళదామని ప్రపోజ్ చేస్తారు విశ్వనాథం గారు. రాత్రంతా ఆలోచించుకొని సరేనంటారు మనోహర్, సుధలు. ఇక కర్తవ్యం నాలుగవ భాగం చదవండి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అవగానే మనాలి కి ప్రయాణం సాగించారు. పిల్లలు ఇద్దరూ కొంచం సుముఖంగా నే మారారు. ఇందాక రోప్ వే లో చేతులు పట్టుకొని ఏవేవో మాట్లాడుకున్నారు. దారిలో ఒక ఎత్తయిన శిఖరం దగ్గర "స్కై డైవింగ్" జరుగుతోంది. గాలి వాటం సరిపోతే ఒక్కొక్క వ్యక్తి ని వాళ్ల నిపుణుల సాయం తో వాళ్ళే ‘డైవింగ్’ కి తీసుకొని వెళుతారు. లేకపోతే కొంచం ప్రమాదకరం. మనోహర్ కి ఇదంటే చాలా ఇష్టం. తాను డైవింగ్ చెయ్యడానికి రెడీ ఐ పోయాడు. వేసుకోవాలిసిన సరంజామా అంతా వేసుకొని రెడీ గా కూర్చున్నాడు. సుధ మొహం లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఎంత సేపు కూర్చొన్నా గాలివాటం ఆతని బరువు కి సరిపోయినంత అవటం లేదు. వాయు దేముడి కి వీళ్ళ ప్రస్తుత పరిస్థితి అర్ధమైనట్టుగా తన వంతు సాయంగా కొంచం పక్కకు తప్పుకున్నాడు. ఇలాంటి అప్పుడు డైవింగ్ చెయ్యడం ప్రాణాంతకం. అయినా సరే మనోహర్ గెంతడానికి ఉత్సాహంగా వున్నాడు. సడన్ గా సుధ గబగబగా మనోహర్ దగ్గరకి వెళ్లి చెయ్యి పట్టుకొని "ఇది వొద్దండీ. ముందుకి పోదాం" అంటూ అతనిని గట్టిగా పెట్టుకొంటూ ప్రాధేయ పడింది. “డబ్బులు పొతే పొయ్యాయి. పోదాం. నాకు భయంగా వుంది” అని ప్రాధేయ పడింది. మనోహర్ మొహం వెలిగి పోయింది. ఆమె చెయ్యి పట్టుకొని ఆప్యాయంగా వెనుదిరిగాడు. ఇదేగా కావలిసింది. కారు ‘మనాలి’ వైపు మెల్లగా సాగిపోతోంది. ఘాట్ రోడ్ మెలికలు, చల్లటి వాతావరం, ప్రకృతి దృశ్యాలు వాళ్లని ఎక్కడికో సశరీరంగా తీసుకొని పోతున్నాయి. 'హిడింబి' టెంపుల్ అక్కడి ఆకర్షణల లో ఒకటి. అల్లాంటి టెంపుల్ ఇంకెక్కడా లేదు. ఆలు పరోటాలు, పెరుగు తో ఆరగించి ఆ టెంపుల్ చూడ్డానికి వెళ్లారు. మాయ బజార్ సినిమా లో సూర్యకాంతం ఘటోత్కచుడి అమ్మ. " సుపుత్రా !! మంచి పని చెయ్యరా కుమార. సంతోషిస్తాను" అనే డైలాగ్ వెంటనే గుర్తుకొచ్చింది. ఆ టెంపుల్ అంతా మంచి కర్ర చెక్క తో నే కట్ట బడి ఉండటం ఒక ఆకర్షణ. ఎన్నాళ్ళో ఇయినా కర్ర చెక్కడాలు చెక్కు చెదరకుండా అలానే వున్నాయి. అక్కడనించి ‘రోతంగ్ పాస్' కి మన కార్ లో వెళ్లడం కష్టం. స్పెషల్ డ్రైవింగ్ అనుభవం అవసరం. అక్కడి వాళ్లు ప్రత్యేకంగా వాళ్ళ కార్ లోడ్రైవింగ్ చేసి తీసుకొని వెళుతారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Embed this episode
NOW PLAYING
కర్తవ్యం - ఎపిసోడ్ 4 | Karthavyam - Episode 4 | Telugu Web Series | Vedurumudi Ramarao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.