EPISODE · Nov 8, 2022 · 13 MIN
కర్తవ్యం - ఎపిసోడ్ 5 | Karthavyam - Episode 5 | Telugu Web Series | Vedurumudi Ramarao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కర్తవ్యం - ఎపిసోడ్ 5 రచన: వెదురుమూడి రామారావు వెదురుమూడి రామారావు గారి సంక్షిప్త ధారావాహిక కర్తవ్యం ఐదవ ( చివరి ) భాగం తెల తెలవారుతుండగా మనోహర్ సుధ లు లేచి ఆరు బయట దృశ్యాలని కళ్ళల్లో నింపుకొంటున్నారు. ఆ ప్రదేశం, వాతావరణం వదలి వెళ్ళాలి అనిపించటం లేదు. తప్పదుగా! సామానులు అన్నీ కారులో ఎక్కించి గెస్ట్ హౌస్ కి వీడుకోలు చెప్తూ మెల్లగా వెనక్కి బయలు దేరారు. ఆపిల్ తోటల దగ్గర కారు ఆపించి కావలిసిన పళ్ళు ప్యాక్ చేయించారు. గడచిన మంచి సమయం మరువలేని జీవితానందంగా నెమరు వేసుకొంటూ ఢిల్లీ వైపు బయలు దేరారు. విశ్వనాథం, సుమతి లు వీళ్లల్లో వచ్చిన మార్పు ని గమనిస్తూనే వున్నారు. నెమ్మదిగా వారి అసలు జీవితాలకు తిరిగి వచ్చే మానసిక స్థితికి చేరుకుంటున్నారు. వాళ్లకి ఇంతకాలం ఒక కలల ప్రపంచం లో ఉన్నట్టు, ఇప్పుడే బయట కి వస్తున్నట్టు అనిపిస్తోంది. తారు రోడ్ మీద కారు నున్నగా జారిపోతోంది. ఏసీ చిన్నగా, మందంగా, చల్లగా వారికి సేవ చేస్తోంది. అకస్మాత్తుగా సుధ విశ్వనాథం గారి తో ఇలా అంది. మనోహర్ నిశ్శబ్దంగా వింటున్నాడు. “అంకుల్! మనం బయలు దేరి వచ్చే రోజు ప్రయాణం లో మన సాంప్రదాయం, పెళ్ళిలో తంతుల గురించి చెపుతూ ఆపేసారు. మనకి ఇంకా ప్రయాణం లో టైం బాగా వుంది కదా. చెప్తారా ?” అని అడిగింది. అంత కన్నా సంతోషం ఏం ఉందమ్మా! తప్ప కుండా చెప్తాను. మీకు బోర్ కొడితే ఆపేస్తాను. ఈ తంతులు ఏమిటి, వీటి అర్ధం ఏమిటి అని తెలిస్తే, వాటి మీద గౌరవం ఎక్కువ అవుతుంది. తప్పకుండా ఆచరించాలి అనిపిస్తుంది. జీవన సత్యానికి, మనుగడకి అర్ధం పరమార్ధం కూడా. అందుకే ఇన్ని వేల సంవత్సరాలైనా మన సంస్కృతి నిలబడి వుంది. ‘శౌనక స్మ్రుతి ధర్మ శాస్త్రం ‘ పెళ్లి లో జరిగిన తంతులని వివరిస్తోంది. మంగళ సూత్రం కట్టేటప్పుడు వరుడు చేత అనిపించిన మంత్రం అందరికి తెలిసినదే. మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం అంటే వరుడు తన జీవితాన్ని ఆమె చేతుల్లో పెడుతున్నాడు అని అర్ధం. ‘ఇది పవిత్రమైన బంధం. గుణవంతురాలయిన నీ మెడలో నేను మంగళ సూత్రం కడుతున్నాను. నీవు సంతోషం గా వంద సంవత్సరములు జీవించు’ అని కోరుతున్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Embed this episode
NOW PLAYING
కర్తవ్యం - ఎపిసోడ్ 5 | Karthavyam - Episode 5 | Telugu Web Series | Vedurumudi Ramarao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.