క్షమాశీలత | Kshamasilatha | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com episode artwork

EPISODE · May 20, 2023 · 8 MIN

క్షమాశీలత | Kshamasilatha | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  'క్షమాశీలత' తెలుగు కథ రచన : Ch. ప్రతాప్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) రామాపురం శివార్లలో స్వర్ణముఖి నది ఒడ్డున విద్యానందుడు అనే గురువు ఒక గురుకులం స్థాపించి శిష్యులకు విద్యాబోధన చేస్తున్నారు. ఆయన సకల శాస్త్ర పారంగతుడు. వేద శాస్త్రాలను, పురాణాలను, ఉపనిషత్తులను ఔపోసన పట్టిన దిట్ట. ఆయన శిష్యరికంలో అనేకమంది సకల శాస్త్ర కోవిదులుగా తీర్చి దిద్దబడి దేశంలో వివిధ ప్రాంతాలలో మంచి కొలువులలో స్థిరపడ్డారు. శిష్యులకు విద్యాబోధనే కాక తన వద్దకు వచ్చే ప్రజానీకానికి సందేహాలు తీర్చడంతో పాటు వారి సమస్యలకు పరిష్కారం సైతం ఇవ్వగలడంలో దిట్ట అనిపించుకున్నారు. వేద వేదాంగాలలో వున్న అనేక అంశాలను స్పృశించడమే కాక, ఆనాటి కాలంలో ప్రబలంగా వున్న జంతుబలి, బానిసత్వం వంటి అమానవీయ పద్ధతులను మార్చుకోవాలని సూచించేవారాయన. ఈ కారణంగా సుదూర ప్రాంతాల నుండి కూడా ప్రజానీకం వచ్చి ఆయనను దర్శించుకొని తమ తమ సమస్యలకు పరిష్కార మార్గాలు పొందుతుండేవారు. విద్యానంద గురువు కి వచ్చిన అపూర్వ ప్రజాదరణ చూసి ఓర్వలేక అప్పడు రాజ్యపాలన చేస్తున్న పర మతస్థుడైన రాజుకి కంటగింపు కలిగింది. పైగా అతని దర్బారులో వున్న అనేకమంది విద్యానందుల వలన తమ మతానికి ఎంతో చెడ్డ పేరు రావడంతో పాటు ఆదరణ కూడా తగ్గిపోతుందని రాజుకు లేనిపోనివి కల్పించి చెప్పారు. వీటి వలన ప్రభావితుడైన రాజు మొదట్లో తన సైన్యాన్ని పంపించి విద్యానందుల వారిని హతమార్చి, ఆశ్రమాన్ని ధ్వంసం చేయద్దామని పధక రచన చేసాడు. అయితే గురువు కి వున్న జనాదరణ, ఆయన ఆశ్రమంపై విధ్వంసకాండ జరిపితే దానిని ఆయన భక్తులు మతం రంగు పులిమే ప్రమాదం వున్నందున ప్రత్యామ్నాయం కోసం తన సన్నిహితులతో సమాలోచనలు జరిపాడు. ఆ పధకం ప్రకారం కరటయ్య అనే వ్యక్తికి భారీగా సొమ్ము ఆశ జూపి విద్యానందుని ఆశ్రమానికి పంపించారు. కరటయ్య విద్యానందుని పాదాలకు మోకరిల్లి ఆశ్రమంలో లో చిన్నాచితకా పనులు చేసుకునేందుకు అనుమతి నివ్వవలసిందిగా ప్రార్ధించాడు. ఆనాటి నుండి అందరికీ అన్ని పనులలో సహాయం చేస్తూ, అతి విధేయత ప్రదర్శిస్తూ అందరికి తలలో నాలుకలా మెదులుతూ అందరి నమ్మకం సంపాదించుకున్నాడు. మూడు నెలల సమయం తిరిగేసరికి కరటయ్య లేనిదే ఆశ్రమంలో ఏ పని జరగని పరిస్థితి నెలకొంది. పధకం ప్రకారం రాజు ఇచ్చిన మందును నెమ్మదిగా గురువు ఆహారంలో కొంచెం కొంచెం కలపసాగాడు. మోతాదు తక్కువగా వుండడం వలన గురువు కి కూదా మొదట ఎలాంటి అనుమానం రాలేదు. అయితే రెండు నెలల సమయం తర్వాత శరీరంలో నరాల పటుత్వం తగ్గ సాగింది. కొద్దిరోజులలోనే ఆ సమస్య హఠాత్తుగా పెద్దదై విద్యానందుడు మంచాన పడ్డారు. రోజు వారీ కార్యక్రమాలకు కూడా స్వయంగా లేవలేని పరిస్థితులు వచ్చాయి. పరిస్థితి దిగజారడం గమనించి శిష్యులు ఒక ప్రముఖ వైద్యుడిని రప్పించారు. ఆయన విద్యానందుడిని పరీక్షించి శరీరంలో విషప్రయోగం జరిగిన విషయం నిర్ధారించి, పరిస్థితి చేజారిపోయిందని, అయినా సడలని నమ్మకంతో విషానికి విరుగుడు మందు ఇచ్చి వెళ్ళిపోయారు. జరిగిన విషయాన్ని అర్ధం చేసుకున్న శిష్యగణం ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు గురయ్యారు. ఆశ్రమంలోనే వుంటూ ఇంతటి నమ్మక ద్రోహానికి ఒడిగట్టినవారెవరా అని ఆలోచించసాగారు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/FlSb7Gp9kmI

Episode metadata supplied by the publisher feed · Published May 20, 2023

Embed this episode

NOW PLAYING

క్షమాశీలత | Kshamasilatha | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com

0:00 8:02

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 8 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 20, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!