EPISODE · Jan 18, 2023 · 13 MIN
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 11 | Kasthuri Ranga Ranga Episode 11 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 11 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో రంగా, వసంత్ లు పోలీస్ స్టేషన్ కి వెళతారు. అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగిన రోజు ఏం జరిగిందో వాకబు చేస్తారు. వసంత్ స్నేహితురాలు ప్రీతి అతనికి కాల్ చేస్తుంది. ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 11 చదవండి. వసంత్ దేశాయ్ డి. ఐ. జి. , కస్తూరిరంగా యస్. పి. టిఫిన్ తిని కారును సమీపించారు. “సార్.... నేను నడుపుతాను... " అన్నాడు వసంత్. "ఓకే!... " ఇరువురూ కార్లో కూర్చున్నారు. వసంత్ కారును స్టార్ట్ చేసి రోడ్లో ప్రవేశించి ముందుకు సాగాడు. రంగా సెల్ మ్రోగింది. నెంబరు చూచి చిరునవ్వుతో చెవి వద్దకు చేర్చుకొన్నాడు. "హలో!... " “ఆ... ఎలావున్నారు?... " "బాగున్నాను... నీ బావా అక్కా పిల్లలు !... " "అంతా బాగున్నాము... " "టిఫిన్ చేసి నేను, మన వసంత్ రేపల్లెకు బయలుదేరాము... " "నన్ను అక్కడికి తీసుకొని వెళ్లరా!... " "ఆరోజు త్వరలో రాబోతూవుంది. తప్పకుండా తీసుకొని వెళతాను. కొద్ది రోజులు ఓపిక పట్టాలి... ప్రియా!... " నవ్వాడు రంగా... "ఆవూరి పేరు వినగానే మదిలో... ఎన్నో చేదు తీపి జ్ఞాపకాలు... విరక్తిగా నవ్వింది చిన్నీ. క్షణం తర్వాత... "ఒకసారి చూడాలని వుంది.. " మెల్లగా చెప్పింది. "అలాగే!... మరికొంత కాలం ఓపికపట్టు. అన్ని సమస్యలను పరిష్కరించి నిన్ను రేపల్లెకు తీసుకొని వస్తాను చిన్నీ.. " అనునయంగా చెప్పాడు కస్తూరిరంగా. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/D8y5eeQsDow
Embed this episode
Ready to play
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 11 | Kasthuri Ranga Ranga Episode 11 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.