EPISODE · Feb 3, 2023 · 20 MIN
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 13 | Kasthuri Ranga Ranga Episode 13 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 13 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో పున్నయ్యను బైక్ లో ఫాలో చేస్తాడు కస్తూరి రంగా. అతను తనకు మేనమామ అవుతాడని వసంత్ తో చెబుతాడు. పున్నయ్యకు భూషణ్ కుమార్ తో ఉన్న పరిచయం గురించి అతన్ని ప్రశ్నిస్తాడు. ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 13 చదవండి. "చూడు మామా!.. మనం విడిపోయి పదహారేళ్లకు పైమాట... అప్పటికి నీలో నాలో ఎంతో తేడా... నేను పోలీస్... పోలీస్!.. మరి నీవు ఎవరు?... ఏంచేస్తున్నావ్?..... చిరునవ్వుతో అడిగాడు కస్తూరి రంగ. "కాంట్రాక్టర్!..." "ఎక్కడ?..." "హైదరాబాద్లో..." "వుండేది?..." అక్కడే!..." "ఇక్కడికి ఎందుకొచ్చావ్?...". "కాంట్రాక్టు పని మీదనే..." "మొన్న ఆ మధ్యన రేపల్లెలో జరిగిన బాంబ్ బ్లాస్ట్... హైవేలో సయ్యద్ సార్ చిన్నకొడుకు సుల్తాన్ ఇతరులు... జీప్ బ్లాస్ట్ కు కారకులు ఎవరో నీకేమైనా తెలుసా మామా!..." అనునయంగా అడిగాడు రంగ. "సార్!.. నాకేం తెలీదు సార్... తెలీదు.." తొట్రుపాటుతో చెప్పాడు పున్నయ్య. "చూడు పున్నయ్య మామా!..." చిరునవ్వుతో రంగా… దీనంగా చెమట కారుతున్న ముఖంతో కస్తూరిరంగ ముఖంలోకి చూచాడు. పున్నయ్య. "నాకు... ఆ బ్లాస్ట్ లకు నీ ఫ్రెండ్ భూషణ్ కుమార్ కు సంబంధం వుందన్న అనుమానం. నీకు తెలిసిన నిజాలు చెబితే నీకు సన్మానం చేస్తా. అబద్ధం చెప్పావో... వసంత్!... ఏంచేస్తావో చెప్పు..." నవ్వుతూ అన్నాడు కస్తూరిరంగ. "మామా!..." వసంత్ పిలుపు. ఉలిక్కిపడి పున్నయ్య వసంత్ ముఖంలోకి దీనంగా చూచాడు. "వీరు నాకు అన్నయ్యగారు... కనుక మీరు నాకూ... అదే వరుస... మీ మాటలో తేడా వుంటే... మీ షేపే మారిపోద్ది మామ..." అనునయంగా చెప్పాడు వసంత్... రంగా చిరునవ్వుతో పున్నయ్య ముఖంలోకి చూచాడు… Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/qnPaXqJir0g
Embed this episode
NOW PLAYING
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 13 | Kasthuri Ranga Ranga Episode 13 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.