EPISODE · Feb 8, 2023 · 16 MIN
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 14 | Kasthuri Ranga Ranga Episode 14 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 14 రచన: సిహెచ్. సీఎస్. శర్మ సయ్యద్ సార్ పెద్దకొడుకు ఇర్ఫాన్ దాదాపు రెండు నెలలుగా జీవితాన్ని పైలా పచ్చీస్ అన్ని విషయాల్లో పరమానందంగా ముంబైలో గడుపుతున్నాడు. రెండువారాలకోసారి అతని మేనమామ ఖాజా... అతనికి కావలసినంత డబ్బును భూషణ్ కుమార్ వద్దనుంచి వసూలుచేసి పంపేవాడు. కస్తూరి రంగ సయాన్లోని ఐ.జి. ఆఫీస్ కు వెళ్లి సక్సేనా ఐ.జి.ని కలుసుకొన్నాడు. ఇర్ఫాన్ ఫొటోను వారికి ఇచ్చి జరిగిన కథనంతా వివరంగా చెప్పాడు. ఐ.జి. సక్సేనా అంతా విన్నాడు. వారి శిష్యుల వివరాలన్నింటినీ నోట్ చేసుకొన్నాడు... కస్తూరిరంగ ఇచ్చిన ఇర్ఫాన్ ఫొటోను అన్ని స్టేషన్లకు పంపించే ఏర్పాట్లు చేశాడు ఐ.జి.సక్సేనా… "సార్... థాంక్యూ... ఎలాట్!!..." సంతోషంతో చెప్పాడు కస్తూరి రంగ. "ఎందుకు... మిస్టర్ కస్తూరి రంగ!.. ఇటీజ్ అవర్ డ్యూటీ... ఎస్.. ఇటీజ్ అవర్ డ్యూటీ..." చిరునవ్వుతో చెప్పాడు సక్సేనా… తర్వాత ఈమధ్య కాలంలో నలుగురు వ్యక్తులచేత బలాత్కరింపబడి (రేప్ ) చంపబడిన వుమెన్ వెటర్నరీ డాక్టర్ (6.12.2019) డాక్టర్ ప్రియాంకారెడ్డి కేసును గురించి... కరోనా బాధితులకు ట్రీట్మెంటు చేస్తూ తన ఆరోగ్యాన్ని కూడ లెక్క చేయక మరణించిన డాక్టర్ కె. రోజీ ఆంధ్రా (23 సం.లు) ను గురించి.. మరికొందరు ముఖ్యులను గురించి విచారించి.. వారికి తన సానుభూతి తెలియచేసారు ఐ.జి. సక్సేనా. "సార్!... ఒక సందేహం... మీరు బొమ్మలుకూడ బాగా వేస్తారని విన్నాను... నిజమేనా!...” అడిగాడు కస్తూరి రంగ. "అవును... మీ సందేహం ఏమిటి?..." "ముమ్మూర్తుల మనిషిని పోలిన మనిషి వుండగలరా!..." "వైనాట్... వుండవచ్చు... మన పెద్దలు అంటూంటారు కదా!... మనిషిని పోలిన మనుషులు ఏడుమంది వుంటారని!..." చిరునవ్వుతో చెప్పాడు ఐ.జి. క్షణం తర్వాత... "అవును మిస్టర్ కస్తూరి రంగా!.. మీకు ఆ సందేహం ఎందుకు కలిగింది.?..." అడిగాడు ఐ.జి సక్సేనా… "ఒక కేసులో నేను అలాంటి సమస్యను ఎదుర్కొనవలసి వుంటుంది సార్… "సో... నీవు కూడా డబుల్ యాక్షన్ చేయవలసి వస్తుందేమో! నీవు చేయగలవు. నా మిత్రుడు అనంత్ నాగ్ నీ గురించి అన్నీ వివరాలు చెప్పాడు..." నవ్వాడు సక్సేనా… "సార్... విత్ యువర్ కైండ్ పర్మిషన్... షల్ ఐ మేక్ ఎ మూవ్!.." "వాటీజ్ టైమ్?..." అడిగాడు ఐ.జి.సక్సేనా. వాచీని చూచి “వన్ థర్టీ సార్!..." రంగా జవాబు. "ఆ... నేను హైదరాబాద్ మీ ఆఫీసుకు వచ్చివుండి... ఈటైమ్ దాకా డిస్కస్ చేసి... నీవు నాతో ఇపుడు చెప్పిన మాటను నేను చెబుతే... దీనికి నీవేమంటావ్?... నన్ను పొమ్మంటావా?..." చిరునవ్వుతో అడిగాడు ఐ.జి.సక్సేనా. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/r1q1A5UP8es
Embed this episode
NOW PLAYING
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 14 | Kasthuri Ranga Ranga Episode 14 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.