EPISODE · Nov 13, 2022 · 15 MIN
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 2 | Kasthuri Ranga Ranga Episode 2 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
కస్తూరి రంగ రంగా!! 2 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సిహెచ్. సీఎస్. శర్మ గారి ధారావాహిక కస్తూరి రంగ రంగా రెండవ భాగం గత ఎపిసోడ్ లో బ్రహ్మయ్య మనవడు శాలివాహనను కిడ్నాప్ చేసినట్లు అగంతకులు ఫోన్ చేసి చెబుతారు. భయపడ్డ బ్రహ్మయ్యకు ధైర్యం చెబుతారు అతని స్నేహితులు పుండరీకయ్య, సయ్యద్ లు. కిడ్నాపర్లు అడిగిన సొమ్ము సమకూర్చుకోవడంలో బ్రహ్మయ్యకు సహకరిస్తారు. ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 2 చదవండి... ఉత్తరం సాంతం చదివేసరికి, కుసుమ కళ్లల్లో నీళ్లు నిండాయి. చెక్కిళ్లపైకి జారాయి. "ఏమ్మా కుమమా! జాబు వ్రాసింది శశాంకేనా!” అడిగాడు పుండరీకయ్య. "ఆ. అవునన్నా!” కన్నీటితో దీనంగా పలికింది కుసుమ. క్షణం తర్వాత “తన కొడుకు శాలివాహన మా దగ్గర క్షేమంగా ఉన్నాడని వాడు, కోడలు అనుకుంటున్నారు. ఇక్కడ పరిస్థితి…" భోరున ఏడ్చింది కుసుమ. "అమ్మా..! ఏడవకు. మనం అంతా సిద్ధం చేసుకొన్నాముగా! డబ్బు వాడి ముఖాన కొట్టి బిడ్డని రేపు తెచ్చుకొంటాం కదమ్మా. బాధపడకు.. భయపడకు." ఓదార్చాడు పుండరీకయ్య. అతని మాటలకు కుసుమకు కొంత వూరట కలిగింది. * * * * * బ్రహ్మయ్యగారు సుల్తాన్ సాయంతో బ్యాంకునుంచి పదిలక్షలను తీసుకొన్నాడు. ఇంటికి వచ్చి ఇరవై లక్షలను ఒక జిప్ బ్యాగ్లో భద్రంగా వుంచి, ఆ రాత్రంతా అతను, భార్య కుసుమ, పుండరీకయ్య బ్యాగ్ ముందు కూర్చొని జాగరణ చేశారు. సుల్తాన్ రెండు పర్యాయాలు వచ్చి వారిని చూచి ధైర్యం చెప్పి వెళ్లిపోయాడు. భారంగా ఆ ముగ్గురి మధ్యన ఆ రాత్రి గడిచింది. బ్రహ్మయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్దబ్బాయి శశాంక్ ఢిల్లీలో మిలటరీలో ఉద్యోగం. చిన్న అబ్బాయి చంద్రహాస్ అమెరికాలో సైంటిస్ట్. అతని భార్య వినోదిని. డిగ్రీ ఇన్ టెలీకమ్యూనికేషన్.. పనిచేస్తూ వుంది. శశాంక్ వివాహం చాలా ఆలస్యంగా జరిగింది. చంద్రహాస్ కు కొడుకు రఘునాథ్.. కూతురు ప్రగతి. ఇరువురి మధ్యన వయస్సు వ్యత్యాసం రెండు సంవత్సరాలు. వివాహం అయిన మరుసటి సంవత్సరంలో రఘునాధ్ పుట్టాడు. శశాంక్ కాలేజీ రోజుల్లో ఓ లవ్ అఫైర్లో పడ్డాడు. ఆమె పేరు మహిమ. తన మహిమతో శశాంక్ ను పిచ్చివాణ్ణి చేసింది. తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని శశాంక్ సంబంధంకన్నా గొప్ప కలవారి కొడుకును పెండ్లి చేసికొని ఆస్ట్రేలియా వెళ్లిపోయింది. ఆ షాక్ నుండి తేరుకొనేదానికి శశాంక కు చాలా కాలం పట్టింది. తల్లిదండ్రులు, హితుల మంచి మాటలతో మనస్సును మార్చుకొని ముఫ్పైమూడవ ఏట మధ్యతరగతి కుటుంబానికి చెందిన నిర్మలను.. తల్లిలేని పిల్లను తన తండ్రి, తల్లి ఇష్టానుసారంగా వివాహం చేసుకొన్నాడు. వివాహం అయిన మూడు సంవత్సరాలకు కవలలు కవిత కమల, ఆ తర్వాత ఐదు సంవత్సరాలకు శాలివాహన జన్మించారు. బ్రహ్మయ్యగారి అన్నయ్య గోపాలయ్య. వారి భార్య కాత్యాయని. వారికీ వివాహం అయిన చాలా కాలం సంతానం లేదు. ఎన్నో గుళ్లు గోపురాలు, నదీస్నానాలు పూజలు పునస్కారాలు చేశారు. ఫలితంగా పాతిక సంవత్సరాల తర్వాత బంగారు బొమ్మలాంటి ఆడపిల్ల పుట్టింది. ఎంతో ఆనందంగా ఆ దంపతులు బ్రహ్మయ్య కుసుమల.. బంధుమిత్రుల సమక్షంలో ఆ బిడ్డకు కస్తూరి అని నామకరణం చేశారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Embed this episode
NOW PLAYING
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 2 | Kasthuri Ranga Ranga Episode 2 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.