కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 6 | Kasthuri Ranga Ranga Episode 6 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Dec 12, 2022 · 18 MIN

కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 6 | Kasthuri Ranga Ranga Episode 6 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 6 రచన: సిహెచ్. సీఎస్. శర్మ గత ఎపిసోడ్ లో ప్రియురాలు మువ్వతో కలిసి గెస్ట్ హౌస్ లో ఉంటాడు భూషణ్ కుమార్. మల్లేష్ అతన్ని కలిసి, పోలీసులు తనకోసం వెతుకుతున్నట్లు చెబుతాడు. అతనికి డబ్బులు ఇచ్చి అజ్ఞాతంలోకి వెళ్ళమంటాడు భూషణ్. సయ్యద్ ను ఒక గదిలో బంధిస్తాడు ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్6 చదవండి... ఆ యిరువురు బాలికలు అమాయకంగా తలలను ఆడించారు. టీ గ్లాసులతో ఓ పదిహేనేళ్ల బాలుడు లోనికి వచ్చాడు. అతను మూగవాడు. పేరు చాన్... పేరుకు తగ్గట్టుగానే చాలా సుందరంగా వుంటాడు. తల్లి తండ్రి లేని అనాధ. ఖాజా ఆదరించాడు. ఇరానీ షాపులో పెట్టాడు. చాన్ వారిని సమీపించి ఆడపిల్లలకు, పీర్ కు టీ గ్లాసులు అందించాడు. ఖాజావైపుకు వచ్చి గ్లాస్ ను ఇవ్వబోయాడు. సయ్యద్ తలుపును కాళ్లతో తంతూ ఎక్కువ శబ్దాన్ని చేశాడు. ఖాజాకు ఆవేశం పెరిగింది. వేగంగా కుర్చీనుంచి లేచాడు. అతని చేయి టీగ్లాస్ వున్న చాన్ చేతికి తగిలింది. గ్లాస్ కిందపడి పగిలిపోయింది. టీ నేలపాలైంది. ఆవేశంలో వున్న ఖాజా చాన్ చెంపలు వాయించాడు. చాన్ బాధతో ఏడ్చాడు. వేగంగా బయటకి వెళ్లిపోయాడు. ఖాజా సయ్యద్ గది తలుపు తెరచి పీర్ ను పిలిచాడు. అతను ఆ గదిని సమీపించాడు. ఇరువురూ ఆ గదిలోకి నడిచారు... లాఫ్ట్ పైన వున్న గోనె సంచిని తీసి... సయ్యద్ కాళ్లూ చేతులు, మెడను గట్టిగా కట్టేసి.. నోట్లో గుడ్డలను తురిమి ఆ సంచిని అతనికి తొడిగి ఆ సంచి మూతిని గట్టిగా బిగించి గదిలో ఓమూల పడేసి చేతులు దులుపుకొన్నారు. "రేయ్!... పీర్!..." “హా... సాబ్...” “వీడెవడో తెలుసా!...". "తెలీదు సాబ్...." “మన ఇర్ఫాన్ తండ్రి... ఇర్ఫాన్ని పోలీసులకు అప్పగించాలని వచ్చాడు... వీడిని మూసీనది బురదలో పారేయాలి. వీడు చావాలి... టాక్సీని బులావ్... హెూటల్లో పనిచేసే ఇద్దరిని పిలుస్తాను. ఆ మూటను టాక్సీలో వేసుకొనిపోయి మూసీ నదిలో బాగా తుంగ పెరిగిన చోట పారెయ్యాలి. సరేనా!..." తల ఆడించాడు పీర్.... ఇరువురూ గదినుండి బయటకు నడిచి తలుపు బిగించారు. ఖాజా టాక్సీవాలాకు ఫోన్ చేశాడు. “పీర్!..." "సాబ్..." "ఇన్ దోనోంకో లాడ్జి రూమ్ మే చోడ్కర్ ఆనా!..." "జీ..సాబ్!..." ఆ పిల్లలను చూస్తూ..., "మీరు నాతో రండి. పైన మన లాడ్జిరూమ్ లో భోంచేసి విశ్రాంతి తీసుకొందురుగాని.... టికెట్లు వస్తాయి... రాగానే బస్టాండ్ కు బయలుదేరుతాము. ఈ లోపల నాకు వేరే పని వుంది. దాన్ని ముగించి నేను మీ గదికి వస్తా... రాగానే మనం బయలుదేరుదాం..." విశ్వసనీయంగా మెల్లగా చెప్పాడు పీర్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/1fimjpkHeMA

Episode metadata supplied by the publisher feed · Published Dec 12, 2022

Embed this episode

NOW PLAYING

కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 6 | Kasthuri Ranga Ranga Episode 6 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 18:58

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 18 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on December 12, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!