EPISODE · Dec 18, 2022 · 17 MIN
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 7 | Kasthuri Ranga Ranga Episode 7 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 7 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో సయ్యద్ ను మూటలో కట్టి మూసీ నదిలో పడేస్తాడు పీర్. ఫాలో చేస్తూ వచ్చిన మూగ మస్తాన్ సయ్యద్ ను కాపాడుతాడు. ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకొని ఢిల్లీలో ఉన్న చిన్ని దగ్గరకు వెడతాడు రంగా. ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 7 చదవండి... మరుదినం ఉదయం అందరూ కాఫీ త్రాగుతున్న సమయం.. శశాంక్.. కస్తూరి, రంగల ముఖంలోకి పరీక్షగా చూచాడు. వారిరువురూ ఒకే సోఫాలో కూర్చొని వున్నారు. శశాంక్ లేచి వెళ్లి వారి మధ్యన కూర్చున్నాడు. నవ్వుతూ ఆ ఇరువురి ముఖాల్లోకి చూచాడు. "ఏంటి బావా!..” అడిగాడు రంగ. "మీ ఇరువురికి నాదొక సలహా!.." అన్నాడు శశాంక్. "చెప్పండన్నయ్యా!.." అంది చిన్నీ “మీరిరువురూ నాలుగురోజులు సరదాగా బెంగుళూరు, మైసూరు తిరిగిరండి. వారం రోజుల తర్వాత రంగా డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత బిజీ అయిపోతాడు కదా!.. కాబట్టి నామాట వినండి.." చెప్పాడు శశాంక్.. “అవును చిన్నీ.. మీ అన్నయ్య చెప్పింది మంచి సలహా.. హ్యాపీగా ఆ ప్రాంతాన్ని తిరిగిరండి.. చూడవలసినవి చాలా వున్నాయి.." చిరునవ్వుతో చెప్పింది నిర్మల. "అలాగే బావా!.. ఆ చిన్నీ నీకు ఓకే కదా!.." అన్నాడు రంగ. "మా అన్నయ్య మాటను నేను ఏనాడూ కాదనను.." నవ్వుతూ చెప్పింది చిన్నీ. "వెరీగుడ్.. నేను సాయంత్రానికి ఫ్లయిట్ టిక్కెట్స్ బుక్ చేస్తాను. ముందు బెంగుళూరు అంటే ఈ నైట్ హాల్ట్ మీరు ఎట్ బెంగుళూరు.." చెప్పాడు శశాంక్. వారి ఫ్లయిట్ మూడుగంటలకు. భోంచేసి ఒంటిగంటకు ఎయిర్పోర్టుకు బయలుదేరారు శశాంక్ నిర్మల.. చిన్నీ రంగా.. డ్రాప్ చేసి బైబై చెప్పి శశాంక్, నిర్మల ఇంటికి తిరిగి వెళ్లారు. అన్నపూర్ణ హెూటల్లో రూమ్ బుక్ చేశాడు శశాంక్. చిన్నీ.. రంగాలు టాక్సీలో హెూటల్ కు చేరి.. ఫ్రష్ అయ్యి.. టాక్సీలో బెంగుళూరు ముఖ్య వీధులన్ని సరదా కబుర్లతో తిరిగి ఎనిమిదిన్నరకు హోటల్ కు చేరారు. భోంచేశారు. ఇరువురూ పడకపై వాలారు. చిన్నీ కదలకుండా కళ్లు మూసుకొంది.. ఆమె ముఖంలోకి చూచాడు రంగా.. సున్నితంగా బుగ్గమీద తన చేతి వ్రేళ్లను తాకించాడు. చిన్నీ కళ్లు తెరచింది. "చిన్నీ!.. అలసటగా వుందా!.." అడిగాడు రంగా. "లేదు.." నవ్వింది చిన్ని. "కడుపులో !!.." Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/NXHYek9sC88
Embed this episode
NOW PLAYING
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 7 | Kasthuri Ranga Ranga Episode 7 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.