EPISODE · Jan 3, 2023 · 12 MIN
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 9 | Kasthuri Ranga Ranga Episode 9 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 9 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో వసంత్ తో కలిసి రేపల్లె బయలుదేరుతాడు రంగ. దారిలో అతనికి గతం గుర్తుకు వస్తుంది. రంగా తండ్రి మాధవయ్య పడవ నడిపే వాడు. తండ్రి మరణించాక రంగా పడవ నడిపే వాడు. అతని యజమాని గోపాలయ్య కూతురు కస్తూరి అంటే రంగుకు చాలా ఇష్టం. ప్లస్ టు లో స్టేట్ ఫస్ట్ వచ్చిన కస్తూరి ఫోటో పేపర్లో పడుతుంది. ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 9 చదవండి గోపాలయ్యగారి సోదరి దుర్గాదేవి... కోడలి ఫొటోను పేపర్లో చూచింది. అందచందాలలో కస్తూరికి సాటి కస్తూరే... కస్తూరి యుక్త వయస్సుకు వచ్చిన తరుణంలో మేనత్తగా తాను చేయవలసిన సాంప్రదాయ ధర్మాల నన్నింటిని దుర్గాదేవి పద్ధతిగా కస్తూరికి జరిపింది. హైదరాబాదుకు తిరిగి వెళ్లిపోబోయేముందు అన్న గోపయ్యను... తన పెద్దకొడుకు భూషణ్ కుమార్ కు కస్తూరికి వివాహం జరిపించాలనేది తన ఆశయం అని చెప్పింది... ఈమె నిర్ణయం ఇష్టంలేని గోపాలయ్య లౌక్యంగా... అమ్మాయి పై చదువులు చదవాలంటోందని... వివాహ ప్రసక్తి మూడు నాలుగు సంవత్సరాల తర్వాతేనని ఖచ్చితంగా చెప్పాడు గోపాలయ్య. ఆ సమాధానం రుచించని దుర్గాదేవి... అన్నగారి మీద ఆగ్రహంతోనే హైదరాబాదు చేరింది. కస్తూరి ఇంటర్లో స్టేట్ ఫస్టుగా వచ్చాక కొడుకు భూషణ్ కుమార్ రేపల్లెకు వచ్చి... హైదరాబాదులో మంచి కాలేజీలో కస్తూరిని చేరుస్తానని... చదువు పూర్తి అయేవరకు ఆమెను జాగ్రత్తగా చూచుకొంటానని దుర్గాదేవి ఎంతో ప్రీతితో గోపాలయ్యకు చెప్పింది. ఆమె తేనెజాలువారే మాటల పరమార్థాన్ని ఎరిగిన గోపాలయ్య.... అందుకు అంగీకరించ లేదు. మొదటిసారి అంటే... కస్తూరి యుక్తవయస్సుకు వచ్చినపుడు... అన్నగారు తన మాటను కాదన్నందుకు... చిన్నపిల్లే కదా చదవనీ... నన్నుదాటి ఎక్కడకి పోతుందని... అనుకొంది దుర్గాదేవి... గోపాలయ్య యావత్ ఆస్తి... కస్తూరిని తన పెద్దకొడుకు భూషణ్ కుమార్ కు ఇచ్చి వివాహం చేసి తన హస్తగతం చేసుకోవాలని దుర్గాదేవి దురాశ. ఈసారి... తనతో కూతురును గోపాలయ్య హైదరాబాద్ కు పంపి అక్కడ చదువుకొనేలా చేయాలనే తన నిర్ణయాన్ని కాదన్నందుకు... అన్నయ్యగారి మీద ఆగ్రహం కలిగింది. ఏరీతిగాననైనా కస్తూరిని తన కోడలిగా చేసుకోవాలనే నిర్ణయించుకొంది. తన నిర్ణయాన్ని కొడుకు భూషణ్ కుమార్ కు చెప్పింది.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/7RJagP-OUt8
Embed this episode
NOW PLAYING
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 9 | Kasthuri Ranga Ranga Episode 9 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.