EPISODE · Feb 27, 2023 · 4 MIN
కుక్క బుద్ధికి పిన్ను దెబ్బ | Kukka Buddhiki Pinnu Debba | Telugu Short Story | Damaraju Visalakshi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కుక్క బుద్ధికి పిన్ను దెబ్బ రచన: దామరాజు విశాలాక్షి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సినిమా మంచి రసవత్తరంగా ఉంది. అందులో లీనమై చూస్తోంది అలివేలు. అదే పనిగా పైపైన చేతులు వేస్తున్నారెవరో? ప్రక్కకి చూసింది. పగలుచూస్తే రాత్రి కలలోకి వచ్చేంత పరమ వికారి ఒకడు తన ప్రక్కసీట్లో.. పళ్ళన్నీ ఇకిలించి ప్రక్కకి ముఖం తిప్పి వెకిలిగా నవ్వుతున్నాడు. “సరిగా కూర్చోండి” హెచ్చరించింది అలివేలు. "సరిగానే కూర్చునానే.. మీ ఒళ్ళో పడ్డానా?” వాడి వ్యంగ్యం.. పది నిమిషాలు కాకుండావాడి పాపిష్టి చేతులు ప్రక్క టెముకలవరకూ వచ్చి తాకుతున్నాయి. పళ్ళు పటపట కొరుక్కుంది అలివేలు. వాడి కాలు తన కాలుని రాయడం మొదలుపెట్టింది. పాపం లేచి వెళదామనుకుంది. చేయిపట్టిలాగి కూర్చోపెట్టింది స్నేహితురాలు పంకజం. పాపం దుఃఖంముంచుకొస్తుంది. “పాపిష్టోడు చూడవే.. పాత తారుడబ్బాలా ముఖం వీడూను. నాకు వాడి కూతురు వయస్సుంటుంది.. నాతో పరాచికాలా?” ప్రక్కన కూర్చున్న పంకజంతో అంది గుసగుసగా అలిమేలు. పంకజం అంది “పది నిమిషాలు ఓపిక పట్టు” అని. ఒకపెద్ద పిన్ను ఇచ్చింది. పదిలంగా పర్స్ లోంచి తీసిఇచ్చింది.. పళ్ళికిలించి పైన చేయివేసిన ప్రక్కసీటు పాపికి, అరచేతిలో దిగింది పిన్ను.. అరచేతిలోకి బాగా వెళ్ళిందో ఏమో ! అమ్మో! అని పెద్దకేక పెట్టి లేచాడు. అందరూ వెనక్కి తిరిగి చూచారు విసుగ్గా.. “ఏటా అరుపు? అంత నాగ అరవాలేటి..? ఆ సీను చూస్తే అంత భయమయితే కళ్ళుమూసుకో.. భలే ఓడివే, .. అంతపిరికోడివి సినిమా కెందుకొచ్చినావు? సాల్లే కూర్చో, .. ఇందాకటి నుండి సూత్తన్నా. సీట్లో సరిగా కూసోకుండా తెగ నులుసుకు పోతున్నాడు. ఎందుకలా నులుసుకు పోతన్నావు.. గమ్మునకూర్చో. మాటాడకు. మంచిసీను వత్తాఉంటే. మధ్యన నీ గోల” తిట్టాడు వెనక సీటతను.. ఆ పల్లెటూరి ఆసామి అయితే, ప్రక్కకి తల త్రిప్పకుండా, ఫైట్స్ చూస్తూ మాట్లాడేస్తున్నాడు. పక్క సీటు వ్యక్తి లేచి వెళ్లి పోయాడు.. హాలంతా చీకటి. చేతికి తడి తగిలింది.. కుర్చీ చేతిపై. ఇంటర్వెల్లో చూస్తే కుర్చీ చేతిపై రక్తం.. అతగాడు సీట్లో లేడు. “ఏ మేకో, గుచ్చిసినాదేమో?ఎర్రి కేకేసాడు.. ఇందాకటి బట్టి సూత్తన్నా. తెగ కుర్సీలో నులుసుకుపోతున్నాడు. ఇదుగో.. కుర్చీ మేకులు, బయట కొచ్చినాయి. మనల్ని సినిమా సూడనీయనేదురా బాబూ!” పల్లెటూరి ఆసామి స్వగతంలా చెప్తునే ఉన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/oH-17ZnQ2Sg
Embed this episode
NOW PLAYING
కుక్క బుద్ధికి పిన్ను దెబ్బ | Kukka Buddhiki Pinnu Debba | Telugu Short Story | Damaraju Visalakshi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.