EPISODE · Feb 16, 2023 · 5 MIN
కుక్క తెలివి | Kukka Thelivi | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
కుక్క తెలివి రచన: Ch. ప్రతాప్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఒక అడవిలో ఒక కుందేలు వుండేది. దానికి గంపెడు పిల్లలు వున్నాయి. ప్రతి రోజు ఉదయం వాటికి తిండి కోసం కుందేలు బయటకు వెళ్ళేది. బయలుదేరేముందు దాని పిల్లలకు జాగ్రత్తగా వుండమని ఎన్నో సూచనలు చేసేది. ఎవరు పిలిచినా బయటకు రావొద్దని గట్టిగా నిర్దేశించింది. అయితే ఇల్లు విడిచి వెళ్ళినప్పటి నుండి తిరిగి వచ్చే వరకు తన పిల్లలు ఎలా వున్నాయో అని ఆ కుందేలు ఆందోళన పడుతూ వుండేది. అదే అడవిలో ఒక బలిష్టమైన అడవి కుక్క వుండేది. ఒకరోజు ఆ కుక్క తిండి కోసం వెదుకుతూ కుందేలు ఇంటివైపు వచ్చింది. ఆ ఇంట్లో ఆడుతూ పాడుతూ సందడి చేస్తూ ఆడుకుంటున్న కుందేలు పిల్లలు దానికి కనిపించాయి. మొదట్లో వాటిని ఒక్కొక్కటిగా తినేయాలని కుక్కకు ఆశ పుట్టింది. అయితే వాటి అమాయకత్వం, చిలిపితనం, అన్ని పిల్లలు కలిసి మెలిసి ఆడుకుంటుండడం చూసిన ఆ కుక్క కు వాటిపై జాలి వేసింది. ఏ మృగమో లేక, వేటగాడో వచ్చి వాటిని వేటాడి తీసుకుపోవచ్చునన్న ఆలోచనతో ఈ ఇంటి బయట ఆ పిల్లలకు కాపలాగా వుండసాగింది. సాయంత్రం తల్లి కుందేలు వచ్చేక కుక్క తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయేది. ఒక రోజు కాస్త ముందుగా ఇంటికి వచ్చిన కుందేలు ఇంటి బయట కూర్చున్న కుక్కను చుసి భయపడింది. తన పిల్లలను చంపడానికే కుక్క వచ్చిందన్న భయంతో నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ దాని దగ్గరకు వెళ్ళింది కుందేలు. తనను చూసి భయపడుతున్న కుందేలును చూసి కుక్క "ఏం భయపడవద్దు. నీ పిల్లలను చంపడానికి రాలేదు. పైపెచ్చు వాటిని ఆ జంతువు తినకుండా రోజూ కాపాడుతున్నాను. ఈ పిల్లలు నాకు పిల్లలే " అని చెప్పింది. ఆ మాటలకు కుందేలుకు కొండంత ధైర్యం వచ్చింది. తేలికైన మనసుతో కుక్క పక్కన కూర్చోని తాను తెచ్చిన ఆహారంలో కొంత భాగం పెట్టింది. అలా ఆనాటి నుండి కుక్క, కుందేలు మంచి స్నేహితులయ్యారు. కుందేలు కుటుంబం పై ఒక నక్క కళ్ళు పడ్డాయి. దాదాపుగా అప్పుడే ఎదుగుతున్న ఎనిమిది కుందేలు పిల్లలు. ఒక నెల రోజుల వరకు తన తిండికి ఏమీ ఢోకా ఉండదు. అయితే ఆ ఇంటికి కుక్క కాపలా వున్నంత కాలం తన పాచికలు అక్కడ పారవు. అందుకే కుందేలు పిల్లల్ని తినేందుకు ఒక పథకం వేసింది. దాని ప్రకారంగా ముందుగా కుక్కతో స్నేహం చేసింది. ప్రతీ రోజు పొద్దునే కుక్క దగ్గరకు వచ్చి మంచి మంచి కబుర్లు చెప్పసాగింది. అడవిలో తనకు అడపా దడపా దొరికే ఆహారాన్ని కూడా కొంచెం కొంచెంగా కుక్కతో కలిసి పంచుకో సాగింది. అలా నక్క , కుక్క కొద్ది రోజులలోనే మంచి స్నేహితులయ్యారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/SXIEg6gcjcM
Embed this episode
NOW PLAYING
కుక్క తెలివి | Kukka Thelivi | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.