EPISODE · Jan 8, 2023 · 11 MIN
కూడలి | Kudali | Telugu Short Story | Gorthi VaniSrinivas | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కూడలి రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) తండ్రి చనిపోతూ ఇచ్చిన కొబ్బరిబోండాల వ్యాపారాన్ని తండ్రి బాటలోనే సైకిల్ మీద కొనసాగిస్తున్నాడు కిష్టప్ప. ఊరంతా తిరిగి అమ్మడంతో వచ్చే సంపాదన పెరుగుతున్న కుటుంబ అవసరాలకు సరిపోకపోయినా ఆ వ్యాపారాన్ని వదిలిపెట్టకుండా చేస్తున్నాడు. జూన్ మాసం. ఆ యేడు ఊరి కూడలిలో రెండు కొత్త కాలేజీలు వెలిశాయి. "ఇగ్గో...ఏవయ్యో...ఏదోమూల నిలబడితే నీ బొండాలు ఎవడు కొంటాడయ్యో. కొత్త కాలేజీలు పెట్టిన కాడికి పోయి అమ్ము. స్టూడెంట్ కుర్రాళ్ళు రోజూ వచ్చి తాగుతారు. గిరాకీ ఎక్కువ ఉంటుంది" అంది కిష్టప్ప పెళ్ళాం సూరమ్మ. "అక్కడ అమ్మేటోళ్లు ఎవడూ లేకపోతే నేను అమ్ముదును. ముందే ఎవుడన్నా అమ్ముతుంటే మద్దెలో నేనెళ్తే తిట్టుకోరూ. " "ఊరుకుముందుగానే నీకన్నీ సందేహాలే.ఎల్తేనేగా తెలిసేది. బేగి ఎల్లి అక్కడ పాగా ఎయ్యి పో. ఎవుడేవంటాడో నేనూ చూస్తా" అంది సూరమ్మ. పెళ్ళాం నోటికి, పసిరికపాము కాటుకు మందులేదురా అయ్యా అని తండ్రి ఏనాడో చెప్పాడు. వెళ్లకపోతే ఎన్ని తిట్లు కాయాలో. దానికంటే ఎల్లిపోవడమే మంచిది అనుకుంటూ సైకిల్ ని కాలేజీ కూడలి వైపుకి తిప్పాడు. కాలేజీలన్నీ మెయిన్ రోడ్డునుంచి లోపలికి ఉన్నాయి. రోడ్డు మలుపులో సైకిల్ పెట్టుకుని నిలబడ్డాడు కిష్టప్ప. సపోటాల బండి తోసుకుంటూ వచ్చాడు ఓ కుర్రాడు. మోకాళ్ల వరకూ వేసుకున్న చినుగుల లాగూ, బొత్తాలు ఊడిన మాసిన చొక్కా వేసుకున్నాడు. సపోటాలు పాలసపోటాలోయ్ అంటూ అక్కడికి వచ్చాడు. తన బండిని రోడ్డు పక్కగా పెట్టి పళ్ళను ఆకర్షణీయంగా సర్దుతున్నాడు. గోలీసోడా అమ్మే తాత అక్కడకు ముందే వచ్చినట్టున్నాడు. వాళ్ళవంక చూస్తూ నిమ్మకాయల్ని సర్దిపెట్టుకున్నాడు. ఒకళ్ళనొకళ్ళు తినేసేలా చూసుకున్నారు. కాలేజీ సందులోంచి కుర్రాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళు దుకాణాల్ని పట్టించుకోవట్లేదు. కిష్టప్ప సైకిల్ గురించి ఎవరూ అభ్యంతరం పెట్టకపోయేసరికి హమ్మయ్య అని కుదురుకున్నాడు. పొద్దస్తమానం ఎదురుచూసినా ఎవరూ ఆ పక్కకి రాలేదు. ఆరోజు ఎండ గట్టిగానే కాసింది. చెట్టుకింద సైకిల్ ఆపుకుని కూర్చున్నాడు కిష్టప్ప. ఆ పక్కనే ముంజలు అమ్మే ముసలవ్వ గోని సంచీ పరిచి ముంజల్ని పెట్టుకుని ఈగల్ని తోలుకుంటోంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/uqZjLo8LSyk
Embed this episode
NOW PLAYING
కూడలి | Kudali | Telugu Short Story | Gorthi VaniSrinivas | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.