లైన్ క్లియర్ | Line Clear | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Jan 1, 2023 · 15 MIN

లైన్ క్లియర్ | Line Clear | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లైన్ క్లియర్ రచన: సిహెచ్. సీఎస్. శర్మ  కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ‘నలుపు...  నారాయుణ్ణి పోలు’, అన్నారు పెద్దలు. శరీర రంగుల్లో వున్న నలుపు తెలుపు తేడా మనస్సుకు లేదు. అందరి మనస్సులు తెల్లనివే. వారి వారి మనో భావాల మూలంగా మనస్సులుకు  నలుపు తెలుపు వర్తిస్తుంది. “మాధవయ్యా!”... నీవు హెడ్మాస్టర్ గా రెటైర్ అయిన  స్కూల్లోనే నీ పెద్ద కూతురు శాంతి వుద్యోగాన్ని చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా వుందయ్యా! ... నీవేమీ అనుకోనంటే ... నేను నీతో ఓమాట చెబుతాను” ..నవ్వుతూ చెప్పాడు వామనశాస్త్రి. “వామనా!... మనం స్నేహితులం. నీవు నా శ్రేయో భిలాషివి. నీవు చెప్పదలచుకొన్న  విషయాన్ని  నిర్భయంగా చెప్పు. నేను ఏమి అనుకోను.” చిరునవ్వుతో  మాధవయ్య గారు సమాధానం యిచ్చారు. తన చేతిలోనుండి  ఒక ఫోటోను బయటికి తీశాడు వామన శాస్త్రి . మాధవయ్య చేతికి అందించాడు. కొన్ని క్షణాలు ఆ ఫోటోను  పరీక్షగా చూసి  మాధవయ్య... “వామనా! అబ్బాయి లక్షణంగా  వున్నాడు. ఎవరు ఈ అబ్బాయి?...” అడిగాడు. “వాడు మా బావమరిది  కొడుకు. పేరు పరంజ్యోతి  రైల్వేలో  నెల్లూరులో గూడ్స్  క్లర్క్ గా పనిచేస్తున్నాడు.  మంచి గుణవంతుడు.  ఏ దురలవాట్లు లేవు. నీవు సమ్మతిస్తే ... నేను వాళ్ళ అమ్మా నాన్నలతో  మన శాంతిని గురించి మాట్లాడుతాను.” ఆశ్చర్యం,  ఆనందాలతో  వామనశాస్త్రి  ముఖంలోకి... చూచాడు మాధవయ్య. “ఏమిటి మాధవయ్యా అలా చూస్తున్నావు! పిల్లవాడు నీకు నచ్చలేదా!... ఎందుకు అడుగు తున్నా నంటే ... నీవు నీ పిల్లలను ఏరీతిగా పెంచి  పెద్దచేసి  విద్యా బుద్ధులు  నేర్పించావో  నాకు తెలుసుగా!.. నీకు నచ్చితే ... మా చెల్లెలికి పిల్లలకు నచ్చినట్లేగా... నేను ఈ వృత్తిలో వున్నందుకు  ఎందరో ఆడపిల్లలను  చూచాను. వారికీ ...నీ పిల్లలకు  భూమికి ఆకాశానికి  వున్నంత  వ్యత్యాసం వుంది. నీ నిర్ణయం   ఏమిటో చెప్పు.  నీవు  ‘వూ’ అంటే  నేను  ప్రొసీడ్ అయిపోతా ..” అన్నాడు వామనశాస్త్రి. మాధవయ్య గారి అర్ధాంగి సీతమ్మ వారిని సమీపించింది. “అన్నయ్యగారూ! ... బాగున్నారా!...”  ప్రీతిగా అడిగింది. మాధవయ్య  తన చేతిలోని  ఫోటోను  సీతమ్మ చేతికి యిచ్చాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/nQ6hAlk992k

Episode metadata supplied by the publisher feed · Published Jan 1, 2023

Embed this episode

NOW PLAYING

లైన్ క్లియర్ | Line Clear | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 15:55

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 15 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on January 1, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!