లహరి | Lahari | Telugu short Story | Sujatha Thimmana | manatelugukathalu.com episode artwork

EPISODE · Jan 9, 2023 · 13 MIN

లహరి | Lahari | Telugu short Story | Sujatha Thimmana | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లహరి రచన: సుజాత తిమ్మన (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఇండియా టైటిల్ కైవసం చేసుకుని ధగధగ మెరిసే కిరీటం శిరసున ధరించింది లహరి. ఆమె రెండు కళ్ళల్లో- ఒక కంట ఆశ్చర్యం తో కూడిన ఆనందం అయితే, మరో కంట తన విజయం వెనుక నాన్న పడిన శ్రమా, పంచిన ప్రేమామృతం.. ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను అనే కృతజ్ఞతా భావంతో కూడిన అశృ ధారలు చెంపలను తడిపేస్తూ ఉంటే... కిరీటంలోని రవ్వల మెరుపులు చిన్నబోతున్నాయి... చెక్కిళ్ళపై నిలిచిన నీటి బిందువులపై వున్న ఇంద్రధనుసు రంగులతో పోటీ పడలేక. చేతిలో కాఫీ కప్పుతో ఆ రోజు పేపర్లోని మొదటి పేజిలో వచ్చిన తన ఫోటోలను చూసుకుంటూ… నిన్నటి సంఘటన లోనుంచి గతంలోనికి జారిపోయింది లహరి. అక్క తరువాత ‘ఆడపిల్ల‘ గా పుట్టిన నేనంటే అమ్మకి ఎందుకో అసలు ఇష్టం ఉండేది కాదు... కడుపులో ఉన్నప్పుడు నన్ను పూర్తిగా అబ్బాయిగానే ఊహించుకుందట( నలుగురు ఆడపిల్లల మద్యలో నాలుగోది ఆమ్మ కావడంతో పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయింది. అయినా తనకు తానే స్పూర్తి అయి టైలరింగ్ నేర్చుకొని తన అవసరాలు తను తీర్చుకోనేదట. తరువాత తెలిసిన నిజం ) అందుకే నేను తొలి శ్వాస తీసినపుడే అమ్మాయి అని తెలియగానే ఆ రాత్రంతా ఏడుస్తూనే గడిపిందట. మొట్ట మొదటి సారిగా పురిటి కందుగా నాన్న ఒడి చేరానేమో…’నాన్న’ ను తలచుకుంటే చాలు ఆత్మార్పణ భావం మెదులుతుంది. అయన అనురాగాల ఆలింగనాలలోనే అన్ని మరచి పెరిగాను కదూ! అమ్మ అసలు నాకు కొత్త బట్టలు కూడా కొనేది కాదు. అన్నీ అక్కవే వేసేది. చివరికి స్కూలు పుస్తకాలూ, డ్రస్, షూస్, కూడా అక్కవే. చిన్న కంపెనీలో చిరు ఉద్యోగం చేస్తున్న నాన్న ఎప్పుడూ నన్ను సమాధాన పరుస్తూ ఉండేవారు. ఎప్పుడయినా తన బడ్జెట్ లోనుంచి నాకొక్కదానికే తను ఇష్టంగా బట్టలు తెచ్చేవారు. ఇంటి పరిస్థితులు అకళింపు చేసుకుంటూ అక్క గారాభాన్ని సహిస్తూ, నాన్న చెప్పే తన అనుభవాల కథలను, ఝాన్సిలక్ష్మి భాయి, రుద్రమదేవిల వీరత్వాన్నే కాదు... మొల్ల… వెంగమాంబ రచనల గురించి… సరోజిని దేవి… దుర్గాభాయి దేశ్ ముఖ్ యొక్క పోరాట పటిమను సమయం చిక్కి నప్పుడల్లా చెపుతూ నాలో తరగని ఆత్మస్థైర్యాన్ని నింపారు. నేనూ ఏదో సాధించాలనే తపనని నాకందిస్తూ, ’ఆడపిల్ల’ని అని ఎప్పుడూ వెరవకుండా సాగాలనే ధైర్యాన్ని పెంచారు. బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరాలనే ద్యేయంతో ప్రతి క్లాసులోనూ నేనే ప్రథమ స్థానంలో ఉండేదాన్ని. అది చూసి అక్క ఎప్పుడూ ఉడుక్కునేది. అమ్మ నా వైపు అభినందనగా చూసేది కానీ ఎప్పుడూ ప్రశంసించేదికాదు.. ఒక్కోసారి ‘నేను తనకి పుట్టలేదేమో?’ అనే సందేహం వస్తూ ఉండేది… అయినా అది కొద్ది సేపే…అమ్మ... అమ్మేగా... మరి. నిండుగా… గుంబనంగా ఉంటూ కెరటాలతో ఎగసి ఎగసి పడే సముద్రం కూడా ఒక్కో సారి సునామీలను ఎదుర్కోక తప్పటం లేదు. జీవితం కూడా అంతేనేమో! Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/T9v5H2009i8

Episode metadata supplied by the publisher feed · Published Jan 9, 2023

Embed this episode

NOW PLAYING

లహరి | Lahari | Telugu short Story | Sujatha Thimmana | manatelugukathalu.com

0:00 13:08

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on January 9, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!