EPISODE · Mar 6, 2023 · 9 MIN
లక్ష్మణ రేఖ | Lakshmana Rekha | Telugu Short Story | Otra Prakash Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లక్ష్మణ రేఖ రచన : ఓట్ర ప్రకాష్ రావు "నిన్ను ప్రేమించిన వాడు నయవంచకుడని పెళ్ళి జరగకముందే తెలుసుకొన్నావు" అంటూ ఒడిలో తల పెట్టుకొని ఏడుస్తున్నకూతురు పల్లవి తల నిమురుతూ అంది తల్లి. "అమ్మా! వాడు మంచివాడని నమ్మకం పెట్టుకొన్నాను. కానీ వాడు ఇంతటి దుర్మార్గుడనుకోలేదు. సారీ... ” “సారీ ఎందుకు పల్లవీ, నీవు నన్ను తల్లిగా కాకుండా ఒక మంచి స్నేహితురాలుగా భావించి నీవు ప్రేమిస్తున్న సంగతి నిజం చెప్పి మంచి పని చేశావమ్మా. నేను ప్రైవేట్ డిటెక్టీవ్ వారికి వాడి చిరునామా ఇచ్చి వాడి వివరాలు సేకరించ మన్నాను. వాళ్ళు ఇచ్చిన వివరాలు చూస్తుంటే వాడొక పెద్ద దగుల్బాజీ అని తెలిసింది. ఈ సంవత్సరంలోనే నీకు ముందు మరో ఇద్దరు అమ్మాయిలతో తిరిగాడంట. ఎందుకో బ్రేకప్ అయింది. అంతేకాదు. వాడు తరచూ పబ్బులకెళ్లడం, తాగడం గురించి చెబుతూ ఫొటోలతో పాటు మనకు ఇచ్చారు. పెద్ద ఆపద కలగకుండా ముందుగానే తప్పించుకొన్నావు. జరిగింది జరిగిపోయింది. ఇకమీదట వాడ్ని కలలో కూడా కన్నెత్తి చూడకు. ఏ సమస్య వచ్చినా నాతో చెప్పడం మరచిపోకు. ఆ డిగ్రీ పూర్తి చెయ్యడం చూడు. " "అమ్మా మరో పొరపాటు... పెద్ద పొరపాటు జరిగింది " “ఏమిటీ.... " “వాడు... వాడు నన్ను తప్పకుండా పెళ్లి చేసుకొంటాడన్న నమ్మకంతో వాడి బలవంతమీద " అంటూ తల వంచింది. “ఏం జరిగింది పల్లవీ" అదురుతున్న గుండెతో అంటూ కూతురు వైపు చూసింది. కళ్ళనీళ్ళతో చెప్పింది పల్లవి. “ఓహ్... నీవుకూడా పొరపాటు పడ్డావా... నాకెందుకో వాడిమీద అనుమానంగా వుంది. ఎంతకైనా తెగించేవాడిలా ఉన్నాడనిపిస్తోంది. వాడితో సెల్ఫీ తీసుకొన్నావా... " "సారీ అమ్మా... రెండు సార్లు తీసుకొన్నాను " "ఆ ఫోటోలు చాలు, నిన్ను బ్లాక్ మెయిల్ చెయ్యడానికి సిద్ధపడతాడు. ఏ విషయంలోనూ తొందరపడవద్దు. " అంటూ తల పట్ట్టుకొని ఆలోచించ సాగింది. “ నాన్నకు తెలిస్తే... " కన్నీళ్లతో అంది. " మీ నాన్నకు తెలిస్తే మనం ఇబ్బందిలో పడాలి. ఈ మధ్యనే హార్ట్ ఆపరేషన్ చేసుకొని వచ్చారు. ఆయనకు తెలియ కూడదు. ముందు నిన్ను డాక్టరు దగ్గరకు తీసుకొని వెళ్ళాలి " అంటూ సాగరికకు ఫోన్ చేసింది. "హలొ సాగరి.. బాగున్నావా... మీ అమ్మ జయప్రద ఎలా వుంది? మాట్లాడి చాల రోజులయింది. " "హలొ ఆంటీ... మా అమ్మ బాగుంది, అమ్మ ఎప్పుడూ మీ గురించి చెబుతూ ఉంటుంది. మీ దగ్గర యోగాసనాలు నేర్చుకొని ఇప్పుడు ఈ ఏరియాలో యోగమాస్టర్ అయ్యానని అమ్మ చెబుతూ ఉంటుంది. చెప్పండి ఏమిటి విశేషాలు. " "సాగరికా ఒక చిన్న సమస్య అందుకే నీకే ఫోన్ చేసాను. డాక్టరుగా నీవే పరిష్కరించగలవు " "నేనా... చెప్పండి ఆంటీ " "సాగరికా, మా అమ్మాయి పల్లవి... " అంటూ వివరంగా చెప్పింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/bJGuBGiUVPs
Embed this episode
NOW PLAYING
లక్ష్మణ రేఖ | Lakshmana Rekha | Telugu Short Story | Otra Prakash Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.