EPISODE · Aug 12, 2022 · 12 MIN
లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 18 | Love Challenge Episode 18 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 18 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… ఆద్య గురించి చులకనగా మాట్లాడిందని నిత్యా మేడం తో గొడవ పడతాడు జీవన్. ఆద్య కు కాలేజీలో అందరి ముందు 'ఐ లవ్ యు' చెబుతాడు. రిత్విక్ తో 'లవ్ ఛాలెంజ్' చేస్తాడు జీవన్. ఇక చదవండి… ఇంతలో అక్కడ ఉన్న వాళ్లను నెట్టుకుంటూ ఇద్దరు అమ్మాయిలు అక్కడికి వచ్చారు. వాళ్లు సరాసరి జీవన్ దగ్గరకు వెళ్లి, "మా ఇద్దరిలో ఎవరిని ప్రేమిస్తున్నావో చెప్పు" అన్నారు. జీవన్ కి ఏమీ అర్థం కాలేదు. "అసలు ఎవరు మీరు? నేను మీలో ఒకరిని ఎందుకు ప్రేమించాలి? నేను ఆద్యను ప్రేమిస్తున్నాను. ఆ విషయం ఇప్పుడే అందరి ముందూ చెప్పాను. ముందు మీరెవరో చెప్పండి" అని అడిగాడు. తరువాత తన వంక నవ్వుతూ చూస్తున్న రిత్విక్ ని గమనించి, "ఓహో! ఇది నీ ప్లాన్ అనుకుంటాను" అన్నాడు. "ప్లాన్ కాదు. జస్ట్ సిచువేషన్ నీకు అర్థం కావాలని ఇలా చేశాను. ఆ ఇద్దరు అమ్మాయిల లో ఒకర్ని లవ్ చేస్తున్నట్లు నువ్వు చెప్పగలవా? కచ్చితంగా చెప్పలేవు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నది ఆ ఇద్దరు అమ్మాయిలు మాత్రమే కాదు. అలాగే ఆద్య విషయంలో కూడా! మన ఇద్దరిలో ఒకర్ని ఎంచుకోవాలన్న నిబంధన ఆద్యకు ఎందుకు? మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ లో కూడా నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. ఇవి కాకుండా 'ఏదీ కాదు' అనే అప్షన్ కూడా ఉంటుంది. మరి ఆద్య కు రెండు ఆప్షన్స్ మాత్రమే ఇచ్చి వాటిలో ఒకటి ఎంచుకోమనడం న్యాయమా?” అన్నాడు రిత్విక్.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/otAvbuYnBBQ
Embed this episode
NOW PLAYING
లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 18 | Love Challenge Episode 18 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.