EPISODE · Jul 24, 2022 · 11 MIN
లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 4 | Love Challenge Episode 4 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 4 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… రిత్విక్ తో గొడవకు దిగిన వివేక్ ని చెంపమీద కొడతాడు జీవన్. జరగబోయే క్రికెట్ మ్యాచ్ లో తాను ఏ ప్లేస్ లో రావాలనేది కెప్టెన్ గా రిత్విక్ నిర్ణయిస్తాడని, అతను తన స్నేహితుడని అందరిలో చెబుతాడు. ఇంటికి వచ్చాక, జరగబోయే క్రికెట్ టోర్నమెంట్ లో రిత్విక్ ని దెబ్బ తీయాలని ప్లాన్ చేస్తాడు. గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిపించిన బుకీ పూర్నేష్ ని ఇంటికి రమ్మంటాడు జీవన్. ఇక చదవండి… జీవన్ ఇంటికి చేరుకున్న పూర్నేష్ బయటినుంచే కాల్ చేసాడు. "ఇంటి బయటే ఉన్నాను. నాన్నగారు ఇంట్లో ఉన్నారా? నేను నేరుగా నీ గదిలోకి రావచ్చా?" సందేహంగా అడిగాడు. జీవన్ ఫోన్ లోనే బిగ్గరగా నవ్వుతూ, "నేను నాన్నతో కలిసి చాలా సార్లు పుచ్చుకున్నాను. నీకేం భయం లేదు. కింద హాల్లో నాన్నగారు కనపడి, ఏదైనా అడిగితే నా పేరు చెప్పు. అయినా నువ్వొస్తున్నట్లు మా నాన్నగారి గన్ మాన్ కి చెప్పానులే" అన్నాడు. తన కార్ ని రోడ్ కి అవతలి వైపు పార్క్ చేసి, గేట్ దగ్గరకు వచ్చాడు పూర్నేష్. సెక్యూరిటీ అతన్ని గుర్తు పట్టి, లోపలికి వెళ్ళమన్నాడు. లోపల మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్న గన్ మాన్, "ఎం. పీ. గారు నిద్ర పోతున్నారు. జీవన్ సారు మిమ్మల్ని మేడ పైకి రమ్మన్నారు" అని చెప్పాడు... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/ufqCW6ODDHg
Embed this episode
NOW PLAYING
లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 4 | Love Challenge Episode 4 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.