EPISODE · Dec 18, 2022 · 3 MIN
ల్యాండ్ ఫోన్ | Land Phone | Telugu short Story | Lakshmi Chivukula | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ల్యాండ్ ఫోన్ రచన: లక్ష్మి చివుకుల (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "లాండ్ ఫోన్ ఎవరూ వాడటం లేదు. కనక్షన్ తీయించేవచ్చు కదా." సుధ భర్తకు ఎప్పటి నుంచో చెపుతోంది. "ఉండనీ ఆ ఫోన్ ఆ టేబుల్ మీద ఉండడం వలన నీకేమీ కష్టం" చిరాకు పడ్డాడు మూర్తి. "ఆ ఫోన్ అలంకారానికి మాత్రమే. ఎవరి సెల్ ఫోన్ లు వాళ్లకి వున్నాయి కదండీ." సుధ నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది భర్తకు. "అవుననుకో.. ఇదివరకు ఇంట్లో లాండ్ ఫోన్ వుంటే అదొక స్టేటస్ సింబల్. ఇప్పుడు ఎవరూ ఉపయోగించక పోయినా అలా వుంచుదాం. అప్పట్లో ఆ ఫోన్ కనక్షన్ కోసం నేను ఎన్ని తిప్పలు పడ్డాను." భార్యకు సమాధానం చెప్పి అక్కడ నుంచి వెళ్లి పోయాడు మూర్తి. కొన్ని నెలలు తరువాత ఒక రోజు వచ్చిన లాండ్ ఫోన్ బిల్లు చూసి అదిరి పడ్డాడు మూర్తి. "ఇదేమిటీ ఇంత ఘనంగా లాండ్ ఫోన్ వాడింది ఎవరూ? ఎప్పుడూ రాని బిల్ వచ్చింది?" అని ఇంట్లో వాళ్లందరినీ పేరు పేరునా అడిగాడు. కొడుకును అడిగితే "నేను ఆఫీసు వాళ్లు ఇచ్చిన ఫోన్ వాడుకుంటున్నాను. నేను అసలు లాండ్ ఫోన్ ఉపయోగించలేదు" అన్నాడు. కూతురిని అడిగితే ఆ అమ్మాయి కూడా అదే సమాధానం చెప్పింది. సుధను అడిగితే "నేనూ వాడలేదు. అయినా చక్కగా సోఫాలో కూర్చుని గంటలు గంటలు మాట్లాడుకోవడానికి చేతిలో సెల్ ఫోన్ వుండగా నిలబడి లాండ్ ఫోన్ ఎవరు మాట్లాడతారు?" ఎదురు ప్రశ్నించింది సుధ. ఇంట్లో వున్న నలుగురు నేను కాదంటే నేను కాదని అంటుంటే ఎవరు వాడితే లాండ్ ఫోన్ అంత బిల్ వచ్చిందో అర్థం కాక జుట్టు పీక్కున్నాడు మూర్తి. "అయ్యగారూ! నేనే లాండ్ ఫోన్ వాడాను అండీ. నేను వంటలు బాగా చేస్తానని మా బంధువులలో నాకు చాలా పేరు వుందండీ. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/tEytPx18lyw
Embed this episode
NOW PLAYING
ల్యాండ్ ఫోన్ | Land Phone | Telugu short Story | Lakshmi Chivukula | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.