EPISODE · Mar 8, 2023 · 14 MIN
మా అమ్మ నేర్పింది | Ma Amma Nerpindi | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మా అమ్మ నేర్పింది రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ‘అమ్మ.. నాన్నా.. దేవుడు.. ’ పదాలు మనకు నేర్పేది మన మాతృమూర్తి. మన అభివృద్ధి.. ఉన్నతి.. ఆ తల్లి పలికే ప్రతి మాట అంతరార్ధం. ఆ తల్లి తన జీవితాంతం మన మేలు కోరుకొంటుంది. తల్లిని ప్రత్యక్ష దైవంగా భావించడం మానవత్వం. “శివా.. ” ధర్మా పిలుపు విని వెనక్కు తిరిగి చూచాడు శివ. వారివురి పూర్తి పేరులు శివకుమార్, ధర్మారావు. ఇరువురు బంధువులు. వీరు చిన్నతనం నుండి ఒకే ప్రైమరీ, హైస్కూల్లో చదువుకున్నారు. ప్రస్తుతం వారు ప్లస్ టూ, సెకండ్ ఇయర్లలో వున్నారు. వీరిరువురికీ ఇంటా బయటా మరో పేరు వుంది కృష్ణా ర్జునులని. శివ క్రీడాభిమాని, ధర్మా సాహిత్యాభి మాని. కాబట్టి స్కూల్లో వీరికి ప్రత్యేక గుర్తింపు వుంది. “ఈ వారం సారస్వత సంఘ ఉపన్యాసానికి టాపిక్ (విషయం) ఏమిటో తెలుసా శివా”.. అడిగాడు ధర్మ. “తెలుసు.. ” ప్రతాప్ చెప్పాడు. “ఈ దేశం కోరే భావి భారత పౌరులు”. విరక్తిగా నవ్వాడు శివ. “ఎందుకురా.. అంత విరక్తిగా నవ్వుతావ్!.. ” ఆశ్చర్యంగా శివ ముఖంలోకి చూస్తూ అడిగాడు ధర్మ. “పరీక్షలు పదిరోజుల్లో వున్నాయ్. బాగా చదివి గట్టు దాటాలి. మన అమ్మా నాన్నలు మనమీద ఎన్నో ఆసలు పెట్టుకొని వున్నారు. బాగా వ్రాసి పాసై వారిని సంతోషపెట్టాలి. మన భవిష్యత్ ఎలావుందో!.. ” సీరియస్ గా చెప్పాడు శివా. “డోంట్ వర్రీ డియర్.. నీకు తోడుగా నీ ఈ ధర్మా ఉన్నాడుగా.. ” చిరునవ్వుతో అనునయంగా చెప్పాడు ధర్మా. శివా చేతిని తన చేతిలోనికి తీసుకొని “శివా.. నీవూ మాట్లాడి తీరాలి.. ” శివా ధర్మా ముఖంలోకి చూచి తల ఆడించాడు. ఇరువురూ మౌనంగా క్లాస్ రూమ్ లోకి ప్రవేశించారు. ***** ఆ మరుదినం సాయంత్రం గంట నాలుగున్నర సమయం. స్కూలు మధ్యన వున్న స్టేజి పై హెడ్మాస్టర్ వరదరాజులు గారు, తెలుగు పండిట్ విద్వాన్ నారాయణ గారు, ఇంగ్లీష్, సైన్సు మాస్టర్ సీతాపతి గారు సుఖాసీనులై వున్నారు. స్కూలు పిల్లలంతా వేదిక ముందు శ్రద్దగా కూర్చొని వున్నారు. పేర్లు ఇచ్చిన విద్యార్ధులు ఒకొక్కరుగా వచ్చి మాట్లాడి వెళుతున్నారు. సైన్సు మాస్టార్ ధర్మ పేరును మైక్ లో చెప్పారు. ధర్మ స్టేజి పైకి వచ్చాడు. “పూజ్యులు, గౌరవనీయులైన హెడ్ మాస్టర్ గారికి, తెలుగు మాస్టారు గారికి, సైన్సు మాస్టారు గారికి సవినయంగా నా వంద నాలు సమర్పిస్తున్నాను. ” వినయంగా చేతులు జోడించాడు. విద్యార్ధుల వైపుకు తిరిగి “మీకందరకీ నా శుభాశీస్సులు. ఈనాటి చర్చనీయాంశం ‘ఈ దేశం కోరే భావి భారత పౌరులు’. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/YpT3tZMsOxc
Embed this episode
NOW PLAYING
మా అమ్మ నేర్పింది | Ma Amma Nerpindi | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.