Skip to content
మా బడి మిత్రుని కబుర్లు! episode artwork

May 18, 2020 12 min

మా బడి మిత్రుని కబుర్లు!

from Harshaneeyam

నా కథలు ఎక్కువగా నా బాల్యము, స్నేహితులు మరియు కుటుంబము ఇతివృత్తము గా సాగుతుంటాయి. ఈ మధ్య ఎక్కువగా కాలేజీ స్నేహితుల గురించే సాగ దీసి మిమ్మల్ని విసిగించాను. ఈ సారి మార్పుగా నా చిన్న నాటి స్నేహితుడి గురుంచి రాయాలనుకుంటున్నాను. వాడు ప్రస్తుతము అమెరికా సంయుక్త రాష్ట్రము లోని ఉత్తర కరోలినా లో ఉద్యోగపర్వం వెలగపెడుతున్నాడు పేరు దాడి ప్రతాప్. ఏ కొత్త విషయం కనిపించినా నేర్చుకోవడానికి వాటి మీదకి దాడి చేసేస్తాడు. మా అమ్మ, మా పెద్దమ్మ కూతురైన మా బాడుగ అక్క మరియు ప్రతాప్ వాళ్ళ అమ్మ గార్లు కావలిలో పి.యూ.సి చదివారు. వాళ్ళ అమ్మగారిది అల్లూరు. అప్పట్లో కావలి చదువులకు చాలా ప్రసిద్ధి. విశ్వోదయ లాటి బడులతో, జవహరి భారతి లాటి కళాశాలలో చదవడానికి చుట్టుపక్కల వున్న ఊర్ల నుండి కావలి చేరుకొనే వారు. మా అమ్మ వాళ్ళు ఒకప్పుడు సహాధ్యాయులైనా నేను వాడిని తొలిసారి చూసింది మాత్రం, నేను రాజుపాలెంలో బస్సు ఎక్కి ఉలవపాళ్లకు వెళ్తుండగా వాడు అదే బస్సులో నెల్లూరు నుండి కమ్మపాలెం వస్తున్నాడు. ఆ ప్రయాణమప్పటికి మేము చాలా పిల్ల పీసులం అయినా మా అమ్మ వాళ్ళు మమ్మల్ని వాళ్లకు రక్షణగా తీసుకెళ్తున్నారు. వాళ్ళు వాళ్ళ ఊరిలో దిగుతూ మాకు సీట్ ఇవ్వటం నాకు ఇంకా గుర్తు. ఆ తరువాత మా నాన్న మరియు వాళ్ళ నాన్న కలిసి రైల్వే గుత్తే దారులుగా అవతారమెత్తారు. మా నాన్న చేసే రైల్వే పనులను పర్యవేక్షణ చేసే ఇంజనీర్ ప్రతాప్ వాళ్ళ ఇంట్లో బాడుగకు ఉండే వారు, అలా ఆ ఇంజినీరు, ప్రతాప్ వాళ్ళ నాన్న మరియు మా నాన్న పార్టనర్స్ గా అవతారమెత్తారు. అలా మా అమ్మ వాళ్ళ స్నేహాలు మరలా పునరుజ్జీవనం చెందాయి. ఒక రోజు మా పేద పుత్తేడు జిల్లా పరిషత్ పాఠశాలలో నా మానాన నేను మా లెక్కల అయ్యోరి చేతిలో వొంగో పెట్టిచ్చుకుని గుద్దులు గుద్దిచ్చుకుంటుండగా మా వోడు ఎక్స్-క్యూస్ మీ అంటూ ఎంట్రీ ఇచ్చాడు. మా అయ్యోరు మహా గట్టివారు, నువ్వు ఎంత పీక్కున్నా నేను వీడిని తప్ప వోల్ తరగతిని వదులుతాను అని వాడిని తరిమేయ్యటం తో మా వోడు బడి వదిలిన దాకా నాకోసం బయట కాసుక్కూర్చోని వున్నాడు. నీ పాసుగూలా ఇలా చెప్పా పెట్టకుండా నెల్లూరి నుండి వచ్చెయ్యటమేనా, ముందే చెబితే మా అయ్యోరి చేతిలో పడకుండా మా ఏర్పాటులేదో చేసుకునే వాడిని కదా అనుకుంటూ ఇంటి దారి పట్టాము. నా కన్నా వాడు రెండేళ్లు పెద్ద, కానీ ఆ కిలోగ్రాములు ఈ కిలోగ్రాములు అని ఆంగ్ల మాధ్యమం లో చదివి నా కోసం ఆగిపోయాడు. ఇద్దరం ఇప్పుడు ఒకటే తరగతి కాకపోతే వాడు ఎల్.సి.ఎం మరియు జి.సి.డి అంటాడు నేను క.సా.గు మరియు గ.సా.ప్ర అంటా అంతే తేడా. అలా వచ్చిన వాడు ఓ వారం వుండిపోయాడు మా ఉప్పలపాటిలో. మా స్నేహితులకి వాడు చెప్పే నెల్లూరు కథలు చాలా నచ్చేశాయి, మాటి మాటికీ వాడనే మా నెల్లూరులో ఐతేనా అంటూ చెప్పటం. రాత్రి అయితే వాడు కథా, మాటలు, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహించి చెప్పే ఎక్సార్సిస్ట్ కథలు, నేను మరియు నా స్నేహితుల మందరిమి ఆరు బయట మంచాలు వేసుకొని కెవ్వు కెవ్వు మంటూ వినటం, మా పెద్దోళ్ల చేత తిట్లు తినటం ఆ దిక్కుమాలిన కథలు వినటం ఎందుకు మమ్మల్ని మీరు ఉత్సలకు పోవడానికి కూడా లేపటం ఎందుకు అని. మా వాడైతే ఆ సినిమాని థియేటర్ లో ఒంటరిగా చూస్తామని పందెం కట్టి గుండె ఆగి చచ్చిపోయినోళ్లు బొచ్చెడు మంది అని చెప్పే వాడు. మా పల్లెలో కేవలం ఆదివారాలు మాత్రమే ఇళ్లల్లో దోసెలు చేసే వారు. మా అమ్మ చేసిన ఎర్ర కారమేసుకొని హా! హా! అంటూ ఓ పది అయినా లాగించేసే వాళ్ళం. మా వాడిది చాలా ఇంజనీరింగ్ బుర్ర లే, మేము ఇటుక రాళ్లనే బస్సులుగా భావించి తోసుకుంటూ ఆడుతుంటే వాడు వాటికి ఇసుకతో రాంపులు మరియు సొరంగాలు తయారు చేసే వాడు. నేను కూడా వీడి వెంట పడి నెల్లూరు వెళ్లే వాడిని. మాకు ఉప్పలపాటిలో బ్రేక్ ఫాస్ట్ రోజూ సద్దెన్నం మరియు ఆదివారం మాత్రమే దోసెలు. నెల్లూరులో ఎక్కడ బడితే అక్కడ దోశె అంగడులే, రూపాయికి పది దోసెలు. ఇద్దరం వాళ్ళ ఇంట్లో రూపాయ తీసుకొని అంగడికి వెళ్లే వాళ్ళం, నాకేమో అక్కడ అందరి ముందు తినటం కొత్తగా మరియు సిగ్గుగా ఉండేది, మా వాడేమో ఇక్కడే తింటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ అడగొచ్చు అని అక్కడే తినిపిచ్చే వాడు. ఆపమ్ అనే పేరు విన్నది నేను అక్కడే. వీడికి మేము ఆరు ఏడూ తరగతుల్లో ఉండగానే క్రికెట్ పిచ్చి చాలా ముదిరి ఉండేది. పుర చేయి వాటం. దారిలో నడుస్తూ నడుస్తూ ఎడం చేతిని గిర్రున బౌలింగ్ చేసిన ఆక్షన్ లో, లేక పోతే ముందుకి రెండడుగులు గెంతి చేత This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Episode details come from the podcast's RSS feed.

Embed this episode

నా కథలు ఎక్కువగా నా బాల్యము, స్నేహితులు మరియు కుటుంబము ఇతివృత్తము గా సాగుతుంటాయి. ఈ మధ్య ఎక్కువగా కాలేజీ స్నేహితుల గురించే సాగ దీసి మిమ్మల్ని విసిగించాను. ఈ సారి మార్పుగా నా చిన్న నాటి స్నేహితుడి గురుంచి రాయాలనుకుంటున్నాను. వాడు ప్రస్తుతము అమెరికా సంయుక్త రాష్ట్రము లోని ఉత్తర కరోలినా లో ఉద్యోగపర్వం వెలగపెడుతున్నాడు పేరు దాడి ప్రతాప్. ఏ కొత్త విషయం కనిపించినా నేర్చుకోవడానికి వాటి మీదకి దాడి చేసేస్తాడు. మా అమ్మ, మా పెద్దమ్మ కూతురైన మా బాడుగ అక్క మరియు ప్రతాప్ వాళ్ళ అమ్మ గార్లు కావలిలో పి.యూ.సి చదివారు. వాళ్ళ అమ్మగారిది అల్లూరు. అప్పట్లో కావలి చదువులకు చాలా ప్రసిద్ధి. విశ్వోదయ లాటి బడులతో, జవహరి భారతి లాటి కళాశాలలో చదవడానికి చుట్టుపక్కల వున్న ఊర్ల నుండి కావలి చేరుకొనే వారు. మా అమ్మ వాళ్ళు ఒకప్పుడు సహాధ్యాయులైనా నేను వాడిని తొలిసారి చూసింది మాత్రం, నేను రాజుపాలెంలో బస్సు ఎక్కి ఉలవపాళ్లకు వెళ్తుండగా వాడు అదే బస్సులో నెల్లూరు నుండి కమ్మపాలెం వస్తున్నాడు. ఆ ప్రయాణమప్పటికి మేము చాలా పిల్ల పీసులం అయినా మా అమ్మ వాళ్ళు మమ్మల్ని వాళ్లకు రక్షణగా తీసుకెళ్తున్నారు. వాళ్ళు వాళ్ళ ఊరిలో దిగుతూ మాకు సీట్ ఇవ్వటం నాకు ఇంకా గుర్తు. ఆ తరువాత మా నాన్న మరియు వాళ్ళ నాన్న కలిసి రైల్వే గుత్తే దారులుగా అవతారమెత్తారు. మా నాన్న చేసే రైల్వే పనులను పర్యవేక్షణ చేసే ఇంజనీర్ ప్రతాప్ వాళ్ళ ఇంట్లో బాడుగకు ఉండే వారు, అలా ఆ ఇంజినీరు, ప్రతాప్ వాళ్ళ నాన్న మరియు మా నాన్న పార్టనర్స్ గా అవతారమెత్తారు. అలా మా అమ్మ వాళ్ళ స్నేహాలు మరలా పునరుజ్జీవనం చెందాయి. ఒక రోజు మా పేద పుత్తేడు జిల్లా పరిషత్ పాఠశాలలో నా మానాన నేను మా లెక్కల అయ్యోరి చేతిలో వొంగో పెట్టిచ్చుకుని గుద్దులు గుద్దిచ్చుకుంటుండగా మా వోడు ఎక్స్-క్యూస్ మీ అంటూ ఎంట్రీ ఇచ్చాడు. మా అయ్యోరు మహా గట్టివారు, నువ్వు ఎంత పీక్కున్నా నేను వీడిని తప్ప వోల్ తరగతిని వదులుతాను అని వాడిని తరిమేయ్యటం తో మా వోడు బడి వదిలిన దాకా నాకోసం బయట కాసుక్కూర్చోని వున్నాడు. నీ పాసుగూలా ఇలా చెప్పా పెట్టకుండా నెల్లూరి నుండి వచ్చెయ్యటమేనా, ముందే చెబితే మా అయ్యోరి చేతిలో పడకుండా మా ఏర్పాటులేదో చేసుకునే వాడిని కదా అనుకుంటూ ఇంటి దారి పట్టాము. నా కన్నా వాడు రెండేళ్లు పెద్ద, కానీ ఆ కిలోగ్రాములు ఈ కిలోగ్రాములు అని ఆంగ్ల మాధ్యమం లో చదివి నా కోసం ఆగిపోయాడు. ఇద్దరం ఇప్పుడు ఒకటే తరగతి కాకపోతే వాడు ఎల్.సి.ఎం మరియు జి.సి.డి అంటాడు నేను క.సా.గు మరియు గ.సా.ప్ర అంటా అంతే తేడా. అలా వచ్చిన వాడు ఓ వారం వుండిపోయాడు మా ఉప్పలపాటిలో. మా స్నేహితులకి వాడు చెప్పే నెల్లూరు కథలు చాలా నచ్చేశాయి, మాటి మాటికీ వాడనే మా నెల్లూరులో ఐతేనా అంటూ చెప్పటం. రాత్రి అయితే వాడు కథా, మాటలు, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహించి చెప్పే ఎక్సార్సిస్ట్ కథలు, నేను మరియు నా స్నేహితుల మందరిమి ఆరు బయట మంచాలు వేసుకొని కెవ్వు కెవ్వు మంటూ వినటం, మా పెద్దోళ్ల చేత తిట్లు తినటం ఆ దిక్కుమాలిన కథలు వినటం ఎందుకు మమ్మల్ని మీరు ఉత్సలకు పోవడానికి కూడా లేపటం ఎందుకు అని. మా వాడైతే ఆ సినిమాని థియేటర్ లో ఒంటరిగా చూస్తామని పందెం కట్టి గుండె ఆగి చచ్చిపోయినోళ్లు బొచ్చెడు మంది అని చెప్పే వాడు. మా పల్లెలో కేవలం ఆదివారాలు మాత్రమే ఇళ్లల్లో దోసెలు చేసే వారు. మా అమ్మ చేసిన ఎర్ర కారమేసుకొని హా! హా! అంటూ ఓ పది అయినా లాగించేసే వాళ్ళం. మా వాడిది చాలా ఇంజనీరింగ్ బుర్ర లే, మేము ఇటుక రాళ్లనే బస్సులుగా భావించి తోసుకుంటూ ఆడుతుంటే వాడు వాటికి ఇసుకతో రాంపులు మరియు సొరంగాలు తయారు చేసే వాడు. నేను కూడా వీడి వెంట పడి నెల్లూరు వెళ్లే వాడిని. మాకు ఉప్పలపాటిలో బ్రేక్ ఫాస్ట్ రోజూ సద్దెన్నం మరియు ఆదివారం మాత్రమే దోసెలు. నెల్లూరులో ఎక్కడ బడితే అక్కడ దోశె అంగడులే, రూపాయికి పది దోసెలు. ఇద్దరం వాళ్ళ ఇంట్లో రూపాయ తీసుకొని అంగడికి వెళ్లే వాళ్ళం, నాకేమో అక్కడ అందరి ముందు తినటం కొత్తగా మరియు సిగ్గుగా ఉండేది, మా వాడేమో ఇక్కడే తింటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ అడగొచ్చు అని అక్కడే తినిపిచ్చే వాడు. ఆపమ్ అనే పేరు విన్నది నేను అక్కడే. వీడికి మేము ఆరు ఏడూ తరగతుల్లో ఉండగానే క్రికెట్ పిచ్చి చాలా ముదిరి ఉండేది. పుర చేయి వాటం. దారిలో నడుస్తూ నడుస్తూ ఎడం చేతిని గిర్రున బౌలింగ్ చేసిన ఆక్షన్ లో, లేక పోతే ముందుకి రెండడుగులు గెంతి చేత

Ready to play

మా బడి మిత్రుని కబుర్లు!

0:00 12:54

No transcript yet.

Requests help us decide what to transcribe next.

Frequently asked questions

How long is this episode of Harshaneeyam?

This episode is 12 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on May 18, 2020.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.