Skip to content
మా దేవళపు ఇసిత్రాలు! episode artwork

Mar 27, 2020 7 min

మా దేవళపు ఇసిత్రాలు!

from Harshaneeyam

నాకు ఈ మధ్యన మా ఉప్పలపాడు చాలా గుర్తుకొస్తోంది. నాకు దిగులేసినప్పుడల్లా అలా గుర్తుకొస్తోంది, ఎందుకో! నేను చిన్న చిన్న కథలు రాయడం మొదలు పెట్టినప్పుడు నాకు తెలుసు నా ప్రెపంచం చాలా చిన్నదని. నాకు తెల్సు, నేను, నా కుటుంబం, నా స్నేహితాలు లేక జీవితంలో నాతో పాటూ పరిగెట్టినోళ్లు, నన్నొదిలేసి ఎల్లిపొయ్యినోళ్లు, ఈళ్ల గురించే రాయగలనని. అదేగాదు, నేను చూడలేని వాటి గురించి, చూడనోళ్ళ గురించి రాయలేనని. అట్టా అనుకున్నప్పుడు, ఇవన్నీ గబా గబా రాసేస్తే, ఇంక రాయడానికి యింకేం మిగులుద్ది, అని అనిపిస్తే, ఆ దిగులింకా పెరిగిపోతావుంది. ఆ దిగులుతోనే నేను ఇప్పుడు మిమ్మల్నీ, మా ఉప్పలపాడుకి తీసుకోబోతా! అక్కడికెందుకురా ఇప్పుడు మనం, అంటే ఏమో! మా అమ్మమ్మోళ్ల ఇల్లు మా రాములోరి దేవళం కి ఎడం పక్కన. నా చిన్నప్పుడు ఆరుబయట ఓ నవారు మంచమో నులక మంచమో ఏస్కొని, వళ్లు మర్చిపొయ్యి, కలల్లోకి బొయ్యి, మళ్ళీ ఉదయాన్నే లేవంగానే, ఎదురుంగా, దేవళం మీద ఓ రెక్క విరిగిన గరుత్మంతుడు, అట్టా నిల్చోనుండేవాడు. నాకెందుకో, రాములోరుతో, దేశాలన్నీ తిరిగే ఆయన కంటే, సీతమ్మోరిని, రావణాసురుడు పట్టకపొయ్యేటప్పుడు, అడ్డం పడి , రెక్కలు విరగొట్టుకున్న జటాయువు, అక్కడ కనపడే వాడు. ఎందుకంటారా ఏమో. అలా ఉదయాన్నే సీతమ్మోరిని, రాముల వారిని తలచుకోవటం అదృష్టమేమో. మా గుడికి ఓ మూగ పూజారి పక్కన ఊరినించొచ్చి, మా నడీది బాయి నుండి నీళ్లు తెచ్చి అభిషేకం చేసి అలంకరించి పొయ్యేవాడు. అగుపడని దేవుడికి, కనపడని మనసుతో, వినపడని పూజ చేసే ఆ పూజారిని మా ఊరిజనాలు గుళ్లోకెందుకు రానిచ్చారో. ఏమో! అట్టానే ఆ నడీది బాయిని, ఎసుటి నీళ్ల బాయి అనే వాళ్ళం. ఆ నీళ్లు అన్నం వొండటానికి పనికొస్తాయే గానీ తాగడానిగ్గాదు. తాగడానికి మళ్ళీ, మాకు ఇంకో మంచెళ్ల బాయి ఉండేది. పనికి రాని నీళ్లు ఎసుటి కెందుకు, అభిషేకానికెందుకు అని, అడగబాకండి . ఏమో! సాయంత్రాల పూట మాత్రం మా మునవ్వో, లేక మా రామాంజవ్వో లేక ఎవరో ఒక ముసలవ్వలు, దీపాలు పెట్టేవోళ్ళు గుళ్లో. మా అమ్మమ్మ ఎప్పుడు ఈ దీపాలు పెట్టే అవ్వలతో గుళ్లో దీపాలు పెట్టేది కాదు. . నాకయితే మా అమ్మమ్మ కూడా ఆ అవ్వల మాదిరే దీపాలు పెడితే చూడాలనుండేది. ఎందుకు పెట్టేది కాదో . తనతోనే ఎప్పుడూ వుండే రాముణ్ణీ, గుడి దాకా పొయ్యి చూసే పనేముందనేమో! ఆ అవ్వలందరూ గుడిలో దీపం పెట్టి గుడి వరండాలో ఊసులాడుకోని , చివరగా అక్కడే ఆడుకుంటున్న మా పిలకాయల్ని పిల్చి, లెక్క ప్రకారం ఒక్కొక్కరికి, ఒక్కొక్క నలుసంత కలకండ ముక్క పెట్టేటోళ్లు. మా స్నేహితులు అప్పుడప్పుడు, వాళ్ళు పెట్టే ఆ నలుసంత కలకండ కోసం, సిగ్గు లేకుండా ఆమైన మన ఆటలు గూడా మానేసి వెళ్లాలా అనే వాళ్ళు. నేను మాత్రం అలా సిగ్గు పడేటోణ్ణి గాదు. పైపెచ్చు మా మురళి గాడు వొంతో లేక మా వంశీ గాడి వొంతో గూడా , అడిగి తెచ్చుకొనేటోణ్ణి . నేను ఎందుకంత ఆశ పడేటోణ్ణో నన్ను అడగబాకండి. అట్టాగే , ప్రతీ శనివారం సాతంత్రం పూటా మా మునెవ్వ , రామాంజవ్వ ఇంకా చాలా అవ్వలు కలిసి, హరే రామ హరే రామ! రామ రామ హరే హరే! హరే కృష్ణ హరే కృష్ణ! కృష్ణ కృష్ణ హరే హరే! అని భజన చేసేటోళ్లు. ఆ భజనకు మా మునెవ్వ కొడుకయిన వెంకన్న డోలు వాయించే వాడు. మా అమ్మమ్మ ఇంట్లో వుండే నాకు, ఈ భజన వింటూ వాళ్ళ మీద ఒక జాలి కలిగేది. వీళ్ళకి ఈ నాలుగు వాక్యాలకన్నా ఎక్కువవరావేమో అందుకనే అవే తిప్పి తిప్పి ప This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Episode details come from the podcast's RSS feed.

Embed this episode

నాకు ఈ మధ్యన మా ఉప్పలపాడు చాలా గుర్తుకొస్తోంది. నాకు దిగులేసినప్పుడల్లా అలా గుర్తుకొస్తోంది, ఎందుకో! నేను చిన్న చిన్న కథలు రాయడం మొదలు పెట్టినప్పుడు నాకు తెలుసు నా ప్రెపంచం చాలా చిన్నదని. నాకు తెల్సు, నేను, నా కుటుంబం, నా స్నేహితాలు లేక జీవితంలో నాతో పాటూ పరిగెట్టినోళ్లు, నన్నొదిలేసి ఎల్లిపొయ్యినోళ్లు, ఈళ్ల గురించే రాయగలనని. అదేగాదు, నేను చూడలేని వాటి గురించి, చూడనోళ్ళ గురించి రాయలేనని. అట్టా అనుకున్నప్పుడు, ఇవన్నీ గబా గబా రాసేస్తే, ఇంక రాయడానికి యింకేం మిగులుద్ది, అని అనిపిస్తే, ఆ దిగులింకా పెరిగిపోతావుంది. ఆ దిగులుతోనే నేను ఇప్పుడు మిమ్మల్నీ, మా ఉప్పలపాడుకి తీసుకోబోతా! అక్కడికెందుకురా ఇప్పుడు మనం, అంటే ఏమో! మా అమ్మమ్మోళ్ల ఇల్లు మా రాములోరి దేవళం కి ఎడం పక్కన. నా చిన్నప్పుడు ఆరుబయట ఓ నవారు మంచమో నులక మంచమో ఏస్కొని, వళ్లు మర్చిపొయ్యి, కలల్లోకి బొయ్యి, మళ్ళీ ఉదయాన్నే లేవంగానే, ఎదురుంగా, దేవళం మీద ఓ రెక్క విరిగిన గరుత్మంతుడు, అట్టా నిల్చోనుండేవాడు. నాకెందుకో, రాములోరుతో, దేశాలన్నీ తిరిగే ఆయన కంటే, సీతమ్మోరిని, రావణాసురుడు పట్టకపొయ్యేటప్పుడు, అడ్డం పడి , రెక్కలు విరగొట్టుకున్న జటాయువు, అక్కడ కనపడే వాడు. ఎందుకంటారా ఏమో. అలా ఉదయాన్నే సీతమ్మోరిని, రాముల వారిని తలచుకోవటం అదృష్టమేమో. మా గుడికి ఓ మూగ పూజారి పక్కన ఊరినించొచ్చి, మా నడీది బాయి నుండి నీళ్లు తెచ్చి అభిషేకం చేసి అలంకరించి పొయ్యేవాడు. అగుపడని దేవుడికి, కనపడని మనసుతో, వినపడని పూజ చేసే ఆ పూజారిని మా ఊరిజనాలు గుళ్లోకెందుకు రానిచ్చారో. ఏమో! అట్టానే ఆ నడీది బాయిని, ఎసుటి నీళ్ల బాయి అనే వాళ్ళం. ఆ నీళ్లు అన్నం వొండటానికి పనికొస్తాయే గానీ తాగడానిగ్గాదు. తాగడానికి మళ్ళీ, మాకు ఇంకో మంచెళ్ల బాయి ఉండేది. పనికి రాని నీళ్లు ఎసుటి కెందుకు, అభిషేకానికెందుకు అని, అడగబాకండి . ఏమో! సాయంత్రాల పూట మాత్రం మా మునవ్వో, లేక మా రామాంజవ్వో లేక ఎవరో ఒక ముసలవ్వలు, దీపాలు పెట్టేవోళ్ళు గుళ్లో. మా అమ్మమ్మ ఎప్పుడు ఈ దీపాలు పెట్టే అవ్వలతో గుళ్లో దీపాలు పెట్టేది కాదు. . నాకయితే మా అమ్మమ్మ కూడా ఆ అవ్వల మాదిరే దీపాలు పెడితే చూడాలనుండేది. ఎందుకు పెట్టేది కాదో . తనతోనే ఎప్పుడూ వుండే రాముణ్ణీ, గుడి దాకా పొయ్యి చూసే పనేముందనేమో! ఆ అవ్వలందరూ గుడిలో దీపం పెట్టి గుడి వరండాలో ఊసులాడుకోని , చివరగా అక్కడే ఆడుకుంటున్న మా పిలకాయల్ని పిల్చి, లెక్క ప్రకారం ఒక్కొక్కరికి, ఒక్కొక్క నలుసంత కలకండ ముక్క పెట్టేటోళ్లు. మా స్నేహితులు అప్పుడప్పుడు, వాళ్ళు పెట్టే ఆ నలుసంత కలకండ కోసం, సిగ్గు లేకుండా ఆమైన మన ఆటలు గూడా మానేసి వెళ్లాలా అనే వాళ్ళు. నేను మాత్రం అలా సిగ్గు పడేటోణ్ణి గాదు. పైపెచ్చు మా మురళి గాడు వొంతో లేక మా వంశీ గాడి వొంతో గూడా , అడిగి తెచ్చుకొనేటోణ్ణి . నేను ఎందుకంత ఆశ పడేటోణ్ణో నన్ను అడగబాకండి. అట్టాగే , ప్రతీ శనివారం సాతంత్రం పూటా మా మునెవ్వ , రామాంజవ్వ ఇంకా చాలా అవ్వలు కలిసి, హరే రామ హరే రామ! రామ రామ హరే హరే! హరే కృష్ణ హరే కృష్ణ! కృష్ణ కృష్ణ హరే హరే! అని భజన చేసేటోళ్లు. ఆ భజనకు మా మునెవ్వ కొడుకయిన వెంకన్న డోలు వాయించే వాడు. మా అమ్మమ్మ ఇంట్లో వుండే నాకు, ఈ భజన వింటూ వాళ్ళ మీద ఒక జాలి కలిగేది. వీళ్ళకి ఈ నాలుగు వాక్యాలకన్నా ఎక్కువవరావేమో అందుకనే అవే తిప్పి తిప్పి ప

Ready to play

మా దేవళపు ఇసిత్రాలు!

0:00 7:29

No transcript yet.

Requests help us decide what to transcribe next.

Frequently asked questions

How long is this episode of Harshaneeyam?

This episode is 7 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on March 27, 2020.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.