Skip to content
మా (కానీ) సత్యం! episode artwork

May 3, 2020 11 min

మా (కానీ) సత్యం!

from Harshaneeyam

నేను నా కథలతో మా ఇంట్లో కనిపించిన పుస్తకాన్నంతా నలుపు చేసేస్తున్నానని, ఈ రోజు మా అమ్మ నాకో మందపాటి పాత డైరీ ఇచ్చి, దీంతో రాసుకో, రాసుకొని ఎక్కడంటే అక్కడ పారేసుకోకుండా జాగ్రత్త పెట్టుకో అని చెప్పింది. ఆ పాత డైరీ తీసుకోగానే, ఏదైనా ఓ పాత మధురంతో వెంటనే నలుపు చేసెయ్యాలన్న కోరిక నన్నావహించింది. ఎవరి గురుంచి రాయాలబ్బా అని ఆలోచిస్తుంటే మా సత్యగాడు గుర్తొచ్చాడు. ఇప్పగుంట వెంకట సత్యనారాయణ, మా స్నేహితులకందరికీ ఐ.వి.ఎస్ గా సుపరిచితుడు, కానీ నాకు మాత్రం సత్య గానే, మా ఇంట్లో వాళ్లకు సత్యంగా. జీవితం లో కష్టాలు పడి పైకి వచ్చిన వాళ్ళని మనం కథలలో చదువుతూ లేక సినిమాలలో చూస్తూ లేక నిజ జీవితం లో ఎవరి ద్వారా అయినా వింటూ చాలా ఉత్తేజితుల మవుతాము, కానీ అలాటి ఒక వ్యక్తి మన సమకాలీనికుడు అయినప్పుడు మన జీవనక్రమంలో పడి తన ఎదుగుదలని మనము పెద్దగా గమనించలేము. అలా మా సమకాలీనుకులలో జీవనక్రమాన్ని మొదలుపెట్టిన స్థితితో పోలిస్తే ప్రస్తుత స్థితి ఎంతో అందలేనంత ఎత్తులో నిలుపుకున్న వ్యక్తే మా సత్య. కానీ ఈ క్రమంలో వాడేమి బావుకున్నాడో లేక ఏమి కోల్పోయేడో వాడికే తెలియాలి. మనిషి ఐదడుగుల ఆరంగుళాల ఎత్తుతో, చక్కటి వర్ఛస్సుతో, అప్పటికే ఎన్నో ఆటుపోటులను చవిచూసిన కారణంతోనో లేక బాల నెరుపు వల్లనో అక్కడక్కడా తెలుపు లేక ఎరుపు కానీ జుట్టు ఉండేవాడు సత్య. తన చురుకుతనంతో, తెలివితేటలతో, మహా కలివిడి తనంతో మరియు సహజ సిద్ధంగా అలవడిన వేణుగానంతో వాడు మా కాలేజీ చేరిన కొద్ది దినాల్లోనే బాగా పాపులర్ అయిపోయాడు. నాకు, శ్రీధర గాడికి వాడు ఎప్పుడు స్నేహితుడైపోయాడో కూడా తెలియనే లేదసలు. తెలిసే సరికి వాడు కూడా శ్రీధర గాడిలాగే మా కుటుంబ సభ్యుడైపోయాడు, వాళ్ళని నే పిలిచే వరసలతోనే పిలిచేస్తూ. రోజుల తరబడి తినకపోయినా, నిద్రపోకపోయినా, అలుపెరగని దేహం, చెక్కు చెదరని నవ్వు వాడి సొంతం. కాలేజీ లో పగలంతా లేక చాలా పొద్దుపోయిన దాకా అందరి రూములూ కలియ తిరుగుతూ, సందడి సందడి చేస్తూ, అందరూ పడుకున్నాక, తెలవారు ఝాము వరకూ చదువుకోవటం వాడి అలవాటు. నెల్లూరు జిల్లాలోని కావలి వాడి స్వస్థలం. పుట్టింది పేద బ్రాహ్మణ కుటుంబములో. చదువుకున్నది కావలి బ్రాహ్మణ సంఘము వారి సహకారంతో మరియు వారాలు చేసుకుంటూ. వాడు పదవ తరగతి ఉత్తీర్ణుడయ్యాక, ఆ సంఘము వారు వాడి బతుకేదో బతికేస్తాడని వాడిని ఓ టైపు ఇన్స్టిట్యూట్లో చేర్చారట, అక్కడ ఆ ఇన్స్టిట్యూట్ యజమాని వీడి తెలివితేటలు చూసి పైచదువులు చదువుకోమని ప్రోత్సహించాడట. అలా ఎంసెట్ రాసి ఆయన సహకారంతో వీడు మా కాలేజీలో పడ్డాడు. అలాగే వీడు వీడి చదువులతో ఎప్పుడు ఆయన్ని నిరాశ పరచ లేదు. మేము మా రెండవ సంవత్సరంలో ఉండగా వాళ్ళ నాన్నగారు పోయారు. వీడు మాకెవరికీ చెప్పకుండా కావలికి వెళ్ళిపోయాడు. మేము ఒక పదిమంది స్నేహితులం తెలుసుకొని కావలికి చేరే సరికి అర్థరాత్రి అయిపొయింది. మాకు వాడి ఇల్లు ఎక్కడో కూడా తెలియదు. నాకు ఓ చిన్న జ్ఞాపకం, ఎక్కడో జనతా పేటలో వాళ్ళ ఇల్లు అని. మా దురదృష్ట వశాత్తు మేము దిగిన రోజే కావలిలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళ రాష్ట్ర మహా సభలు జరుగుతున్నాయి. మేము బస్సు దిగి నాలుగు అడుగులు వేసేమో లేదో, ఒక పోలీసు జీప్ వచ్చి మమ్మలన్దరినీ కట్టగట్టి పోలీస్ స్టేషన్లో పడేసింది. మేము ఇలా స్నేహితుడి నాన్నగారు చనిపోతే వచ్చాము అన్నా నమ్మే నాథుడే లేదు, మాలో కనీసం ఒక్కడి దగ్గర కూడా కాలేజ్ ఐడెంటిటీ కార్డు లేదు. మాతో పాటే జీపులో ఎక్కించుకొచ్చిన ఒక దొంగని మా కళ్ళ ముందరే సెల్ లో నాలుకు పీకుతుంటే బిక్కు బిక్కుమని గడిపాము. మా అదృష్టవశాత్హు ఆ దొంగని బాదిన ఒక కానిస్టేబుల్ మా సత్యకి ఇంటర్లో సహాధ్యాయుడు అవటంతో, ఇన్స్పెక్టర్ కి చెప్పి సత్య వాళ్ళింటికెళ్లి వచ్చి మేము చెప్పింది నిజమే అని నిర్ధారణ చేయటంతో, ఆ కానిస్టేబుల్ సహాయంతోనే మేము సత్య వాళ్ళ ఇంటికి చేరుకున్నాము. వాళ్ళ ఇంటికెళ్లాకే మాకు తెలిసింది, సత్యాకి ఒక అక్క ఉందని, ఆ అక్క అప్పటికే ఒక ముస్లింని పెళ్లిచేసుకొని ఇంటినుండి వెళ్ళిపోవటంతో వీడు తనతో సంబంధ బాంధవ్యాలు తెంచేసుకున్నాడని. మేము ఉన్నంత వరకు వాళ్ళ బావ గారు మాతో చాలా కలివిడిగా, మా వెంటనే వున్నారు. పోనీలే ఆవిడ వీడి కోపతాపానికి బలయినా ఆవిడకి మంచి భర్తే వచ్చాడని అనుకున్నాము మేము. ఇద్దరు పిల్లలు అనుకుంటా వారికి అప్పటికే. అలా మేము వాళ్ళ నాన్నగారి కర్మకాండలలో పాలుపంచుకొని, ఆ రాతిరికి వాకాడుకి చేరుకున్నాము. వాళ్ళ నాన్నగారు చనిపోవటంతో వాడు వాళ్ళ అమ్మగారిని తీసుకొని This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Episode details come from the podcast's RSS feed.

Embed this episode

Ready to play

మా (కానీ) సత్యం!

0:00 11:07

No transcript yet.

Requests help us decide what to transcribe next.

Frequently asked questions

How long is this episode of Harshaneeyam?

This episode is 11 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on May 3, 2020.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.