EPISODE · Dec 7, 2022 · 12 MIN
మా నాన్నకు సన్మానం | Ma Nannaku sanmanam | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మా నాన్నకు సన్మానం రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “యిదిగో, యిటు రావోయ్! మా నాన్నకి ఈ నెల 30 వ తేదీన రవీంద్రభారతి లో సన్మానమట, తప్పకుండా రమ్మని ఫోన్ చేసారు” అన్నాడు కిరణ్, వంటింట్లో వున్న భార్య వినత తో. “పదేళ్ల క్రితం చేశారుగా, మళ్ళీ యిప్పుడు ఎందుకు?” అంది అక్కడ నుంచే. “అది మా నాన్న రిటైర్ అయినప్పుడు ఆఫీస్ వాళ్ళు చేసింది. యిప్పుడు ఒక పెద్ద పత్రిక వాళ్ళు చేస్తున్నారు, కొంతమంది ప్రముఖ రచయితలకు” అన్నాడు సంతోషంతో కిరణ్. “ప్రముఖ రచయితలకా, మరి మామయ్యగారి కి ఎందుకు?” అంది, సన్నాయి రాగం తీస్తో వినత. “అవునులే.. నీకు మా నాన్న రాసిన కథలు చదవటానికి తీరిక ఎక్కడా పాపం, ఎంతసేపు ఆ టివీలో ‘అత్తగారి హత్య, మామగారి వింత రోగం’ లాంటి సీరియల్స్ చూడటానికి టైం చాలదు” అన్నాడు కోపంగా కిరణ్. “అబ్బా.. ఊరుకోండి నాన్నా! మీ యిద్దరి పొట్లాటలతో నాకు చదువు సాగడం లేదు. నేను చెపుతున్నా.. మనం తాతయ్య సన్మానానికి వెళ్తున్నాం, అంతే” అంటున్న కూతురు వంక ఆనందంగా కిరణ్, కోపంగా వినత ఒకేసారి చూసారు. మొత్తానికి హైదరాబాద్ వెళ్లడం మానేసి., తండ్రికి తనకి ఆఫీసులో ఇన్స్పెక్షన్ వుంది రాలేను అనిచెప్పి తప్పించుకున్నాడు. ఆ విషయం తెలిసిన కూతురు, తండ్రితో, “నువ్వు అమ్మ ఏమంటే దానికి ‘అంతేగా… అంతేగా… ‘ అని తాత సన్మానానికి వెళ్లకుండా చేసావు. యింట్లో అమ్మ చేత నీకు జరిగే సన్మానం తప్పా, యింతవరకు నేను నిజమైన సన్మానం చూడలేదు. అంతా చెడగొట్టారు” అంది. ‘చివరికి నీకు కూడా లోకువ అయ్యాను’ అనుకుంటూ ఆఫీస్ కి వెళిపోయాడు కిరణ్. యింకో గంటలో ఆఫీస్ అవుతుంది అనగా, వినత ఫోన్ చేసి కిరణ్ కి, “ఏమండోయ్! మా అమ్మ కాలు జారిందిట, మనం వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి. పనిలో పని, మామయ్యగారి సన్మానం కూడా చూసినట్టు వుంటుంది. మా అమ్మకి సహాయం చేసినట్టు వుంటుంది. పాపం నాన్న ఎంత బాధ పడుతున్నారో..” అంది. “అదేంటి, మీ అమ్మ యిప్పుడు కాలు జారడం ఏమిటి, మీ నాన్న వుండగా, ఛీ ఛీ” అన్నాడు. “అయ్యో రాత! తెలుగు సినిమాలు చూసి పాడైపోయారు. బాత్రూం లో కాలు జారి పడిపోయింది. లేవలేకపోతోందిట. త్వరగా రండి” అంది. “పూర్తిగా వినరు. వీలుంటే ఫ్లైట్ లో వెళ్దాం” అని కంగారు పెట్టేసింది వినత. “ఆ.. వస్తాను” అని ఫోన్ పెట్టేసాడు కిరణ్. మొత్తానికి రెండవ రోజు అంటే గురువారం ఫ్లైట్ లో బయలుదేరారు హైదరాబాద్. యిద్దరి అత్తగారి ఇళ్ళు హైదరాబాద్ అవడం తో కొంత సుఖం గా వుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో నుంచి బయటకు వచ్చి క్యాబ్ లో డైరెక్టుగా అత్తగారి ఇంటికి బయలుదేరారు. క్యాబ్ లో వినత, వాళ్ల అమ్మకి ఎలా వుందో అని ఒకటే కంగారు పడుతోనే వుంది. గంట ప్రయాణం తరువాత బీరంగూడ చేరుకున్నారు. క్యాబ్ లో నుంచి దిగి, అక్కడ దృశ్యం చూసి కొయ్యబారి పోయాడు కిరణ్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/1hJ-yNfbtfc
Embed this episode
Ready to play
మా నాన్నకు సన్మానం | Ma Nannaku sanmanam | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.