మా ఊరి అంగడి | Ma Uri Angadi | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 27, 2023 · 7 MIN

మా ఊరి అంగడి | Ma Uri Angadi | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మా ఊరి అంగడి రచన: లక్ష్మి మదన్  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) బుధవారం వచ్చిందంటే చాలు మా ఊరు సందడి సందడిగా మారుతుంది. ఎందుకంటే ఆ రోజు అంగడి. మా ఊరి అంగడిలో ఆరోజు పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. గొర్రెలు, బర్రెల దగ్గర నుండి గోర్ల పెయింట్ వరకు అమ్మకానికి ఉంటాయి. కూరగాయలు, పండ్లు, బట్టలు, పక్క పిన్నిసులు, బొట్టు బిళ్ళలు, బొంబాయి బొట్టు, కుంకుమ, పసుపు, మొలదారాలు.. ఒక్కటేమిటి అక్కడ దొరకనిది లేదు. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊర్లన్నిటికీ మా ఊరి అంగడి ఆధారం. ఏమి కొనుక్కొని పోవాలన్నా బుధవారం నాడు మాత్రమే వీలవుతుంది. అందుకని అంగడి కోసం తయారుగా ఉండేవారు. కొందరికి ఏమో స్వకార్యం స్వామి కార్యం అన్నట్లు కొనుగోలు చేయడంతో పాటు ఆటవిడుపు లాగా వేరే ఊరికి రావడం సంతోషంగా ఉండేది. ఇక కథలోకి పోదాం. సరోజనమ్మ పనులన్నీ తొందరగా ముగించుకొని అంగడికి పోవాలి అని అనుకుంటుంది. ఇంట్లో పనులు అంత తొందరగా తెములుతాయా! పిల్లలు స్కూల్కు పోవాలి, భర్త ఆఫీసుకు పోవాలి, ఇంట్లో ఉన్న పెద్దమనిషి అత్తకు మడివంటకి అన్ని సిద్ధం చేయాలి.. వ్యవసాయ ఆధారమైన ఇల్లు కాబట్టి వడ్ల పని బియ్యం పని ఉండనే ఉంటుంది. అన్ని పనులు అయ్యాక భోజనం చేద్దామని అనుకున్నది కానీ పక్క ఊరి నుండి వచ్చే వరుసకు బంధువులైన తల్లి కూతుర్లు వస్తారని ఊహించి కాసేపు వాళ్ల కోసం ఎదురు చూద్దాం అనుకున్నది. ఇంతలో తల్లి కూతుర్లు రానే వచ్చారు.. కామాక్షమ్మ ,కాంతమ్మ. సినిమాల్లో సూర్యకాంతం, గిరిజ ఎలాగో వీళ్ళు అలా అన్నమాట. పరమగయ్యాళ్లు. వీళ్లకు వీరే సాటి. వీరి నోటికి జడిసి చాలామంది వీరికి దూరంగా ఉండేవాళ్ళు. కానీ ప్రేమస్తులు. హి హి అని నవ్వుకుంటూ ఇద్దరు లోపలికి వచ్చారు. ఈ ఊరు నుండి ఆ ఊరికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది, వస్తారు. కామాక్షమ్మ కి భర్త లేడు. కాంతమ్మ భర్తను వదిలేసింది. కాంతమ్మ వాళ్ల పెరట్లో పూసిన గన్నేరు పూలు, సబ్జా ఆకు కలిపి పెద్ద దండలుకొని నెత్తినిండా పెట్టుకుంది. సౌరంతో వేసుకున్న జడ చాలా పెద్దగా ఉంది. చక్కగా ఎక్కడికో టూర్ వెళ్లినట్టుగా తయారైంది. కానీ పాపం ఆ పల్లెటూరు నుండి వారం కి ఒకసారే కదా పట్టణానికి రావడం.. ఇదే వాళ్లకు ఒక వ్యాపకం ఒక ఆనందం, ఒక సరదా. "సరోజనా! ఓ సరోజనా! ఉన్నావే.. గిన్ని మంచినీళ్లు ఇయ్యి. ఎండల వడి వచ్చినం" అన్నది కామాక్షమ్మ. ఇద్దరూ భవంతిలో మొగురంని ఆనుకొని చతికిలబడి కూర్చున్నారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/qhg8vrKfCRE

Episode metadata supplied by the publisher feed · Published Feb 27, 2023

Embed this episode

NOW PLAYING

మా ఊరి అంగడి | Ma Uri Angadi | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com

0:00 7:16

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 7 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 27, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!