మాడ్యులర్ కిచెన్ | Modular Kitchen | Telugu Short Story | Madduri Bindumadhavi | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 11, 2023 · 4 MIN

మాడ్యులర్ కిచెన్ | Modular Kitchen | Telugu Short Story | Madduri Bindumadhavi | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మాడ్యులర్ కిచెన్ రచన: మద్దూరి బిందుమాధవి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “అమ్మా! ఇవ్వాళ్ళ నా ప్రాజెక్ట్ లాంచింగ్. సెలవు పెట్టలేను. కిచెన్ రిపేర్ పని వాళ్ళొస్తారు. పదింటికి వచ్చి మా ఇంట్లో ఉండి కాస్త ఆ పని చేయించగలవా” అని కూతురు కాంచన అభ్యర్ధన విని, గబ గబా పని తెముల్చుకునే కార్యక్రమంలో పడింది శకుంతల. కాంచన తల్లి ఆ ఊళ్ళోనే ఉన్నా... కూతురి ఇంట్లో ఎవరూ ఉండరు... అందరూ ఉద్యోగాలకి పోతారనే కారణంతో ఎక్కువగా వాళ్ళింటికి వెళ్ళదు. తన ఇంటి పని ముగించుకుని..ఓ మెతుకు నోట్లో వేసుకుని క్యాబ్ మాట్లాడుకుని కూతురింటికి జుబిలీ హిల్స్ వెళ్ళింది. @@@@ పని వాళ్ళు వంటగదిలో పని చేసుకుంటున్నారు. తను టీవీ చూస్తూ కూర్చుంటే వాళ్ళు సరిగా చేస్తారో లేదో అనే అనుమానంతో అక్కడే పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. మధ్యాహ్నం దాకా పని చేసి, లంచ్ కి వెళ్ళొస్తాం అని వాళ్ళటు వెళ్ళాక అప్పటి దాకా ఏం పని చేశారో చూద్దామని అటు వెళ్ళింది. వంటింట్లోనే పని చేస్తున్నారు కనుక అక్కడ టీ పెట్టుకునే వీలు ఉంటుందో లేదో అని తనింటినించే ఫ్లాస్కులో టీ పోసి తెచ్చుకుంది. కప్పులో టీ పోసుకుని తాగుతూ అన్నీ పర్యవేక్షించింది. ఫ్లాట్ కొనేటప్పుడు ఉన్న కప్ బోర్డ్స్ అన్నీ పీకేసి కొత్తగా మాడ్యులర్ కిచెన్ ఫిక్స్ చేస్తున్నారు. అన్నీ తయారుగా (pre designed) ఉన్న కింది వైపు షెల్ఫులు, చిమ్నీ, పై వరసలో షెల్ఫులు కొంతవరకు బిగించారు. మిగిలినవి ఇవ్వాళ్ళ పూర్తి చేసి రేపు వచ్చి వాష్ బేసిన్, డిష్ వాషర్ బిగిస్తాము అని చెప్పారు. @@@@ "అమ్మా వాళ్ళు పని చేస్తున్నారా? ఎంతవరకు అయింది. నాకు ఇక్కడ పని అయిపోయేట్టుంది. వీలైనంత త్వరగా వచ్చేస్తాలే" అన్నది కాంచన. అన్నట్టే సాయంత్రం 5.30 కల్లా కాంచన ఇంటికి వచ్చేసింది. అప్పటికి మాడ్యులర్ కిచెన్ లో భాగమైన 'ఫేబర్' లేటెస్ట్ మోడల్ స్టవ్, చిమ్నీ బిగించే పని చూస్తున్నారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/cp_2WnKtBUU

Episode metadata supplied by the publisher feed · Published Feb 11, 2023

Embed this episode

NOW PLAYING

మాడ్యులర్ కిచెన్ | Modular Kitchen | Telugu Short Story | Madduri Bindumadhavi | manatelugukathalu.com

0:00 4:54

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 4 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 11, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!