EPISODE · Feb 14, 2023 · 6 MIN
మానవ సేవే మాధవ సేవ | Manava Seve Madhava Seva | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మానవ సేవే...మాధవ సేవ రచన: Ch. ప్రతాప్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జయంతపురంలో రామయ్య, కృష్ణయ్య అనే స్నేహితులు వుండేవారు. వారిద్దవిరివీ పక్క పక్క ఇళ్లు. ఇద్దరూ తమకు తమ తాతల నుండి సంక్రమించిన వ్యవసాయ భూమిలో సేద్యం చేసుకుంటూ వచ్చిన ఆదాయంతో సంతృప్తిగా జీవిస్తుండేవారు. ఇద్దరి కుటుంబాల మధ్య మంచి స్నేహం వుంది. ఒక రోజు రామయ్య కృష్ణయ్య వద్దకు వచ్చి అక్కడికి 200 మైళ్ళ దూరంలో వున్న ప్రసిద్ధ వినాయకుని క్షేత్రానికి వెళ్దామని అడిగాడు. అక్కద దైవ దర్శనం చేసుకుంటే జీవితంలో వచ్చే అన్ని సమస్యలు తొలిగిపోయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయన్నది ఆ దేసవాసుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఆ క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆ క్షేత్రంలో సంవత్సరానికి ఒకసారి పెద్ద జాతర జరుగుతుంది. ఆ జాతరకు వెళ్దామని రామయ్య అడగగా కృష్ణయ్య వెంటనే అంగీకరించాడు. జాతరకు నాలుగు రోజుల వ్యవధే ఉన్నందున మర్నాడే అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇద్దరూ బయలుదేరారు. మూడవ రోజుకు ఒక గ్రామం పొలిమేరకు చేరగా అక్కడ రహదారి పక్కన అచేతనంగా పడివున్న ఒక వృద్ధుడు వారికి కనిపించాడు. వెంటనే రామయ్య ఎడ్ల బండి ఆపించి కిందకు దిగి ఆ వృద్ధుడిని పరీక్షించాడు. అతని నాడి చాలా బలహీనంగా వుంది. బహుశా అధిక శ్రమ, అనారోగ్యం, పస్తుల ఉండటాన ఆ వృద్ధుడు అచేతనమైపోయి వుంటాడనుకున్నారు. తన సీసా నుండి అతని ముఖంపై నీళ్ళు జల్లి, కాస్త బలవంతంగా త్రాగించి అతడిని సపర్యలు చేయసాగాడు రామయ్య. ఇదంతా చూస్తున్న కృష్ణయ్య ముఖం చిట్లించాడు. లేని పోని తద్దినం తలకు తగిలించుకోవడం అంటే ఇదే రామయ్యా? ఇప్పుడో, మరుక్షణమో అన్నట్లు వున్న ఈ ముసలాడికి సేవలు చేయడం అవసరమా చెప్పు? ఇతగాడికి సపర్యలు చేస్తూ సమయం వృధా చేసుకుంటే రేపటికి మనం జాతరకు చేరలేము. అసలే ముందు దట్టమైన అదవి వుంది. దానిని చీకటిపడే లోగా దాటటం ఎంతో అవసరం.ఈ ముసలయ్యను వదిలిపెట్టి త్వరగా రా" అంటూ కృష్ణయ్య విసుగుతో రామయ్యను తొందరపెట్టసాగాడు. రామయ్య ఎంతో ప్రశాంతంగా" మిత్రమా, సాటి మనిషి ఆపదలో వున్నప్పుడు ఆదుకోవడం సాటి మానవునిగా మన కనీస కర్తవ్యం. ఇతడు కొన ఊపిరితో వున్నాడు. కాస్త సపర్యలు చేస్తే కోలుకునే అవకాశాలు మెండుగా వున్నాయి. ఈ పరిస్థితిలో మన స్వార్ధం చూసుకోవడం అన్యాయం.ఇతడికి నేను చేతనైనంత సేవలు చేసాకే ఇక్కడి నుండి కదులుతాను" అని ధృఢంగా అన్నాడు. ఆ మాటలకు కృష్ణయ్య ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఏం చెప్పినా రామయ్య వినేటట్లు లేడు. అతని చాదస్తంతో తనకు పని లేదు. ఇక్కడ వుండడం అనవసరం నౌకున్నాడు. "అయితే నీ ఖర్మ నీది. నేను ఇక్కడ నీతో కూర్చోని ఈ ముసలాయనకు సేవలు చెస్తూ నా సమయం వృధా చెసుకోలేను. నేను బండి తీసుకొని బయలుదేరుతున్నాను. రేపటికల్లా జాతరకు చేరుకోవాలన్న నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు" అని బండి తీసుకొని ముందుకు వెళ్ళిపోయాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Je4pah2_vt4
Embed this episode
NOW PLAYING
మానవ సేవే మాధవ సేవ | Manava Seve Madhava Seva | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.