EPISODE · Feb 16, 2023 · 22 MIN
మాతృహృదయ మహత్తు | Mathruhrudaya Mahatthu | Telugu Short Story | Chennuri Sudarsan | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మాతృహృదయ మహత్తు రచన: చెన్నూరి సుదర్శన్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అది ఎర్రగట్టు పోలీసు స్టేషన్.. హసన్ పర్తి. రాజశేఖరం ఎస్సై సెల్ ఫోన్ ఆన్ చేసి సమయం చూసాడు. దాదాపు ఎనిమిది కావస్తోంది. బయట అంతా ప్రశాంతంగా ఉంది. శీతాకాలం.. జనసంచారం లేక అర్థరాత్రి అయిందన్న అనుభూతి కలుగుతోంది. ‘ఈరోజు డ్యూటీ ప్రశాంతంగా ముగిసినట్టే.. ఈరోజు ఏంటి? ప్రతీ రోజు ప్రశాంతంగానే ముగుస్తోంది. ఈ స్టేషన్లో చేరి దాదాపు నెలరోజులు కావస్తున్నా.. కనీసం కీసులాడుకునే కేసు గూడా నమోదు కాలేదు. ఊరి గట్టు మీది గట్టమ్మ తల్లి చల్లంగా చూస్తుందనే ప్రజల నమ్మకం.. ’ అనే ఆలోచన ముఖం కవళికలను మార్చబోయింది.. పెదవులు విచ్చుకో బోతున్నాయి. అంతలోనే ఆగమన్నట్టు అతని ఆరవస్మృతిపథం హెచ్చరించింది. ‘నిజమే.. ఈ ఉద్యోగమే అంత. పోలీసు నిఘంటువులో విశ్రాంతి అనే పదమే లేదు. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాల్సిందే. కాసేపు శారీరక విశ్రాంతి దొరుకుతుందేమో! గాని మానసిక ప్రశాంతతకు పోలీసులు నోచుకోలేదు’ అని మనసులోకి రాగానే.. చిరునవ్వుతో తన గది నుండి బయటకు వచ్చాడు రాజశేఖరం. అతణ్ణి చూడగానే స్టేషన్ కాపలాదారుడు కనకయ్య కడక్ సలాం చేసాడు. రాజశేఖరం జాగ్రత్త అన్నట్టు చేతితో సంజ్ఞ చేస్తూ స్టేషన్ మెట్లు దిగుతుంటే.. ఒక అమ్మాయి పరుగెత్తుకుంటూ రావడం.. కంట పడింది. చటుక్కున ఆగిపోయాడు. “పోలీస్ అంకుల్.. ” అని వెక్కి, వెక్కి ఏడువసాగింది. ఆయాసంతో గొంతు నుండి మాట పెకలడం లేదు. ఎంతో ప్రయాస పడుతూ.. “కాపాడండి” అనగలిగింది. ఆమె ఏడుపు తారాస్థాయికి చేరింది. కనకయ్య పరుగు, పరుగున వచ్చి అమ్మాయిని చూసి గుర్తుపట్టాడు. “సార్.. ఈ అమ్మాయి అనంతయ్య కూతురు” అంటూ అమ్మాయి వైపు తిరిగి “నీ పేరు నీరజ కదమ్మా” అడిగాడు ఆప్యాయంగా. అవును అన్నట్టుగా తలూపింది. ఆమె ఎదలో ఏదో భయమావహించి కంపించి పోతోందని గ్రహించిన రాజశేఖరం ‘భయపడకు’ అన్నట్టు నీరజ భుజం తట్టుతూ.. తన గదిలోకి తీసుకు వెళ్ళాడు. కుర్చీలో కూర్చోవడం లేదు. “ఫరవాలేదమ్మా.. కూర్చో.. ” అంటూ మరో మారు ధైర్యం చెప్పి కూర్చోమన్నాడు. “ఇప్పుడు చెప్పు నీరజా.. ఎందుకు భయపడుతున్నావు. ఎక్కడి నుండి పరుగెత్తుకుంటూ వస్తున్నావు” అని అడుగుతూ.. నీరజ వంక పోలీసు చూపులకు పదును పెట్టాడు రాజశేఖరం. బహుశః టీనేజీ లోకి అడుగు పెట్టినట్టుగా కనబడుతోంది. తల చెదిరి, కుడి బుగ్గపై గాటు.. అర్థమయ్యింది. “భయపడకు నీరజా.. కాపాడండి అంటూ పరుగెత్తుకుంటూ వచ్చావు. తప్పకుండా కాపాడుతాను. నువ్వు నా కూతురులాంటి దానివి ” అంటూంటే ఈమధ్యనే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన అతని కూతరు జ్ఞప్తికి వచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి. కర్చీఫ్ తో కళ్ళు ఒత్తుకుంటూ.. భరోసా ఇచ్చాడు రాజశేఖరం. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/byBYWMmY5iA
Embed this episode
NOW PLAYING
మాతృహృదయ మహత్తు | Mathruhrudaya Mahatthu | Telugu Short Story | Chennuri Sudarsan | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.