మచ్చ | Machha | Telugu Short Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com episode artwork

EPISODE · Mar 3, 2023 · 18 MIN

మచ్చ | Machha | Telugu Short Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మచ్చ కొత్తపల్లి ఉదయబాబు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఆంటీ. మేము ఎదురింటి వారి పక్కవాటాలోకి వచ్చాము. మీకు పాలబ్బాయి ఇంటికి వచ్చి పోస్తాడట కదా. మీకు అభ్యంతరం లేకపోతే అతనికి చెప్పి మా ఇంటికి పంపిస్తారా?" పడకగదిలో ఉన్న నాకు వీణ మీటినట్లు మధుర కంఠస్వరంతో మాటలు వినిపించాయి. "అలాగా! తప్పనిసరిగా పంపిస్తానమ్మా. ఇంతకీ మీ పేరు? మీ వారు ఏం చేస్తుంటారు?"అడుగుతోంది శ్రీమతి. " నాపేరు లక్ష్మీప్రణతి. ఆయన పాలిటెక్నిక్ కాలేజీలో ప్రొఫెసర్ గా చేస్తున్నారండి. తన పేరు లక్ష్మణ ప్రదీప్. ఆయన కాలేజీకి వెళ్ళడానికి బయల్దేరబోతూ టిఫిన్ చేస్తున్నారు. నేను మీతో ఈ విషయం అడుగుదామని ఇలా వచ్చాను. మళ్లీ ఇంకోసారి వస్తాను" అని వెళ్ళిపోయినట్టుంది ఆమె. ఆమె పేరు మరోసారి గుర్తు చేసుకుంటూ నిటారుగా అయ్యాను. అప్రయత్నంగా నా ఎడం చేతి ముంజేయి చూసుకున్నాను. అక్కడ కట్టెతో కాల్చిన వాత 'మచ్చ'గా నన్ను వెక్కిరిస్తూ. ..గతంలోకి లాక్కెళ్ళింది. ******* పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినా ఇంకా ఉద్యోగం దొరకని రోజులు. ఒక కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థులకు రసాయన శాస్త్రం బోధించడానికి పార్ట్ టైం లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. మొదటిరోజు పాఠం చెప్పడానికి క్లాసులో అడుగుపెడుతూనే కుడివైపు మొదటిబెంచీలో ఐదవ స్థానంలో కూర్చున్న ఆమెను చూస్తూనే కన్ను తిప్పుకోలేకపోయాను. ఆడవాళ్ళలో అందంగా ఉన్నా ఆకర్షణ ఉండని వాళ్ళు కొందరు, ఆకర్షణ, కళ లేకుండా,ఎర్రతోలు, పచ్చతోలు కప్పుకున్న పిండి బొమ్మల్లా ఉండే వాళ్ళు కొందరు. కానీ ఆ రెండూ కలబోసిన అద్భుత సౌందర్యం ఆమెది. ఆమె ముఖపద్మంలో అన్ని అవయవాలు సరైన నిష్పత్తిలో ఉన్నాయి. ముఖ్యంగా వెన్నముద్దల్లాంటి కళ్ళు, ఆ కళ్ళలో మార్దవమైన చూపు నన్ను మొదటి క్షణంలోనే ఆకర్షించాయి. నేను స్థానంలో నిలబడి ఒక్క నిముషం తరగతిగది అంతా పరిశీలించాను. ఎక్కువమంది అబ్బాయిలు నా వైపు చూస్తూ మధ్య మధ్యలో తమ తమ లేడీస్ కు లైన్ వేసుకుంటున్నారు. "శుభోదయం స్టూడెంట్స్" అంటూ నల్లబల్ల వైపు తిరిగి పాఠం మొదలుపెట్టాను. పరమాణునిర్మాణం, ఎలక్రాన్ విన్యాసం, పరమాణు ధర్మాలైన పరమాణు సంఖ్య, పరమాణు ద్రవ్యరాశి, ధనవిద్యుదాత్మకత,ఋణవిద్యుదాత్మకత.. అన్నీ వివరంగా బోధ పరిచాను. సంతోషాతిరేకంతో చప్పట్లు వినిపించినవైపు చూసాను. ఆ అమ్మాయే హుషారుగా కొడుతోంది. ఆమెను చూసి మిగతావారందరూ అందుకున్నారు. ఆమె లేచి నిలబడింది. "ధన్యవాదాలు సర్. చాలా బాగా అర్ధమయ్యేలా చెప్పారు" అని తనపక్కన కూర్చున్న వాళ్లకేసి చూసింది. వాళ్లూ నిలబడ్డారు. "అవును సర్. పదో తరగతిలో విన్నా ఇంత స్పష్టంగా అర్ధం కాలేదు నాకైతే. చాలా బాగా చెప్పారు సర్" అంది మొదటి అమ్మాయి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Q8xH2ZeTL9s

Episode metadata supplied by the publisher feed · Published Mar 3, 2023

Embed this episode

NOW PLAYING

మచ్చ | Machha | Telugu Short Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com

0:00 18:52

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 18 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on March 3, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!