EPISODE · May 21, 2023 · 5 MIN
మధ్య వయసు | Madhya Vayasu | Telugu Short Story | M. Bhanu | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మధ్య వయసు రచన: M. భాను (కథాపఠనం:కే. లక్ష్మీశైలజ) ప్రతి ఒకరి జీవితంలో మధ్య వయసు పున్నాగ వనం లాంటిది. ఎన్నో సౌరభాలను తీసుకువస్తుంది. జీవితం మీద అవగాహనతో మరింత అందంగా తీర్చుకోవచ్చు. మధ్య వయసులో వచ్చే కష్టాలను చిన్న చిన్న చిట్కాలతో దూరం చేస్తే జీవితం నందనవనమే!సాధారణంగా 40 నుంచి 60 వరకు మధ్య జీవితాన్ని మధ్య వయసు అని పేర్కొంటారు. మధ్య వయసులో వచ్చే ముఖ్యమైన అనారోగ్యాలు, బీపీ షుగర్ లాంటివి. ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టేవి హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ వల్ల వచ్చే ఇబ్బందులు. చెప్పుకోలేరు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరు. ఎందుకంటే ఇంట్లో బాధ్యతలు ముందు ఈ సమస్యలు చిన్నవిగానే అనిపిస్తాయి. ఆ ఏముందిలే ఈ వయసులో వచ్చే సమస్యలే కదా కొన్నాళ్లకపోతే ఇవే తగ్గిపోతాయని నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఏదైనా ఊరు వెళ్లినప్పుడు ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఈ ఇబ్బందులు వలన చాలా కష్టమవుతుంది. అలాంటి ఇబ్బందే లతకు వచ్చింది. లత వయసు 50 సంవత్సరాలు. ఆడపిల్లకు పెళ్ళి చేసింది మగ పిల్లవాడు ఉన్నాడు. కూతురు పుట్టినప్పుడు ఆరో నెలలోనే గర్భసంచి జారిపోయిందని డాక్టరు ఆపరేషన్ చేసింది. అప్పుడు పనులు ఒత్తిడిలో బాధ్యతలు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు ఈ వయసు వచ్చేసరికి ఈ మధ్య కొత్తగా యూరిన్ కంట్రోల్లో లేకపోవడం, కొంచెం చల్లగా ఉంటే యూరిన్ కి ఎక్కువగా వెళ్లవలసి రావడం, నిద్ర పట్టకపోవడం, చికాకు కోపం ఎక్కువ అవడం జరుగుతుంది. భర్తకి లత విషయాలు ఏమి పట్టవు. తనకు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా ఒకటే చూసుకుంటాడు. భార్య ఆరోగ్యం గురించి పట్టదు. ఉన్న ఒక్క ఆడపిల్ల అత్తారింటికి వెళ్లిపోయింది చెప్పుకునే ఆడదిక్కులేదు. ఈ సమస్య ఈ మధ్య మరీ ఇబ్బంది పెడుతోంది. భర్తతో డాక్టర్ దగ్గరికి వెళ్తానంటే నీకేమి గుండ్రాయిలా ఉన్నావు అంటాడు తప్పితే మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/7W75cP3A47Q
Embed this episode
NOW PLAYING
మధ్య వయసు | Madhya Vayasu | Telugu Short Story | M. Bhanu | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.