మలిప్రేమ | Maliprema | Telugu Short Story | Lakshmi Sarma B | manatelugukathalu.com episode artwork

EPISODE · Dec 1, 2022 · 9 MIN

మలిప్రేమ | Maliprema | Telugu Short Story | Lakshmi Sarma B | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మలిప్రేమ B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “చూడండి సుభద్రగారు… మీరు చెప్పేది నాకొక్క ముక్క కూడా అర్ధం కావడంలేదు, కాస్త అర్ధం అయ్యేలా చెప్పండి,” అన్నాడు జడ్జి ప్రసాదరావు. “అదేంటయ్యా … ఇంతవిడమరిచి చెప్పినా నీకు అర్ధంకావడంలేదా? సరే విను మళ్ళి చెబుతాను, మా ఆయన ఉన్నాడుకదా ! ఆయనకు నాకు విడాకులు కావాలి, ఆయనను భరించడం నావల్ల కావడంలేదు. రోజూ కీచులాటలే, మాకు ఎంత తొందరగా విడాకులిప్పిస్తే అంత ప్రశాంతంగా ఉందామనుకుంటున్నాం” ఎదురుగా ఉన్న భర్తవైపు కోపంగా చూస్తూ చెప్పింది. ఒక్కసారిగా కోర్టు హాలంతా నవ్వులతో ధ్వనించింది. జడ్జి కూడా కడుపుపట్టుకుని మరీ నవ్వుతున్నాడు. సుభద్రమ్మకు , ఆనందరావుకు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అర్ధంకాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. “సైలెన్స్” అంటూ జడ్జిగారు టేబుల్ పైన టకటకమని శబ్ధంచేసారు. “సుభద్రగారు … మీ ఇద్దరిని చూస్తుంటే ఆరుపదులు దాటినవాళ్ళలా ఉన్నారు. తెల్లగా పండిపోయిన తల, ముడతలుపడిన శరీరం.. బాధ్యతలన్నీ తీరిపోయి ఒకరిమీద ఒకరు ఆధారపడే వయసులో, ఈ విడాకుల గోలేంటో మాకు తోచడంలేదు, మీ ఆరోగ్యం బాగానే ఉందికదా? లేకా ఏమైనా చిత్త చాంచల్యంలాంటిదేమైనా వచ్చిందా?,” అడిగాడు జడ్జి ప్రసాదరావు. “జడ్జిసారు … మేము మంచిగానే ఉన్నాము, మా ఇద్దరికి పెన్షన్లు వస్తాయి. ఒకరిమీద ఒకరం ఆధారపడవలసిన అవసరంలేదు. మాకు మేముగా విడివిడిగా ఉండాలని అనుకున్నాము. అంతేకదా సుభద్రా” భార్యవైపు చూస్తూ అన్నాడు ఆనందరావు. “ఆ … అవునవును అంతే,” అంది ఆవిడ తలూపుతూ. “విడాకులంటే ఏదో తమలపాకులు.. మామిడాకులు అనుకుంటున్నారా ఏంటి మీరు?” అడిగాడొక లాయరు నవ్వుతూ. “నీకెందుకయ్యా మా విషయం… మాకా మాత్రం తెలియదనుకున్నావా? మామిడాకులకు తమలపాకులకు తేడా తెలియదనుకున్నావా? మేము తెలుగుపండితులమే, అవసరంలేని విషయంలో జోక్యం చేసుకోవడం పద్ధతి కాదని తెలుసుకుంటే మంచిది,” చెడామడా అనేసింది. వస్తున్న నవ్వాపుకుంటూ, “ సరే సరే , మరీ ఇంతకు అసలు విషయం చెప్పలేదు , మీరెందుకు విడిపోవాలనుకుంటున్నారు.. మీకు వచ్చిన కష్టాలు ఏంటి? అనేది చెబితే, విడాకులు మంజూరు చెయ్యడానికి ఉంటుంది,” చెప్పాడు జడ్జి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/nDmVOJ-prng

Episode metadata supplied by the publisher feed · Published Dec 1, 2022

Embed this episode

NOW PLAYING

మలిప్రేమ | Maliprema | Telugu Short Story | Lakshmi Sarma B | manatelugukathalu.com

0:00 9:52

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 9 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on December 1, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!