మమతల మధువు ఎపిసోడ్ 1 | Mamathala Madhuvu Episode 1 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 12, 2023 · 16 MIN

మమతల మధువు ఎపిసోడ్ 1 | Mamathala Madhuvu Episode 1 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మమతల మధువు ఎపిసోడ్ 1 రచన: సిహెచ్. సీఎస్. శర్మ  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి ధారావాహిక మమతల మధువు ప్రారంభం “అమ్మా!.. నీవు వ్రాసిన వుత్తరం చేరిందని ఫోన్లో చెప్పాను. కానీ యీ నా పదిహేను నెలల జీవితాన్ని గురించి ఫోన్లో వివరంగా మాట్లాడలేక పోయానమ్మా!..” అందుకే యీ లేఖ వ్రాస్తున్నాను. నాకు నీవు చిన్నతనంలో రోజూ చెప్పేదానివి.. 'అబద్ధం చెప్పకూడదు.. అన్యాయాన్ని చూస్తూ వూరుకోకూడదు, ఎదిరించాలి. ఆపదలోవున్న వారిని ఆదుకోవాలి. వున్నంతలో.. పేదవారికి దానం చేయాలి. మంచి మనిషిగా సంఘంలో బ్రతకాలి. కన్న తల్లిదండ్రులకు ఆనందం కలిగించాలి. మనం చచ్చిపోయిన తర్వాత.. పదిమంది మనలను గురించి గొప్పగా చెప్పుకోవాలి' అని. యీ మాటలను నీవు నాకు చిన్న తనంలో చెప్పేటప్పుడు వినడానికి బోరుగా తోచేది. కానీ.. ఎదిగే కొద్ది ఆ నీ మాటలు మామూలు మాటలు కావని.. జీవిత సత్యాలని, నీవు వాటన్నింటినీ నాలో చూడాలని కలలు కంటున్నావని నాకు అర్థం అయింది. నీ మాటల మీద నాకు నమ్మకం కలిగింది. నీ నుండి విన్న ఆ సత్య సూక్తులు నా గుండెనిండా నిండి వున్నాయమ్మా!.. వూహ తెలిసిన నాటి నుంచీ.. ఆచరణలో పెట్టేదానికి ప్రయత్నించాను. కానీ, అవి నేటి యీ సమాజంలో, ఆచరణకు అందని ఆశయాలుగా.. మన చుట్టూ వున్న చిత్రమైన వ్యక్తుల కారణంగా మారాయమ్మా!.. కానీ, వాటిని నేను నా మనోదర్పణం నుంచి చెరిపి వేయలేదమ్మా!.. అవమానాల పాలైనా ఆచరించే దానికి ప్రయత్నం చేస్నూనే వున్నానమ్మా!.. ఆ కారణంగా.. పదమూడేళ్ళ ప్రాయంలో.. పది సంవత్సరాల క్రిందట.. మీ అందరి దృష్టిలో నేరస్థుణ్ణి అయినాను. నీకు నాన్నకు తాతయ్యకు తలవంపులు కలిగించాను. ఫలితంగా మీరు అందరూ కలసి నాకు వేసిన శిక్ష.. నన్ను మీ నుంచి దూరంగా చదువు నెపంతో పంపివేయడం జరిగింది. చిన్న వయస్సులో.. మీ అందరి మీద కోపం వుండేదమ్మా!.. కానీ ఎదిగేకొద్ది, మీరు నా పట్ల చేసింది కరక్టు అనిపించేది. నీవు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసికొనేవాణ్ణి. మంచి మనిషిగా ఎదిగి.. నీకు నాన్నకు తాతయ్యకు సంతోషాన్ని కలిగించాలనుకొనేవాణ్ణి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/EYbxwE3bL4w

Episode metadata supplied by the publisher feed · Published Feb 12, 2023

Embed this episode

NOW PLAYING

మమతల మధువు ఎపిసోడ్ 1 | Mamathala Madhuvu Episode 1 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 16:07

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 16 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 12, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!