మమతల మధువు ఎపిసోడ్ 10 | Mamathala Madhuvu Episode 10 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Apr 9, 2023 · 18 MIN

మమతల మధువు ఎపిసోడ్ 10 | Mamathala Madhuvu Episode 10 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మమతల మధువు ఎపిసోడ్ 10 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గోపాల్ తనలో జరుగుతున్న సంఘర్షణకు... ముగింపు కలగాలని నిర్ణయించుకొని ఆ గతరాత్రి గౌరి నిదురించిన తర్వాత.. యింట్లోని ఆఫీస్ గదిలోనికి వెళ్ళి... తను ఏ పరిస్థితుల్లో శాంతిని వివాహం చేసికొన్నది... వారిరువురి పరిచయాన్ని గురించి వివరంగా వ్రాసి... తను చేసిన ఆ నేరాన్ని క్షమించవలసినదిగా భీమారావును కోరాడు... వుదయాన్నే జాగింగ్కు బయలుదేరి... ఆఫీస్కు వచ్చి తను వ్రాసిన ఐదు పేజీల కథను కవర్ ను తండ్రి భీమారావుగారి రూమ్లో వారు చూడవలసిన కాగితాలలో వుంచి యింటికి వెళ్ళిపోయాడు. ముగ్గురూ కలసి తొమ్మిది గంటలకు ఆఫీసుకు వచ్చారు.తన గదికి వచ్చిన గోపాల్, ఆది రూమ్లో తన తండ్రి తన విషయంలో అన్న మాటలు అతనికి ఎంతో ఆనందం కలిగించినా... తను వ్రాసిన దాన్ని చదివి తండ్రి ఏమంటాడో... అనే భయం అతని హృదయంలో నిండి వుంది. తన రూమ్లో సీట్లో కూర్చొని ఆ విషయాన్ని గురించే ఆలోచిస్తూ వున్నాడు.భీమారావు తన గదికి వెళ్ళి కాగితాలను ఫయిల్సును ఆఫీస్బయ్ ద్వారా ఆదిత్య గదికి... పంపేశాడు. చాలా కాలంగా కన్స్ట్రక్షన్ కంపెనీని ఓపన్ చేయాలనేది వారి ఆశయం. యిప్పుడు... ఆదిత్య కూడా వచ్చాడు కాబట్టి... తన నిర్ణయాన్ని గోపాల్ కి చెప్పి అతని వుద్దేశ్యాన్ని తెలుసుకోవాలని యింటర్కమ్ గోపాల్ ని పిలిచాడు.గోపాల్... తను వ్రాసిన దాన్ని నాన్నగారు చూచి పిలుస్తున్నారని భావించి... భయంతో మెల్లగా... భీమారావుగారి క్యాబిన్ ని సమీపించాడు. కర్చీఫ్ తో ముఖాన్ని తుడుచుకొని... భీమారావుగారి గదిలో ప్రవేశించాడు.గోపాల్ని చూడగానే భీమారావు... నవ్వుతూ...“నాన్నా! రా కూర్చో.” అన్నాడు.గోపాల్ క్షణంసేపు తండ్రి ముఖంలోకి చూచి... మౌనంగా కుర్చీలో కూర్చున్నాడు."గోపూ! చాలా రోజులుగా నాలో ఒక కోర్కె వుంది. వారానికో ధర అమ్మే యీ పెట్రోలు... డీజిల్ ధరల వల్ల యింక కవర్డ్ కార్లో ట్రక్సును పెంచాలని నాకు లేదు. మనకు యిప్పుడు వున్న బండ్లు చాలు. నా కోర్కె ఏమిటంటే... మనం కన్స్ట్రక్షన్ వింగ్ ఒకదాన్ని ప్రారంభించాలని, యిప్పుడు మన ఆది మనతో వున్నాడుగా.... ట్రక్సు బిజినెస్ నీవు చూచుకో... క్రొత్తగా ప్రాంభించనున్న కన్స్ట్రక్షన్ బిజినెస్ అది చూచుకొంటాడు. నేను వర్క్ష్కాప్ను చూచుకొంటాను. యీ నా ప్రపోజలు నీ అభిప్రాయం ఏమిటి నాన్నా!...” ప్రశ్నార్థకంగా గోపాల్ ముఖంలోకి చూచాడు భీమారావు.గోపాల్ గుండె దడ తగ్గింది. ముఖంలో చిరునవ్వు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/r4-dN4wy9YQ

Episode metadata supplied by the publisher feed · Published Apr 9, 2023

Embed this episode

NOW PLAYING

మమతల మధువు ఎపిసోడ్ 10 | Mamathala Madhuvu Episode 10 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 18:40

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 18 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on April 9, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!