EPISODE · Apr 14, 2023 · 11 MIN
మమతల మధువు ఎపిసోడ్ 13 | Mamathala Madhuvu Episode 13 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి మమతల మధువు ఎపిసోడ్ 13 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సమయం పుదయం ఎనిమిది గంటల ప్రాంతం. ప్రేమ వేగంగా ఆదిత్య యింటిలో ప్రవేశించింది."అత్తయ్యా!... అత్తయ్యా!...”పూజ ముగించి హారతి యివ్వబోతువున్న గౌరి ప్రేమ కంఠం విని..."పూజగదిలోకి రా!...” పిలిచింది.ప్రేమ పూజగదిలోకి ప్రవేశించింది. గౌరి కర్పూర హారతిని యిచ్చి... ప్రేమ ముందుంచి "కళ్ళకద్దుకో... నీ కోర్కె తీరుతుంది.” నవ్వుతూ చెప్పింది గౌరి.ప్రేమ భక్తితో కర్పూర హారతిని కళ్ళకు అద్దుకొంది. హారతి తట్టను క్రింద వుంచి దేవుడికి నమస్కరించి ప్రేమ భుజంపై చెయ్యి వేసి..." పద, హాల్లో కూర్చొని మాట్లాడుకొందాం.”యిరువురూ హాల్లోకి వచ్చారు. భీమారావు ఆది ప్రేమ వారికి ఎదురైనారు. వీరమ్మ హాల్లోకి వచ్చి... “అమ్మగారూ!... టిఫిన్ రడీ...” నవ్వుతూ చెప్పింది. యింతలో... భవానీ... ధనుంజయరావు... సుశీలా లోనికి వచ్చారు.తన చెల్లిని చూచి భీమారావు ఆమెను సమీపించి... "చెల్లి రా కూర్చో” చేయిపట్టుకొని సోఫాను సమీపించాడు. సుశీల సోఫాలో కూర్చుంది.అమ్మ భవానీ తండ్రి ధనుంజయా, సోఫాలో కూర్చున్నారు. ప్రేమ వారిరువురినీ చూచి... ముఖం చిట్లించుకొంది.“అత్తా... ఆ అమ్మాయి ఎవరు?” అడిగింది ప్రేమఆది ప్రక్కన నిలబడి వున్న రామాచారి గారి కూతురు ప్రేమను చూచి."నేను నీ కళ్ళకు కనబడలేదా!..." నవ్వుతూ అడిగాడు ఆది."నీది పాత ముఖమేగా బావా!...”"ఎప్పుడొచ్చావని కూడా అడగలేదు?..."నీ కథంతా వారం వారం అమ్మ నాకు టెలికాస్టు చేస్తూనే వుంటుంది.” నవ్వింది ప్రేమ.“చాలా పెద్దదానివైనావే ప్రేమా నీవు!...”"నీవు ఎదిగావుగా ఆరడుగుల అందగాడిలా!...” కొంటెగా చూస్తూ అంది"అమ్మా!... అత్తా!... యిది ఎంత ఎదిగినా దీని నోటి వేగంలో ఏ మార్పూలేదు. అది తగ్గాలంటే దీనికి వెంటనే పెండ్లి చేసేయాలి... అత్తయ్యా!... మంచి కుర్రాణ్ణి చూడనా!...” నవ్వుతూ అడిగాడు ఆది."నీకు ఆ శ్రమ అవసరంలేదు. నేనే చూచుకొన్నాను. యిదిగో ఫొటో!..." ఆదికి దగ్గరగా వచ్చి తన హ్యాండ్ బ్యాగ్ నుంచి ఆనంద్ ఫొటోను తీసి ఆది చేతికి అందించింది.“బావా!... నీకు శతకోటి వందనాలు... నా మనస్సులోని మాటను చెప్పి యీ ఫోటోను వీళ్ళందరికీ ఎలా చూపాలా అని నేను సతమతమౌతుండగా నీ మాటలతో నాకు సందర్భాన్ని కలిగించావు... నేను చేయాలనుకొన్నది చేసేశాను. యిక మీ అందరి నిర్ణయాన్ని మాత్రం వినాలి. ఓ... తిరుమల దేవుడా!... వీళ్ళంతా నా నిర్ణయంతో ఏకీభవించేలా చెయ్యి. నేను, నా వుడ్బే... కాలినడకతో నీ సన్నిధికి చేరి నిన్ను దర్శిస్తాము.” బిగ్గరగా అందరూ వినేలా చెప్పింది ప్రేమ.ప్రేమ ఈ చర్యకు అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరిముఖాలొకరు చూచుకొన్నారు. ఆది మెల్లగా భీమారావును సమీపించి..."తాతయ్యా... మన ప్రేమ సెలక్షన్!...” ఆనంద్ ఫొటోను అందించాడు భీమారావుకు."వెరిగుడ్ సెలక్షన్ తాతయ్యా!..." ఆనందంగా చెప్పాడు ఆది.గౌరి భీమారావును సమీపించింది. "ఏది మామయ్యా!.... నన్ను చూడనివ్వండి." చేయి చాచింది గౌరి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/pr1mkImspRM
Embed this episode
NOW PLAYING
మమతల మధువు ఎపిసోడ్ 13 | Mamathala Madhuvu Episode 13 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.