EPISODE · Feb 18, 2023 · 15 MIN
మమతల మధువు ఎపిసోడ్ 2 | Mamathala Madhuvu Episode 2 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మమతల మధువు ఎపిసోడ్ 2 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆదిత్య పంపిన ప్రేమ వుత్తరాలను, ఆది డైరీనీ.. సాంతం చదవటం పూర్తి చేసి.. గౌరీ వాల్ క్లాకు చూచింది. సమయం రాత్రి ఒంటిగంట. 'పది వుత్తరాలను చదవడంలో మునిగిపోయాను. సమయం యింత గడిచిందన్న విషయమే తెలీలేదు. ప్రతి వుత్తరాన్ని ప్రేమ ఎంతో చక్కగా వ్రాసింది. తన బావకు తనమదిలో వున్న అభిప్రాయాన్ని నిగూఢంగా తెలియజేసింది. తను దూరంగా వున్నా.. వాడి వున్నతిని శ్రేయస్సును, యశస్సునూ కోరుతూ వుంది. యిలాంటి పిల్ల నాకు కోడలు కాబోతూ వుందంటే అది నా అదృష్టం..' సంతోషంతో మనస్సున అనుకొంది గౌరి. పుత్తరాలన్నింటినీ కవర్లో వుంచి టేబుల్ మీద పెట్టి.. లైట్ ఆర్పీ.. బెడ్లైట్ ఆన్ చేసి గౌరి పడుకొంది. మనస్సు నిండా ప్రేమ.. ఆదిత్యల గురించిన తలపులు.. వారి భావిజీవితాన్ని గురించి ఏవేవో మధురమైన వూహలు.. వారికి వివాహం జరిగినట్లు సంవత్సరం లోపల కవలపిల్లలు పుట్టినట్లు.. తన వారంతా ఎంతోఆనందిస్తూ వున్నట్లు.. చక్కటి వూహాజగత్తులో మురిసిపోతూ.. నిద్రమ్మ ఒడిలో ఒరిగిపోయింది గౌరి. కాలింగ్ బెల్ మ్రోగడంతో.. తొట్రుపాటున మోల్కొంది గౌరి. అప్రయత్నంగా ఆమె చూపులు ఆందోళనతో గోడ గడియారాన్ని చూచాయి. గంట నాలుగు. వేగంగా వెళ్ళి ఆత్రుతతో తలుపు తెరిచింది. ఎదురు గుండా భీమారావుగారు నిలబడివున్నారు. “అమ్మా.!.. భయపడ్డావా?..” గౌరీ ముఖంలోకి నిశితంగా చూస్తూ అడిగాడు. “లేదు మామయ్యా!.. వారు వచ్చారనుకొన్నాను.” సిగ్గుతో తలదించుకొంది గౌరి. “యీ సాయంత్రానికి వాడు వస్తాడమ్మా!.. యిప్పుడు నేను వైజాగ్ బయలుదేరుతున్నాను. నీతో చెప్పి వెళ్ళేదానికి నిన్ను లేపాను.” "యిప్పుడే బయలుదేరుతున్నారా!..” “అవునమ్మా!.. వెళ్ళాలి. బయలుదేరుతున్నాను.” భీమారావుగారి పలుకుల్లో ఎంతో గంభీర్యం నిండి వుంది. క్షణం సేపు వారి ముఖంలోకి చూచి.. “అలాగే మామయ్యా!.. వెళ్ళిరండి. జాగ్రత్త.” అంది గౌరి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/QcU8lJS0T1s
Embed this episode
NOW PLAYING
మమతల మధువు ఎపిసోడ్ 2 | Mamathala Madhuvu Episode 2 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.