EPISODE · Feb 23, 2023 · 12 MIN
మమతల మధువు ఎపిసోడ్ 3 | Mamathala Madhuvu Episode 3 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మమతల మధువు ఎపిసోడ్ 3 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) భీమారావుగారు వైజాగ్ లోని తన బ్రాంచి ఆఫీసు వెళ్ళారు. ఆ బ్రాంచి మ్యానేజర్గా వున్న తన స్నేహితుడు, ఆప్తుడు, బంధువు రామకోటిని భీమారావు కలసికొన్నాడు. యిరువురూ కలసి శాంతి వున్న హాస్పిటల్కు వెళ్ళారు. మురారి.. వారిరువురినీ చూచి ఆశ్చర్యపోయాడు. వారు హాస్పిటల్కు వస్తారని అతను వూహించలేదు. భయంతో.. భీమారావు ఏమి అడుగుతాడోనని తలదించుకొన్నాడు. దృష్టిని ప్రక్కకు మళ్ళించాడు. ఆ యిరువురూ మురారిని సమీపించారు. "మురారి!.. శాంతికి స్పృహ వచ్చిందా!.. ” అడిగాడు రామకోటి. “వచ్చింది సార్!.. ” భయంతోనే పలికాడు మురారి. "మేము శాంతిని చూడవచ్చా!.. " భీమారావుగారి గంభీర వదనం నుండి వెలువడిన ప్రశ్న. యాంత్రికంగా చూడవచ్చనట్లు తల ఆడించాడు మురారి. “పద. ” భీమారావుగారి ఆదేశం. మురారి వార్డు వైపుకు నడిచారు. భీమారావు, రామకోటి మురారిని అనుసరించారు. కొద్దిక్షణాల్లో స్పెషల్రూమ్లో శాంతి బెడ్ను సమీపించారు. భీమారావు ఆమె ముఖం ప్రక్కకు నడిచాడు. శాంతి కళ్ళు మూసుకొని వుంది. మురారి ఎదురుగా శాంతి తలవైపున నిలచి తలవంచి.. "అక్కా.. " మెల్లగా పిలిచాడు. శాంతి కళ్ళు తెరచి చూచింది. కళ్ళతో ఆవైపు చూడమని సైగ చేశాడు మురారి. శాంతి చూపును త్రిప్పి భీమారావును.. వారి ప్రక్కన వున్న రామకోటిని.. చూచింది. ఆమె నయనాలు మదిలోని మూగబాధతో.. అశ్రుపూరితాలైనాయి. ఆవేదనతో కళ్లు మూసుకొంది. "అమ్మా!.. బాధ పడకు, అంతా వీధి నిర్ణయం. యిందులో ఎవరి తప్పూ లేదు. నా మాట ప్రకారం.. నా కొడుకు వూరికి వెళ్ళిపోయాడు. రెండు మూడు నెలల క్రిందట నిన్ను దూరాన్నించి చూచాను. దగ్గరగా చూడటం యిదే తొలిసారి. నిన్ను యీ స్థితిలో యిక్కడ చూడవలసి వస్తుందని నేను ఎన్నడూ వూహించలేదు. యింటికి వచ్చి నిన్ను కలవాలనుకొన్నాను. అమ్మా!.. నీవు ఏ విషయానికి భయపడవద్దు. నేను.. నా బిడ్డ.. నీకు మా జీవితాంతం వరకూ.. ఏ కొరతా రానీయ్యము. నా మాట నమ్ము తల్లీ. ” అనునయం.. ఆప్యాయత.. అభిమానం.. భీమారావుగారి ఆ పలుకుల్లో శాంతికి గోచరించాయి. కళ్ళు తెరచి చేతులు.. కృతజ్ఞతా భావంతో జోడించింది. అంతవరకూ కళ్ళల్లో వున్న కన్నీరు చెక్కిళ్ళ పైకి దిగజారాయి. నవ్వుతూ ఆశగా భీమారావు ముఖంలోకి చూచింది. భీమారావుగారిని ఆమె దగ్గరగా చూడటం యిదే మొదటిసారి. వారి మాటలకు ఆమె మనస్సు పులకించింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/ceRwexlix-w
Embed this episode
NOW PLAYING
మమతల మధువు ఎపిసోడ్ 3 | Mamathala Madhuvu Episode 3 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.