EPISODE · Mar 1, 2023 · 13 MIN
మమతల మధువు ఎపిసోడ్ 4 | Mamathala Madhuvu Episode 4 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మమతల మధువు ఎపిసోడ్ 4 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఎదురుగా రామకోటి ఆనంద్ నిలబడి వున్నారు. వారిని చూచి నవ్వుతూ.. “రండి..” అన్నాడు భీమారావు. ముగ్గురూ లోనికి నడిచారు. సోఫాలను సమీపించారు. ఆనంద్ను పరీక్షగా చూస్తూ.. “కూర్చో బాబు.” ప్రీతిగా పలికాడు భీమారావు. ఆనంద్ సోఫాలో కూర్చున్నాడు. ఎదుటి సోఫాలో కూర్చుంటూ భీమారావు.. “రామా!.. కూర్చో.” అన్నాడు. రామకోటి భీమారావు ప్రక్కన సోఫాలో కూర్చున్నాడు. “టిఫిన్ చేశారా!..” చేశామన్నట్లు తల పంకించాడు ఆనంద్. “అమ్మ బాగుంది కదూ!..” “బాగుందండి.” ఎంతో వీనయం నిండి వుంది ఆనంద్ ఆ పలుకుల్లో. “నేనెవరో నీకు తెలుసా!..” భీమారావుగారి గంభీరమైన ప్రశ్న. “తెలీదండి.” “నేను మీ శ్రేయోభిలాషిని.” “యీ ఒక్క మాటే అమ్మ చెప్పింది.” చెప్పి, తలదించుకొన్నాడు ఆనంద్. భీమారావు రామకోటి ముఖంలోకి, గోపాల్ ముఖంలోకి మార్చిమార్చి చూచాడు. కొద్దిక్షణాలు వారి మధ్యన మౌనంగా గడిచిపోయాయి. సుదీర్ఘమైన నిట్టూర్పును విడచి.. “ఎంతవరకూ చదువుకొన్నావు బాబు?..” అడిగాడు భీమారావు. "బి.యి. మెకానికల్. నేనేదో గొప్ప తెలివికలవాడినని గోల్డ్ మెడల్ యిచ్చారు.” విరక్తిగా నవ్వాడు ఆనంద్. “ఎక్కడయినా పని చేస్తున్నావా?..” "విజయవాడలో ఓ సి.ఐ. పైపుల కంపెనీ ఫ్యాక్టరీలో ఆరునెలలుగా పనిచేస్తున్నాను.” "జీతం ఎంత యిస్తున్నారు?..” “పదివేలు.” భీమారావు సెల్ చేతికి తీసికొని ఎదో నెంబర్కి నొక్కాడు. “గుడ్ యీవినింగ్ సార్!..” “బాలప్పా!.. ఎలా వున్నావ్?” “బాగున్నాను సార్.” “నేను చెప్పేది జాగ్రత్తగా విను.” “చెప్పండి సార్..” "నీవు మన ఆఫీసు దగ్గిరలో ఒక మంచిని యింటిని చూడు.” “ఎంత బాడుగలో సార్!..” “ఎంతయినా ఫరవాలేదు. కారు పార్కింగ్ వుండాలి.” “సరే సార్..” “నాకు యింటిని గురించి ఎప్పుడు చెబుతావు?..” “ఒక్క వారంలోగా సార్.” "అలాగే. మంచి యింటిని చూడు.” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/SPBKejBQ5DU
Embed this episode
NOW PLAYING
మమతల మధువు ఎపిసోడ్ 4 | Mamathala Madhuvu Episode 4 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.