EPISODE · Mar 14, 2023 · 16 MIN
మమతల మధువు ఎపిసోడ్ 6 | Mamathala Madhuvu Episode 6 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మమతల మధువు ఎపిసోడ్ 6 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “వాణ్ణి ఎందుకు కొట్టావ్?..” కోపంతో ఆదిత్యను అడిగాడు మాస్టారు. “వాడు నన్ను.. మీరు చెప్పే పాఠాన్ని విననీకుండా నాకు చక్కలిగింతలు పెట్టాడు. మిమ్మల్ని రమణారెడ్డి అని ఎక్కిరించాడు. తప్పు అని చెప్పాను. వినలేదు. మళ్ళా అదేపనీ చేశాడు. స్కేలుతో కొట్టాను.” నిలబడి నిర్భయంగా జరిగిన యధార్థాన్ని చేతులు కట్టుకొని ఆదిత్య చెప్పాడు. అతనీలోని నిజాయితీకి.. ధైర్యానికి మాష్టారు ఆశ్చర్యపోయాడు. కొద్దిక్షణాల తర్వాత మాష్టారు.. “ఆదిత్యా!.. వాడు తప్పు చేస్తే.. నాతో కదా నీవు చెప్పాలి. నీవు వాణ్ణి ఎలా కొడతావు?.. చూడు.. వాడి తలకు గాయం అయింది. వాళ్ళ అమ్మా నాన్నలు మీ యింటికి వచ్చి.. మీ అమ్మా నాన్నలతో.. గొడవపడితే.. వారికి నీవేం సమాధానం చెబుతావు." ఆవేశంగా అడిగాడు మాస్టారు. "యింతకు ముందు మీతో చెప్పిన నిజాన్నే వారికి చెబుతాను.” నిర్భయంగా ఆదిత్య యిచ్చిన జవాబు యిది. ఆదిత్య ధైర్యానికి.. బదులు పలకలేకపోయాడు.. మాస్టారు. ఆ యిద్దరినీ తన కుర్చీ వద్దకు పిలుచుకొని వచ్చాడు. "చూడండి.. ఆదిత్యా.. కాంతారావు.. మీరు యిలా గొడవలు పెట్టుకోకూడదు. కొట్టుకోకూడదు. అది తప్పు, అందరూ కలసి మెలసి అన్నదమ్ముల్లా వుండాలి. నేను చెప్పేది బాగా వినాలి. యిక మీదట యిలాంటి తప్పును ఎప్పుడూ చేయకూడదు. సరేనా!..” అనునయంగా ఆ యిరువురికి చెప్పాడు మాస్టారు. 'సరే, అన్నట్లు యిరువురూ తలలు ఆడించారు. ప్రక్క గది కిటికీ గుండా జరిగిన సన్నివేశాన్ని చూచింది ప్రేమ. కాంతారావును కొట్టి.. బావ తప్పు చేశాడు అనుకొంది ఆ చిన్నారి. స్కూలు గంట కొట్టారు. అందరు పిల్లలు బయటికి వచ్చారు. ఆదిత్య వెళ్ళి ప్రేమ చేతిని పట్టుకొన్నాడు. ప్రేమ చేతిని విదిలించి దూరంగా పోతూ.. "నీవు నాతో మాట్లాడకు. నీకు కోపం ఎక్కువ. యీ రోజు నీవు కాంతారావును స్కేలుతో కొట్టి తప్పు చేశావు. నేను అమ్మ నాన్న.. అత్తయ్య మామయ్యలతో చెబుతాను.” బుంగ మూతితో కోపంగా చెప్పింది ప్రేమ. ఆదిత్య ఆమెకు ఎదురుగా ముందుకు నడవనియ్యకుండా నిలబెట్టాడు. “నీకు నేను చేసింది తప్పుగా తోచిందా ప్రేమా..” “అవును.” "వాడు ఏం చేశాడో నీకు తెలుసా!..”. “తెలీదు.” “అయితే.. నాదే తప్పని నీవు ఎలా అంటావ్?..” “కాంతారావు తలపై నీవు కొట్టి రక్తం వచ్చింది.. కాబట్టి.. కళ్ళను పెద్దవిగా చేసి ఆదిత్య ముఖంలోకి చూస్తూ అంది ప్రేమ. “వాడు చేసిన తప్పు నీకు..” "ఏం చేశాడు?..” "నేను మాస్టారు చెప్పే పాఠం వింటుంటే.. నాకు చక్కలిగింత పెట్టాడు. మాస్టారుగారిని ఎక్కిరించాడు. తప్పు అని చెప్పాను. నా మాట వినలేదు. తిరిగి అదే తప్పు చేశాడు. అందుకే.. నాకు కోపం వచ్చింది.” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/t0bV1BWguJo
Embed this episode
NOW PLAYING
మమతల మధువు ఎపిసోడ్ 6 | Mamathala Madhuvu Episode 6 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.