EPISODE · Mar 28, 2023 · 15 MIN
మమతల మధువు ఎపిసోడ్ 7 | Mamathala Madhuvu Episode 7 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మమతల మధువు ఎపిసోడ్ 7 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “ఆదీ!.."తండ్రి పిలుపు విన్న ఆది పరుగున వరండాలోకి వచ్చాడు."ఏం నాన్నా!...""నీకు మన వీరగోవిందయ్య తెలుసుగా!...”"పాండూ నాన్నగారు. తెలుసు నాన్నా.”"ఆ గోవిందు మన దగ్గర ఆరు నెలల క్రిందట యిరవై వేలు అప్పుగా తీసికొన్నాడు. పోయిన వారమే యిస్తానన్నాడు. నేను మద్రాస్ వెళ్ళానుగా!... అందువల్ల మన యింటికి రాలేదేమో. తాతయ్యకూ యివ్వలేదట. నీవు వెళ్ళి... మా నాన్నగారు డబ్బును తీసికొని రమ్మన్నారని చెప్పిరా!... సరేనా!...”“అలాగే నాన్నా!...” వీధిలోకి పరుగెత్తాడు ఆది.ఐదు నిముషాల్లో వీరగోవిందయ్య యింటిని సమీపించాడు.ఆ సమయంలో... యిరువురి వ్యక్తులతో గోవిందయ్య వసారాలో కూర్చొని, ఏదో వ్యాపార విషయం మాట్లాడుతున్నాడు. ఆది వీరగోవిందయ్యకు కనుపించాడు, తన్ను పిలుస్తాడని అనుకొన్నాడు. అతను పిలవలేదు. 'ఏదో ముఖ్యమైన విషయంగా వుంది. అందుకే నన్ను చూచీ చూడనట్లు వాడితో మాట్లాడుతున్నాడు. కాసేపు ఆగుదాం.' అనుకొని పావుగంటసేపు వారికి దూరంగా నిలబడ్డాడు ఆది.ఆ ముగ్గురి మధ్యనా చర్చ ముగియలేదు. అరగంట అయింది. యిక లాభంలేదని... ఆదిత్య గోవిందును సమీపించాడు.గోవిందయ్య ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని వున్నాడు. ఆ యిద్దరూ నులక మంచంలో కూర్చొని వున్నారు. “పన్నిండు వేలకు ఒక్క పైసా తగ్గించను.” ఖచ్చితంగా చెప్పాడు గోవిందయ్య. వారిరువురూ మంచం నుంచి లేచారు. “మేము ఫయనల్గా చెబుతున్నాము. పదివేలకు తీసుకొంటాము.” ఆ యిరువురిలో ఒకతను చెప్పాడు.“పది వేలకు యివ్వను.” గోవిందయ్య ఖచ్చితంగా చెప్పాడు.వారు... "మా సొమ్ము మీకు ప్రాప్తం లేదు.” ఏదో గొణుగుతూ ఆ యిద్దరూ వెళ్ళిపోయారు.గోవిందయ్య ఆదిని చూచాడు. “ఏరా!... ఎందుకు వచ్చావ్?...” కోపంగా అడిగాడు."మాకు యివ్వవలసిన యిరవై వేలు తీసుకొని మా యింటికి రండి. మా నాన్నగారు చెప్పమన్నారు.”"డబ్బు యిప్పుడు నా దగ్గర లేదు. పదిరోజుల తర్వాత యిస్తానని చెప్పు మీ నాన్నకు.”“వారం రోజుల క్రిందటే... మా నాన్నకు యిస్తానని చెప్పారట కదా!...”“చెప్పాను.”“అయితే... యివ్వండి.” నిక్కచ్చిగా అడిగాడు ఆది.“ఒకసారి చెబితే నీకు అర్థం కాదంట్రా!... పోరాపో నేను యివ్వను. పోయి నీ అబ్బకు చెప్పు.” అవేశంగా అన్నాడు గోవిందయ్య.‘అబ్బ, అన్న మాటకు ఆదికి కోపం వచ్చింది. కనుబొమ్మలు ముడిపడ్డాయి. “మాట తప్పిన మనిషి... మనిషి కాదు జంతువు.” ఆవేశంతో అన్నాడు ఆది."ఏందీ... ఏం కూశావురా!... నేను జంతువునా!...” కోపంతో ఆది చెంపపై కొట్టాడు గోవిందయ్య.ఆదిత్య కళ్ళలో నీళ్ళు నిండాయి. ఆది ఆగ్రహం హద్దులు దాటింది. చుట్టూ కలయ చూచాడు. ప్రక్కనే రాళ్ళగుట్టు వుంది. వేగంగా నడిచి వంగీ ఒక రాయికి చేతికి తీసుకొన్నాడు. గోవిందయ్య వైపుకు విసిరాడు, తన యింటి వైపుకు పరుగు తీశాడు.ఆ రాయి గోవిందయ్య తలకు తగిలింది. చర్మం చిట్లింది. రక్తం... తాకి రక్తాన్ని చూచి 'అమ్మా' అంటూ కుర్చీలో కూలపడ్డాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Embed this episode
NOW PLAYING
మమతల మధువు ఎపిసోడ్ 7 | Mamathala Madhuvu Episode 7 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.