మమతల మధువు ఎపిసోడ్ 9 | Mamathala Madhuvu Episode 9 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Apr 5, 2023 · 20 MIN

మమతల మధువు ఎపిసోడ్ 9 | Mamathala Madhuvu Episode 9 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మమతల మధువు ఎపిసోడ్ 9 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ రాత్రి గౌరి... గోపాల్తో తనకు భవానికీ... మధ్యన జరిగిన సంభాషణను గురించి తెలియజేసింది. ప్రేమకు ఆదిత్య మీద వున్న చిన్ననాటి అభిమానం యిప్పుడు లేదని తెల్చింది.అంతా విన్న గోపాల్ కి ... తన చెల్లెలు ఆదిత్యకు ప్రేమ పేరిట వ్రాసిన లేఖల వల్ల ఆమె అభిప్రాయం తేటతెల్లమయింది. కానీ... వయస్సు వచ్చి ప్రేమ మనస్సు మారిందన్న మాట అతనికి ఆవేదనను కలిగించింది. వారి చిన్న నాటినుంచీ... భీమారావు..తను... గౌరి... భవాని ధనుంజయరావు... ఆయన తల్లి సుశీలకు... ప్రేమ ఆదిత్య వివాహం జరిపించాలనే కోరిక. పెద్దల నిర్ణయం మారలేదు. ఆది నిర్ణయం మారలేదు... కానీ ప్రేమ నిర్ణయం మారింది."ప్రేమకు యిష్టం లేనప్పుడు... ఆమెను నొప్పించి, బలవంతంగా కేవలం మన యిష్టానుసారం ఆది ప్రేమల వివాహం జరిపించడం న్యామయా గౌరీ!.. అలా చేయ కూడదని నా అభిప్రాయం.” తన అభిప్రాయాన్ని గౌరికి తెలియజేశాడు గోపాల్. భర్త చెప్పిన మాటల్లో వున్న నిజాన్ని గ్రహించింది గౌరి. మౌనంగా వుండిపోయింది. పడకగదిలో భవానీ భర్తతో ఆ రోజు తనకూ గౌరికీ జరిగిన సంభాషణ గురించి... ప్రేమ పేరున తను ఆదిత్యకు వ్రాసిన లెటర్లును గురించి ఎంతో విచారంతో చెప్పింది. అంతా విన్న ధనుంజయరావు..."భవానీ!... మన కాలానికి యీ కాలానికి వ్యక్తుల మనస్తత్వాల్లో ఎంతో వ్యత్యాసం, యీ జనరేషన్కు స్వతంత్ర భావాలు అధికం. అది తప్పా రైటా... తన నిర్ణయం వల్ల తల్లిదండ్రులు సంతోష పడతారా.. బాధపడతారా అనే విచక్షణా భావన నేటి యువతీయువకుల్లో చాలా మందికి లేదు. మన పిల్ల యీ కోవకు చేరిందంటే... అది మన దురదృష్టం... పై వారం బెంగుళూరుకు వెళుతున్నాను. ఈ విషయాన్ని గురించి ప్రేమతో మాట్లాడుతాను. నచ్చ చెప్పేదానికి ప్రయత్నిస్తాను. నీవు బాధపడకు. మనం దైవాన్ని నమ్మేవాళ్ళం. ఆ తండ్రి నిర్ణయం ఎలా వుందో సహనంతో చూద్దాం.” భార్యకు నచ్చచెప్పాడు... ధనుంజయరావు.ఆది తన గదిలో మంచంపై పడుకొని ప్రేమను గురించే ఆలోచిస్తున్నాడు.భీమారావు అతని గది తలుపు తట్టాడు. లేచి వెళ్ళి తలుపు తెరిచాడు ఆదిత్య."ఏం తాతయ్యా!...”"నీతో మాట్లాడాలని వచ్చాను నాన్నా!...”"రండి తాతయ్యా!... కూర్చొండి.”పదేళ్ళనాడు తన్ను... ఆది... 'నీవు' అని సంభోదించేవాడు. యిప్పుడు 'మీరు' అని సంభోదిస్తున్నాడు. పెద్దవాడు అయ్యాడు కదా!.. మంచి వ్యక్తిత్వం... పెద్దల పట్ల ఎంతో గౌరవం వయస్సుతోపాటి సంతరించుకొంది. నవ్వుతూ... మంచం పైన కూర్చున్నాడు భీమారావు.“చెప్పండి తాతయ్యా!...”ఆది ముఖంలోకి పరిశీలనగా చూచీ... “నాన్నా ఆదీ... కొందరు వ్యక్తులు... కొన్ని సందర్భాల్లో పరిస్థితుల రీత్యా పొరపాటు చేస్తారు. తను చేసిన పొరపాటు తన వారిమీద ఎలాంటి ప్రభావాన్ని చూపించకుండా సమర్థవంతంగా జీవితాన్ని కొందరు సాగిస్తారు. తన కష్టం... తన వంతు... సాధించిన ఫలితం అందరి వంతుగా పంచుతారు. ఎల్లప్పుడూ... అందరి ఆనందాన్ని కోరుతారు. యదార్థం చెప్పాలంటే అలాంటి వారే సమర్థవంతమైన మనుషులు. వుత్తము లు. నీవు చేసింది తప్పు అని ఆక్షేపించడం... అందరూ చేయగలపని, కానీ... ఏ పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఆ తప్పు చేయవలసి వచ్చిందో... అతను చేసిన ఆ తప్పు వెనకాలవున్న నీతి... న్యాయం ధర్మం... యీ మూడింటినీ గురించి ఆలోచించేవారు యీ సమాజంలో చాలా తక్కువ. నేను రొండో రకానికి చెందిన వాణ్ణి. విమర్శించడం అంటే నాకు అసహ్యం. అభిమానించడం అంటే నాకు ఎంతో యిష్టం... చిన్నతనంలో నీవూ తప్పులు చేశావు. నా కొడుకూ... తప్పు చేశాడు. తప్పు చేయడం మానవ సహజం. తప్పును తెలిసికొని... ధర్మానికి కట్టుబడి నడవడం వివేకం. నా కొడుకు తన జీవితాన్ని ఎంతో ధర్మబద్ధంగా నడిపాడు. నీవు నీ భావి జీవితాన్ని యుక్తాయుక్త విచక్షణతో ధర్మబద్ధంగా సాగించాలనేది నా కోరిక." భీమారావు చెప్పడం ఆపి మనుమడి... ముఖంలోకి చూచాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/2G1TzH4f-Bk

Episode metadata supplied by the publisher feed · Published Apr 5, 2023

Embed this episode

NOW PLAYING

మమతల మధువు ఎపిసోడ్ 9 | Mamathala Madhuvu Episode 9 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 20:03

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 20 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on April 5, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!