మన ఇల్లు |Mana Illu | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com episode artwork

EPISODE · Sep 13, 2022 · 8 MIN

మన ఇల్లు |Mana Illu | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మన ఇల్లు రచన: లక్ష్మి మదన్ ఇల్లు అంటే ఒక అందమైన ప్రదేశం అది గుడిసె అయిన మేడైనా ఇంద్ర భవనమైనా ఇల్లు ఇల్లే... మనకంటూ ఒక ప్రశాంతతని, స్వేచ్ఛని ఇచ్చేది మన ఇల్లు మాత్రమే. ఎన్నెన్ని ప్రదేశాలు తిరిగి వచ్చినా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా అనిపిస్తుంది ఇంటికొచ్చాక తినే ఆవకాయ అన్నమో... పెరుగన్నమో ఇచ్చే ఆనందం మరిన్ని అధరువులు తిన్నా ఆ రుచి రాదేమో... అందుకే ఇల్లే కదా స్వర్గసీమ అన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఒకప్పుడు మనం పుట్టి పెరిగిన ఇళ్లు తరతరాల చరిత్రకు ఆనవాళ్లుగా ఉండేవి.. తల్లిదండ్రులు మనము ముందు తరాలు పుట్టి ఆ ఇళ్లల్లో ఆడుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని తరలి వెళ్లేవారు పెళ్లిళ్లు చేసుకొని లేదా ఉద్యోగరీత్యా ! ఇక ముందు ముందు తరాలకి అలాంటి ఇళ్ళ తాలూకు జ్ఞాపకాలు ఎక్కువగా ఉండవేమో... ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక ఒక 10 ఏళ్లు దాంట్లో ఉన్న తర్వాత మళ్లీ మరొక కొత్త గూడు కోసం ప్రయత్నం చేసి ఇంకా మంచి లైఫ్ అంటూ వెళ్లిపోవడం జరుగుతుంది ఏది ఏమైనా ఆనాటి మన తరం పెరిగిన ఇళ్ల జ్ఞాపకాలు ఎంతో అద్భుతం. మా ఊళ్లో మా వీధిలో మా ఇల్లు కాస్త ఎత్తుగా ఉండేది వీధిలో మిగతా ఇళ్లన్నీ కొంచెం క్రిందికి ఉండేవి ఎంతో రాజసంగా ఉండే మాఇల్లు ఈ వాడకట్టును చూసే బాధ్యత అంతా నాదే! అనుకునేది పాపం! చాలా మంచి మనసు ఎందుకంటే పెంకులతో పరిచుకుని  పచ్చని చెట్ల కట్టెలతో కట్టిన చక్కని ఇల్లు ..మట్టి గోడలతో ప్రకృతితో మమేకమైన మట్టి ఇల్లు... ఎంత చల్లదనం ఆ ఇళ్లల్లో అసలు వేసవి ఎప్పుడు వచ్చిందో తెలిసేది కాదు చలికాలం ఎప్పుడొచ్చిందో తెలిసేది కాదు, ఒక్క వర్షా కాలం మాత్రం తెలిసేది... ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఇంటి మధ్యలో గవాక్షం ఉండేది కదా దాని ద్వారా వచ్చే వానలు గచ్చులో పడి ఇల్లంతా తుంపర్లు తుంపర్లుగా నిండేది. అయినా ఎక్కువ చలి అనిపించేది కాదు... ఆ వర్షాన్ని చూస్తూ మనసాల ( మండువా)లో పడుకొని ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయా? అని ఆలోచిస్తూ అప్పుడప్పుడు మెరిసిన మెరుపులకి ఆకాశం కనబడుతుంటే నల్లని మేఘాలు కొంచెం భయం కలిగించేలా ఉరుముతుంటే ఏదో తెలియని ఆలోచనలు చుట్టుముడుతుంటే అలా చూస్తూ నిద్రలోకి జారుకున్న మధుర క్షణాలు ఎలా మరువగలం?.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి

Episode metadata supplied by the publisher feed · Published Sep 13, 2022

Embed this episode

NOW PLAYING

మన ఇల్లు |Mana Illu | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com

0:00 8:18

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 8 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on September 13, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!